కావాల్సిన పదార్ధాలు : బోన్‌లెస్ చికెన్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక కప్పు శనగపిండి , అర కప్పు నూనెను తీసుకోవాలి.
ముందుగా చికెన్ ముక్కలను తీసుకుని దానిని నీటితో శుభ్రపరచుకోవాలి. వాటికి టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కుక్కర్ లో వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు వాటిని బాగా ఉడికించాలి.
ఉడికించిన చికెన్ ముక్కలలో కొద్దిగా కూడా నీరు లేకుండా చేసుకోవాలి. ఈ ముక్కలకు ఒక టీ స్పూన్ కారం, టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, నిమ్మరసం కలుపుకోవాలి.
ఒక గిన్నె తీసుకుని ఉడికించిన చికెన్ ముక్కలు, శనగపిండి, కరివేపాకు ఆకులు, ఒక గ్లాస్ నీళ్ళు పోసి మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి.
స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక శనగ పిండి పట్టించిన చికెన్ ముక్కలను తీసుకుని నూనెలో ఎర్రగా అయ్యేవరకు బాగా వేయించుకోవాలి.






