శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. మార్చి 19న తెలుగు ప్రజలు అందరూ తెలుగు నూతననామ సంవత్సరం, ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు పంచాగ శ్రవణం వినడం సహజం. ప్రతి ఒక్కరూ ఈ రోజు తప్పకుండా పంచాగ శ్రవణం వింటుంటారు. ఇక కొంత మంది ప్రత్యేకంగా పండితులను కలిసి తమ జాతక ఫలితాలను, తమ కుటుంబ సభ్యుల జాతక ఫలితాల గురించి తెలుసుకుంటారు.
సింహ రాశి : సింహ రాశి వారి ఆర్థికంగా బాగున్నప్పటికీ, అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యార్థులు ఎంత కష్టపడ్డా సరైన ఫలితాలను అందుకోలేరు. కుటుంబంలో కలహాలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో మార్పు, సీనియర్స్ నుంచి ఒత్తిడి, జీతాలు పెరగకపోవడం, ఒక పని అనుకుంటే మరొక పని అవ్వడం, పని మొదలు పెట్టగానే ఆగిపోవడం లాంటి ఇబ్బందులు ఎదురు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.
కన్యా రాశి : కన్యారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అంతగా కలిసి రావడం లేదు, వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. పనుల్లో ఆటంకాలు ఎదురు అవుతాయి. ముఖ్యంగా స్త్రీల వలన ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చికాకు, ఆందోళన, భయం వంటివి కలుగుతాయి. మరీ ముఖ్యంగా ఈ రాశి వారు అవమానకర సంఘటనలు ఎదుర్కొటారు, నమ్మిన వారే మోసం చేసే ఛాన్స్ ఉంది కాబట్టి, చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.
మేష రాశి : మేష రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం మొదటి దశ ప్రారంభం అవుతుంది. అందువలన మానసిక ఒత్తిడి, ఆందోళన అధికం అవుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఇంటా బయట ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్య మాటపట్టింపులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారు సెప్టెంబర్ నుంచి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు






