Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

బాత్రూమ్‌లో వాడే బక్కెట్లు, మగ్గులు మరకలు, గీతలు పడకుండా ఇలా క్లీన్ చేయండి..నిమిషాల్లో కొత్తవాటిలా మెరుస్తాయి!

5 March 2026

హీరో మెటీరియల్ కాదని అవమానాలు.. కట్ చేస్తే, రూ.25 కోట్లు రెమ్యునరేషన్

5 March 2026

Women’s Day Gift: మహిళలకు అండగా తెలంగాణ సర్కార్.. ఆ విషయంలో వారికే టాప్ ప్రయారిటీ!

5 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»NZ vs SA T20 WC 2026 : డికాక్ చేసిన ఒకే ఒక్క తప్పు.. వరల్డ్ కప్ నుంచి సౌతాఫ్రికా అవుట్
తాజా వార్తలు

NZ vs SA T20 WC 2026 : డికాక్ చేసిన ఒకే ఒక్క తప్పు.. వరల్డ్ కప్ నుంచి సౌతాఫ్రికా అవుట్

.By .5 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
NZ vs SA T20 WC 2026 : డికాక్ చేసిన ఒకే ఒక్క తప్పు.. వరల్డ్ కప్ నుంచి సౌతాఫ్రికా అవుట్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


NZ vs SA T20 WC 2026 : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 మొదటి సెమీఫైనల్ పోరులో న్యూజిలాండ్ జట్టు సంచలన విజయం సాధించింది. సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించి దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓటమికి ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చేసిన ఒక చిన్న పొరపాటే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మ్యాచ్ ఆరంభంలోనే డికాక్ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఆ జట్టును టోర్నీ నుంచే బయటకు పంపేసింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. అనంతరం టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అయితే కివీస్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఒక ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. కగిసో రబడా వేసిన మొదటి బంతిని సీఫెర్ట్ భారీ షాట్ ఆడబోగా, అది టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. ఆ సమయంలో డీప్ ఫైన్ లెగ్ వద్ద ఉన్న డెవాల్డ్ బ్రెవిస్ ఆ క్యాచ్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. కానీ వికెట్ల వెనుక ఉన్న డికాక్ నేను పడతాను అంటూ అరుస్తూ వెనక్కి పరుగెత్తాడు. తీరా బంతి దగ్గరకు వెళ్లేసరికి దానిని అందుకోలేక క్యాచ్ వదిలేశాడు.

pic.twitter.com/n4EG5O9u1t

— Nickk Knight (@KnightNick34590) March 4, 2026

నిజానికి ఆ క్యాచ్ బ్రెవిస్‌కు చాలా సులభం అయ్యేది. కానీ డికాక్ అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల ఆ సువర్ణావకాశం చేజారింది. ఆ సమయంలో సీఫెర్ట్ కేవలం 11 పరుగుల వద్దే ఉన్నాడు. దొరికిన లైఫ్ లైన్ సీఫెర్ట్ వృధా చేయలేదు. ఆ తర్వాత రెచ్చిపోయి ఆడి 33 బంతుల్లోనే 58 పరుగులు బాదాడు. అటు ఫిన్ అలెన్ కూడా 33 బంతుల్లోనే అజేయ సెంచరీ (100*) సాధించడంతో న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే కివీస్ ఒత్తిడిలో పడేదని, ఫలితం మరోలా ఉండేదని దక్షిణాఫ్రికా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విజయంతో న్యూజిలాండ్ రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ పోరులో భారత్ లేదా ఇంగ్లాండ్‌తో కివీస్ తలపడనుంది. సౌతాఫ్రికా మాత్రం మరోసారి సెమీస్ గండం దాటలేక చోకర్స్ ముద్రను అలాగే ఉంచుకుంది. ఒక క్యాచ్ మ్యాచ్‌ను ఎలా మారుస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

బాత్రూమ్‌లో వాడే బక్కెట్లు, మగ్గులు మరకలు, గీతలు పడకుండా ఇలా క్లీన్ చేయండి..నిమిషాల్లో కొత్తవాటిలా మెరుస్తాయి!

5 March 2026

హీరో మెటీరియల్ కాదని అవమానాలు.. కట్ చేస్తే, రూ.25 కోట్లు రెమ్యునరేషన్

5 March 2026

పుచ్చకాయ గింజలు తింటున్నారా..? వాయమ్మో.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

5 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

బాత్రూమ్‌లో వాడే బక్కెట్లు, మగ్గులు మరకలు, గీతలు పడకుండా ఇలా క్లీన్ చేయండి..నిమిషాల్లో కొత్తవాటిలా మెరుస్తాయి!

5 March 2026

బాత్రూంలో నిరంతరం ఉపయోగించే బకెట్లు, మగ్గులు తరచూ నల్లగా, జిడ్డుగా మారుతాయి. బాత్రూమ్‌లు బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే ప్రదేశాలు. ఎప్పటికప్పుడు…

హీరో మెటీరియల్ కాదని అవమానాలు.. కట్ చేస్తే, రూ.25 కోట్లు రెమ్యునరేషన్

5 March 2026

Women’s Day Gift: మహిళలకు అండగా తెలంగాణ సర్కార్.. ఆ విషయంలో వారికే టాప్ ప్రయారిటీ!

5 March 2026

పుచ్చకాయ గింజలు తింటున్నారా..? వాయమ్మో.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

5 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

బాత్రూమ్‌లో వాడే బక్కెట్లు, మగ్గులు మరకలు, గీతలు పడకుండా ఇలా క్లీన్ చేయండి..నిమిషాల్లో కొత్తవాటిలా మెరుస్తాయి!

5 March 2026

హీరో మెటీరియల్ కాదని అవమానాలు.. కట్ చేస్తే, రూ.25 కోట్లు రెమ్యునరేషన్

5 March 2026

Women’s Day Gift: మహిళలకు అండగా తెలంగాణ సర్కార్.. ఆ విషయంలో వారికే టాప్ ప్రయారిటీ!

5 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.