Jeenu Sri Jaswanth Chandra UPSC 23 Rank: కాకినాడ జిల్లాకు చెందిన జశ్వంత్ చంద్ర సివిల్స్-2025 తుది ఫలితాల్లో ప్రతిభ చాటారు. యూపీఎస్సీలో 23వ ర్యాంకుతో సత్తాచాటారు. ఇప్పటికే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా సరే ఆగలేదు.. ఆ తర్వాత ఐపీఎస్‌గా సెలక్ట్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వల్లభ్‌భాయ్‌పటేల్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. తండ్రి కలను నిజం చేసేందుకు కష్టపడి చదివారు.. ఐఏఎస్ సాధించారు.
హైలైట్:
- సివిల్స్-2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి
- కాకినాడ జిల్లాకు చెందిన జశ్వంత్‌కు 23వ ర్యాంకు
- ఐపీఎస్‌కు ఎంపికైనా సరే ప్రయత్నం ఆగలేదు

జశ్వంత్ కాకినాడలోని ఆశ్రం స్కూల్‌లో పది వరకు చదివారు.. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంటర్ చదివారు. ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. బీటెక్ పూర్తికాగానే క్యాంపస్ ఇంటర్వ్యూలోలో జశ్వంత్ ఎంపికయ్యారు. సామ్‌సంగ్ కంపెనీలో ఏడాదికి ఏకంగా రూ.50 లక్షలకుపైగా ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. జశ్వంత్ మాత్రం సివిల్స్ వైపు అడుగులు వేశారు. 2020లో తొలిసారి ప్రయత్నం చేశారు.. కానీ మెయిన్స్ దగ్గర ఆగిపోయారు. 2021లో మరోసారి ప్రయత్నం చేయగా.. 314 ర్యాంకు వచ్చింది. అప్పుడు ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఉద్యోగంలో చేరారు.. కానీ ఆ తర్వాత వదిలేశారు.
2022లో ఇండయిన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్‌లో ఉద్యోగం వచ్చింది.. ఫారెస్ట్ సర్వీస్‌లో కూడా ర్యాంకు వచ్చినా ఉద్యోగంలో చేరలేదు. మళ్లీ 2023లో మరోసారి యూపీఎస్సీలో 162 ర్యాంక్‌తో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.. హైదరాబాద్ వల్లభ్‌భాయ్‌పటేల్ పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణలో చేరారు. 2024లో మళ్లీ సివిల్స్ రాయగా.. ఇంటర్వ్యూకు వెళ్లినా ర్యాంకు రాలేదు. 2025లో మరో ప్రయత్నం చేసి అనుకున్నట్లు 23వ ర్యాంకుతో ఐపీఎస్‌క ఎంపికయ్యారు జశ్వంత్. మొత్తానికి తన తండ్రి చిరకాల కోరిక ఐఏఎస్ సాధించారు.. జశ్వంత్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఆదర్శం.


