Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IPL 2026 : ఐపీఎల్ 2026 తర్వాత ధోనీ రిటైర్మెంట్? ఈ నలుగురు స్టార్లకు ఇదే ఆఖరి సీజన్

15 March 2026

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేస్కోండి..

15 March 2026

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి భారీగా పెరగనున్న వాటి ధరలు.. ఎంతంటే?

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Vijaya Deepika: దాతల కోసం హైదరాబాదీ అథ్లెట్ ఎదురుచూపులు.. విజయంలో అండగా నిలవాలంటూ..
తెలంగాణ

Vijaya Deepika: దాతల కోసం హైదరాబాదీ అథ్లెట్ ఎదురుచూపులు.. విజయంలో అండగా నిలవాలంటూ..

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijaya Deepika: దాతల కోసం హైదరాబాదీ అథ్లెట్ ఎదురుచూపులు.. విజయంలో అండగా నిలవాలంటూ..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


The World AbilitySport Youth Games Songkhla, Thailand 2024: భారతదేశపు అతి పిన్న వయస్కురాలిగా, జాతీయ రజత పతక విజేతగా నిలిచిన 14 ఏళ్ల విజయ దీపికా గంగపట్నం.. ఎందరో క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది. క్రీడ పట్ల ఆమెకున్న అచంచలమైన అంకితభావానికి, మక్కువకు నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో ఈవెంట్లలో సత్తా చాటింది. ఇప్పటి వరకు జాతీయస్థాయిలో ఆకట్టుకున్న విజయ దీపిక.. తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు 2024 వరల్డ్ ఎబిలిటీస్పోర్ట్స్ యూత్ గేమ్స్‌లో ఆడే అవకాశం దక్కింది. ఈ గేమ్స్ డిసెంబర్ 1 నుంచి 7 వరకు థాయిలాండ్‌లో నిర్వహించనున్నారు. విజయ దీపికా పారా టేబుల్ టెన్నిస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అయితే, ఆర్థిక సమస్యలు వెంటాడుతుండడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. థాయిలాండ్‌లో విజేత నిలిచేందుకు సహాయం చేయాలని కోరుతోంది.

తల్లి ప్రోత్సాహంతో..

విజయ దీపిక తల్లిదండ్రులు గంగాపట్నం విజయ భాస్కర రాజు, అరుణ. విజయ తండ్రి భాస్కర రాజు ప్రస్తుతం హైదరాబాద్‌లో డిఫెన్స్‌లో అకౌంట్స్‌ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి అరుణ ప్రస్తుతం గృహిణి. ఈమె ఒకప్పుడు వెటరన్ టెన్నిస్‌ ప్లేయర్‌. విజయ సోదరుడు విజయ్ తేజ్ జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్‌గా కొనసాగుతూనే మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నాడు. ఇంట్లో క్రీడాకారులు ఉండడంతో.. విజయ దీపికకు క్రీడలపై ఆసక్తి పెరిగింది.

అయితే, విజయ దీపిక ఆస్టియోజెనిసిస్ ఇంపెర్‌ఫెక్టా అనే జన్యుపరమైన వ్యాధితో జన్మించింది. దీంతో పుట్టిన నాటినుంచే ఈమె ప్రయాణం సవాళ్లతో కూడుకున్నది. ఈ డిసీజ్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అవాంతరాలు ఎదురైనా టేబుల్ టెన్నిస్‌లో మెరిసే స్టార్‌గా మారేందుకు ముందుకు సాగుతూనే ఉంది. తల్లి ప్రోత్సాహం ముందు అన్ని అడ్డంకులను ధీటుగా ఎదుర్కొని తన ఇష్టమైన టేబుల్ టెన్నిస్‌లో ముందుకు సాగుతుంది. బిడ్డ కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ తల్లి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కూతురును విజయ పథంలోకి తీసుకొచ్చింది.

కదల్లేని స్థితి నుంచి.. ఛాంపియన్ వరకు..

ఈ డిసీజ్ కారణంగా ఎముకలను చాలా పెళుసుగా మార్చే పరిస్థితిలో ఉంది. మాములు కదలికలతో కూడా విరిగిపోయేలా ఉంటాయి. కానీ, విజయ దీపిక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో 14 సంవత్సరాల వయస్సులోనే జాతీయ స్థాయి పతకాలను గెలుచుకునే చేసింది. ఫిబ్రవరి 2024లో ఇండోర్‌లో జరిగిన జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో విజయ దీపిక కల నెరవేరింది. ఆమె రెండు రజత పతకాలు, ఒక కాంస్యాన్ని గెలుచుకుంది. పారా టేబుల్ టెన్నిస్‌లో విజయ దీపిక వర్ధమాన తారగా మారింది.

దాతలు సహాయం కోసం..

చక్రాల కుర్చీలోనే ఉన్నా.. ఆటపై పట్టు సాధించింది. జాతీయ స్థాయిలో ఇండోర్‌లో జరిగిన యూటీటీ పారా టేబుల్‌ టెన్నిస్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌గా నిలిచింది. యూటీటీ పారా టీటీ నేషనల్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో డబుల్స్‌లోనూ పతకాన్ని ఒడిసి పట్టి, ఔరా అనిపింది. ఈ క్రమంలో విజయ దీపిక మాట్లాడుతూ.. గొప్ప క్రీడాకారిణిగా ఎదగాలన్నది నా కల. అందుకు తగిన ఆర్థిక సాయం కోసం చూస్తున్నాం. ప్రభుత్వం, క్రీడాసంస్థలు, స్పాన్సర్లు ముందుకొస్తే థాయిలాండ్‌లో జరిగే 2024 వరల్డ్ ఎబిలిటీస్పోర్ట్స్ యూత్ గేమ్స్‌లో నా కల సాకారం చేసుకుంటానని తెలిపింది.

2024 వరల్డ్ ఎబిలిటీస్పోర్ట్స్ యూత్ గేమ్స్‌కు ఎంపిక..

డిసెంబర్ 1 నుంచి 7 వరకు థాయిలాండ్‌లో 2024 వరల్డ్ ఎబిలిటీస్పోర్ట్స్ యూత్ గేమ్స్‌ జరగనున్నాయి. ఈ గేమ్స్‌కు విజయ దీపిక ఎంపికైంది. అయితే, ఈ గేమ్స్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వం తరపునుంచి ఎటువంటి ఆర్థియ సహాయం లభించదు. ప్లేయర్స్ తమ స్వంత ఖర్చులతో ఈ గేమ్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందుకోసం బాగానే ఖర్చు అవుతుంది.

ఈ గేమ్స్‌లో పాల్గొనేందుకు ప్రవేశ రుసుముగా రూ. 17,215లు కట్టాల్సి ఉంది. అలాగే ప్లేయర్ల బోర్డింగ్, లాడ్జింగ్ కోసం రూ. 77,791లు చెల్లించాలి. విమాన ఛార్జీలు రూ. 58,694లు అవుతుండగా.. వీసా ఫీజు, బీమా, ట్రాక్ సూట్ కోసం మరో రూ. 14,000 లు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అన్ని రకాల ఫీజులు కలిపి మొత్తంగా రూ. 1,67,700లు తప్పనిసరిగా పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ఖాతాకు అక్టోబర్ 15, 2024 లేదా అంతకు ముందు జమ చేయాల్సి ఉంటుంది. అయితే, విజయ దీపికకు సహాయంగా తల్లి తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం మరింత డబ్బు అవసరం కానుంది. ఇప్పటికే పలు ప్రయత్నాలు కూడా విజయ దీపిక కుటుంబం ప్రయత్నిస్తోంది. ఎవరైనా దాతలు, ప్రభుత్వం, క్రీడాసంస్థలు, స్పాన్సర్లు ముందుకొస్తే థాయిలాండ్‌లో జరిగే 2024 వరల్డ్ ఎబిలిటీస్పోర్ట్స్ యూత్ గేమ్స్‌లో పాల్గొని పతకం సాధింస్తానని ధీమాగా చెబుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేస్కోండి..

15 March 2026

ఆటో డ్రైవర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై 100శాతం సబ్సిడీ.. భారీగా తగ్గనున్న ఖర్చులు

15 March 2026

Viral News: అబ్బ అదృష్టం అంటే ఈయనదే.. రూ.60 వేలు పెడితే రూ. 25 కోట్లు వచ్చాయి.. ఎలాగంటే?

15 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IPL 2026 : ఐపీఎల్ 2026 తర్వాత ధోనీ రిటైర్మెంట్? ఈ నలుగురు స్టార్లకు ఇదే ఆఖరి సీజన్

15 March 2026

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ సందడి మొదలైపోయింది. మరో రెండు వారాల్లోనే…

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేస్కోండి..

15 March 2026

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి భారీగా పెరగనున్న వాటి ధరలు.. ఎంతంటే?

15 March 2026

Half Day Schools 2026: రేపట్నుంచి అన్ని స్కూళ్లకు ఒంటిపూట బడులు.. స్కూళ్ల కొత్త టైమింగ్స్‌ ఇవే!

15 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IPL 2026 : ఐపీఎల్ 2026 తర్వాత ధోనీ రిటైర్మెంట్? ఈ నలుగురు స్టార్లకు ఇదే ఆఖరి సీజన్

15 March 2026

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేస్కోండి..

15 March 2026

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి భారీగా పెరగనున్న వాటి ధరలు.. ఎంతంటే?

15 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.