
ప్రజెంట్ మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం ఓటీటీలో మలయాళం సినిమాలు వస్తుంటాయి. ఆయా భాషలకు తగ్గట్టుగా అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం సూపర్ హిట్ సినిమా గురించే. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కాంతార సినిమాను తలపించేలా ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ భరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ ను థ్రిల్ చేశాయి. కేరళలోని ఓ గిరిజన తెగ, వారి సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. ఆ గ్రామంలో నాయర్ అనే పెద్దమనిషి ఉంటాడు.పేరుకు పెద్దమనిషి అయినా ఆయన చాలా కిరాతకుడు. ఏ అమ్మాయిపై అయినా అతని చూపు పడిందంటే ఆమె జీవితం చెదిరిపోవాల్సిందే. ఇదే సమయంలో అడవిలో ఒక ఆదివాసి అమ్మాయి దారుణ హత్యకు గురవుతుంది. దీనికి కారణం నాయరేనని అందరూ అనుమానపడతారు. కానీ ఆ అమ్మాయ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదంటాడు నాయర్. పోలీసులను తన వైపునకు తిప్పుకొని మళ్లీ వేరే మహిళను చెరబడతాడు. అదే సమయంలో అడవిలోకి వెళ్లిన ఆమె భర్త కూడా దారుణ హత్యకు గురవుతాడు.
మరి అడవిలో అంతుచిక్కని హత్యల వెనక ఉన్న మిస్టరీ ఏంటి? అడవుల్లో హత్యలు చేస్తున్నది ఎవరు? వీటికి నాయర్ కు సంబంధం ఉందా? లేదా? దీని వెనుక ఏదైనా అదృశ్య శక్తి ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ‘హత్తనే ఉదయ’ (Hathane Udaya) అనే సినిమా చూడాల్సిందే. ఎ.కె. కున్హిరామన్ పనిక్కర్ తెరకెక్కించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో దేవరాజ్ కోజికోడ్, రామ్ విజయ్, ఆతిరా సావిత్రి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో మనోరమా మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు.
మనోరమా మ్యాక్స్ లో స్ట్రీమింగ్..
Malayalam film #HathaneUdaya (2025) by #AKKunhiramaPanicker, ft. Devaraj Kozhikode, Ram Vijay, Athira Savithri, Sarath Lal & Rajeevan Vellur, now streaming on @manorama_max. pic.twitter.com/mJlhE8sG5O
— CinemaRare (@CinemaRareIN) January 23, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

