బిగ్ బాస్ ఫేమ్ దివ్వల మాధురి మరోసారి చిక్కుల్లో పడింది. గతంలో తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్ తో కలసి రీల్స్ చేసిన మాధురిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. తాజాగా మరోసారి తిరుమలలో అలాంటి పనే చేసి ఇబ్బందుల్లో పడింది మాధురి. ఏడుకొండలపై గెస్ట్ హౌస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్‌డే వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది మాధురి. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇప్పుడు ఇదే ఆమెను చిక్కుల్లో పడేసింది. ఎందుకంటే.. తిరుమల కొండపైకి కేక్‌లు తీసుకెళ్లడం నిషేధం. మరి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ కొండపైకి మాధురి ఎలా బర్త్ డే కేక్ తీసుకెళ్లారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీటీడీ విజిలెన్స్ కూడా ఆరా తీస్తోంది.
తిరుమలలో తనూజ బర్త్ డే సెలబ్రేట్ చేస్తోన్న దివ్వెల మాధురి.. వీడియో
తిరుమలలో తనూజ, దివ్వెల మాధురి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

