Acid Attack On 3 Years Child Vijayawada,విజయవాడ: మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి.. స్కూలు టీచర్ అమానుషం.! – teacher attacks on three year old child in vijayawada
విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూలులో మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి జరిగినట్లు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూలు టీచర్ యాసిడ్ పోశారని.. ఆ తర్వాత బాత్‌రూమ్‌లో కిందపడిపోయినట్లు ఫోన్ చేశారని చెప్తున్నారు. ఈ ఘటనలో చిన్నారి ప్రైవేట్ పార్ట్స్‌కు గాయాలైనట్లు తెలిసింది. మరోవైపు ఘటనకు కారణమైనవారిపైనా, స్కూలు యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై స్కూలు టీచర్ యాసిడ్ పోసిన దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్నారి ప్రైవేట్ పార్ట్స్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్కూలు టీచర్ చిన్నారిపై యాసిడ్ పోసినట్లు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటన తర్వాత బాత్‌రూమ్‌లో పడిపోయిందని టీచర్ తమకు ఫోన్ చేశారని చెప్తున్నారు. దీంతో వెంటనే స్కూలు వద్దకు చేరుకుని చిన్నారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఆస్పత్రి వైద్యులు యాసిడ్ దాడి జరిగినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. మరోవైపు యాసిడ్ పోయటంతో గాయాలపాలై.. చిన్నారి బాత్‌రూమ్ కూడా వెళ్లలేని స్థితిలో ఉందని చిన్నారి తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఈ ఘటనలో స్కూలు యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్కూలు యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి