Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Bigg Boss Soniya: మా ఇంటి మహాలక్ష్మి ఇదిగో.. ఎట్టకేలకు కూతురు ఫేస్ రివీల్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో

5 March 2026

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధర !

5 March 2026

పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ముందడుగు.. ఉద్రిక్తతల వేళ ఫ్రాన్స్‌ అధ్యక్షుడి ప్రధాని మోదీ ఫోన్‌..!

5 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Divvela Madhuri Controversy,తిరుమలలో మరోసారి దివ్వెల మాధురి అత్యుత్సాహం.. ఆమె తీరుపై భక్తులు ఆగ్రహం – divvela madhuri another controversy in tirumala after bigg boss runner up thanuja puttaswamy birthday celebrations video viral
ఆంధ్రప్రదేశ్

Divvela Madhuri Controversy,తిరుమలలో మరోసారి దివ్వెల మాధురి అత్యుత్సాహం.. ఆమె తీరుపై భక్తులు ఆగ్రహం – divvela madhuri another controversy in tirumala after bigg boss runner up thanuja puttaswamy birthday celebrations video viral

.By .5 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Divvela Madhuri Controversy,తిరుమలలో మరోసారి దివ్వెల మాధురి అత్యుత్సాహం.. ఆమె తీరుపై భక్తులు ఆగ్రహం – divvela madhuri another controversy in tirumala after bigg boss runner up thanuja puttaswamy birthday celebrations video viral
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల శ్రీవారి సన్నిధిలో బుల్లితెర నటి, బిగ్‌బాస్ సీజన్ 9 రన్నరప్ తనూజ పుట్టిన రోజు వేడులు ఇప్పుడు వివాదంగా మారాయి. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కొండపై దివ్వెల మాధురి కేక్ కట్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి. ఇది ఆలయ పవిత్రతకు విరుద్దమని, కొండపై కేక్‌లు నిషేధమైనా ఎలా వెళ్లాయనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది.

Madhuri In Tirumala
దివ్వెల మాధురి(ఫోటోలు– Samayam Telugu)
తిరుమలలో దివ్వెల మాధురి మరోసారి అత్యుత్సాహాం ప్రదర్శించారు. శ్రీవారి సన్నిధిలో బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించిన ఆమె.. కేక్ కట్ చేయించారు. తిరుమలలో కేక్‌లపై నిషేధం ఉన్నా.. ఆమె కొండపైకి తీసుకొచ్చి తనూజతో కట్ చేయించారు. తాము బసచేసిన గెస్ట్‌హౌస్‌లో ఈ వేడుకలను నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను మాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని కొండపై వ్యక్తిగత వేడుకలు నిర్వహించే విషయంలో పలు నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ, ఈ వేడుకలు నిర్వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ విభాగం కేక్ ఎలా వచ్చిందని ఆరా తీస్తోంది.

గతంలోనూ ఒకసారి దివ్వెల మాధురి తిరుమలలో రీల్స్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. శ్రీవారి సన్నిధిలో దువ్వాడ శ్రీనివాస్‌తో కలసి రీల్స్ చేసి విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ విషయంలో ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఆలయ సంస్కృతిని, సంప్రదాయాలను ఉల్లంఘించారని భక్తులు, టీటీడీ అధికారులు పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయం వద్ద ఫొటో షూట్ చేసి, వాటిని మీడియాతో పంచుకున్నారు. దీనిపై విమర్శలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. అయినాసరే మళ్లీ అలాంటి చర్యకే పాల్పడటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

కాగా, దివ్వెల మాధురి బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ తనూజతో ఆమెకు ఏర్పడిన స్నేహం బయటకొచ్చిన తర్వాత కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆమెతో కలిసి తిరుమలకు వెళ్లి.. పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. కేక్ కట్‌చేయించి.. చీర, గాజులు, బంగారు చెవి దిద్దులను తనూజకు మాధురి కానుకగా ఇచ్చారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘‘హ్యాపీ బర్త్ డే బంగారం.. స్వర్గం నుంచి దిగివచ్చిన మై స్వీట్ హార్ట్.. తనూజతో జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు’’ అంటూ సోషల్ మీడియాలో పెట్టారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, తనూజలు కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

అప్పారావు జివిఎన్

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కథనాలు, రాజకీయాలతో పాటు ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.గతంలో ప్రముఖ మీడియా సంస్థలో ఎడ్యుకేషన్ డెస్క్‌లో పనిచేశారు. ముఖ్యమైన సందర్భాల్లో లైవ్ బ్లాగ్, లైవ్ పేజీల ద్వారా పాఠకులకు నిరంతరాయంగా సమాచారం అందించిన అనుభవం ఆయనకు ఉంది. లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు టర్మ్‌లు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. గతంలో రాశి ఫలాలు, ఆధ్యాత్యిక వార్తలు, పండుగలకు సంబంధించిన ప్రత్యేక కథనాలను ఆయన అందించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జీవీఎన్ అప్పారావు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు.… ఇంకా చదవండి