Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs NZ Final: సూర్య స్కెచ్ అదుర్స్ భయ్యో.. ఫైనల్‌లోనూ మారనున్న టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

7 March 2026

Jeenu Sri Jaswanth Chandra Got Air 23 Rank,రూ.50 లక్షలు వేతనం వద్దని సివిల్స్.. IPS వచ్చినా ప్రయత్నం ఆగలేదు, 23 ర్యాంక్‌తో తండ్రి కలను నిజం చేసిన జశ్వంత్ – jeenu sri jaswanth chandra from kakinada district get all india 23 rank in upsc civil services examination 2025

7 March 2026

ఈ స్కీమ్‌తో మీ డబ్బు డబుల్.. వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ..

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Amaravati International Law University Agreement,అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం – andhra pradesh govt agreement on india international university of legal education and research in amaravati
ఆంధ్రప్రదేశ్

Amaravati International Law University Agreement,అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం – andhra pradesh govt agreement on india international university of legal education and research in amaravati

.By .7 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Amaravati International Law University Agreement,అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం – andhra pradesh govt agreement on india international university of legal education and research in amaravati
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Amaravati India International University Of Legal Education And Research Update: అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యాసంస్థ ఏర్పాటుకు మరో కీలక అడుగు పడింది. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) – పెరల్‌ ఫస్ట్‌ ఐఐయూఎల్‌ఈఆర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు అమరావతిలోని మందడం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒప్పందం చేసుకున్నారు. అమరావతిలోని శాఖమూరు రెవెన్యూలో 55 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • అమరావతికి మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ
  • ఐఐయూఎల్‌ఈఆర్‌ ఏర్పాటు చేస్తున్నారు
  • సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒప్పందం
AP Govt International Law University
అమరావతిలో ప్రతిష్టాత్మక లా యూనిర్శిటీ(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటవుతోంది. రాజధానిలో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పెరల్‌ ఫస్ట్‌ ఆధ్వర్యంలో ఐఐయూఎల్‌ఈఆర్‌ (ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. అమరావతిలోని మందడం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై ఏపీ సీఆర్డీఏ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పెరల్‌ ట్రస్ట్‌‌ల తరఫున ప్రతినిధులు సంతకాలు చేశారు. ఏపీ సీఆర్డీఏ ఐఐయూఎల్‌ఈఆర్‌ కోసం అమరావతిలోని శాఖమూరులో 55 ఎకరాల భూమిని భారత బార్‌ కౌన్సిల్‌ ట్రస్ట్‌ పెరల్‌ ఫస్ట్‌కు కేటాయించింది. సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్, పెరల్‌ ఫస్ట్‌ చైర్మన్‌ ఎంపీ మనన్‌కుమార్‌ మిశ్రా ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అమరావతిలో ఈ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే.. దేశంలోనే అత్యున్నతంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో న్యాయవిద్య, పరిశోధనలు, ప్రొఫెషనల్‌ శిక్షణ అందుబాటులోకి వస్తుంది. ఈ యూనివర్శిటీ నిర్మాణానికి ఏకంగా రూ.300 కోట్లు దశలవారీగా కేటాయిస్తారు. ఈ నిధుల్ని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌ పెరల్‌ ఫస్ట్‌ చూసుకుంటుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తే 200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అంటున్నారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ప్రత్యేక ప్రాజెక్టుల నిర్మాణం, పర్యవేక్షణకు సంబందించి ఏజీఐసీఎల్‌ (అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)ని ఏర్పాటు చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం ఏజీఐసీఎల్‌
స్వయంప్రతిపత్తి గల సంస్థగా మార్చింది.. ఈ మేరకు బిజినెస్‌ రూల్స్‌లో సవరణ చేసింది. ఏపీ ప్రభుత్వం అమరావతిలో ఎన్టీఆర్‌ విగ్రహం స్మృతివనం, ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్‌ సిటీ, అభివృద్ధి వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్పెషల్ ప్రాజెక్టుల కోసం ఏజీఐసీఎల్‌ను కంపెనీల చట్టం కింద ఎస్‌పీవీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమరావతిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఐకానిక్‌ భవనాలపై సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల (హెచ్‌ఓడీ) టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతనూ ఏజీఐసీఎల్‌కు అప్పగించింది ఏపీ ప్రభుత్వం.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి