Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood : ఆమె గొప్ప హీరోయిన్.. ఇలా ఎందుకు సినిమాలను వదిలేసిందో తెలియదు.. నటి ఊర్వశి కామెంట్స్..

9 March 2026

Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్‌పై కొత్త రూల్స్.. ఒకే ఒక్క క్లిక్‌తో ఈ యాప్ నుంచి సేవలు.. డౌన్ లోడ్ చేసి పెట్టుకోండి..

9 March 2026

మొక్కలు ఏపుగా పెరగాలంటే ఈ ఒక్కటి చాలు.. ఇలా వాడితే మీ గార్డెన్ బంగారమే..!

9 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Actor Sivaji Comments Ys Jagan,’జగన్ గారు నా జోలికి రావొద్దు.. రాజకీయాలు వద్దుకుని సైలెంటయ్యా.. నా సినిమాపై కుట్ర చేశారు’: నటుడు శివాజీ – actor sivaji comments on former cm ys jagan mohan reddy
ఆంధ్రప్రదేశ్

Actor Sivaji Comments Ys Jagan,’జగన్ గారు నా జోలికి రావొద్దు.. రాజకీయాలు వద్దుకుని సైలెంటయ్యా.. నా సినిమాపై కుట్ర చేశారు’: నటుడు శివాజీ – actor sivaji comments on former cm ys jagan mohan reddy

.By .9 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Actor Sivaji Comments Ys Jagan,’జగన్ గారు నా జోలికి రావొద్దు.. రాజకీయాలు వద్దుకుని సైలెంటయ్యా.. నా సినిమాపై కుట్ర చేశారు’: నటుడు శివాజీ – actor sivaji comments on former cm ys jagan mohan reddy
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Actor Sivaji Comments: టాలీవుడ్ నటుడు శివాజీ ఓ వీడియో విడుదల చేశారు. ఆయన నటించిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాను​అడ్డుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. కొందరు నెగిటివ్ రివ్యూలతో టార్గెట్ చేశారని.. దీని వెనుక పేటీఎం బ్యాచ్ ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల గురించి పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటున్నానని.. అయినా సరే కొంతమంది తనను టార్గెట్ చేశారని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు శివాజీ.

హైలైట్:

  • నటుడు శివాజీ ఘాటు వ్యాఖ్యలు
  • సినిమాపై కుట్ర చేశారని ఆరోపణ
  • నెగిటివ్ రివ్యూల ఇవ్వడంపై ఆగ్రహం
Actor Sivaji On Jagan
వైఎస్ జగన్‌పై శివాజీ వ్యాఖ్యలు(ఫోటోలు– Samayam Telugu)
నటుడు శివాజీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన సినిమా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
అడ్డుకునేందుకు కొంతమంది కుట్రపన్నారని ఆరోపించారు. తాను అసలు రాజకీయాల గురించి పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటున్నానని.. అయినా సరే తన సినిమాపై జగన్ పేటీఎం బ్యాచ్‌తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. ‘జగన్ గారు నా జోలికి రావొద్దు’ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. తన సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్ రివ్యూలు రాయించారని శివాజీ మండిపడ్డారు. తన సినిమాను ఆపగలరేమో.. కానీ తనను మాత్రం ఆపలేరన్నారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలోనే తనను ఏమీ చేయలేకపోయారని.. ఇప్పుడు తనను అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు.సీబీఐ కేసులున్న నేతల్ని రాజకీయాల నుంచి తప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరతానన్నారు శివాజీ. రాజకీయ నేతలపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని.. అప్పుడే సీబీఐ వంటి సంస్థలపై నమ్మకం కలుగుతుందన్నారు. తాను రాజకీయాలు వద్దుకుని ఏమీ మాట్లాడటం లేదన్నారు నటుడు శివాజీ. కానీ అమరావతి విషయంలో మాత్రం తన వాయిస్‌ను వినిపిస్తానన్నారు. రాజధాని రైతుల కోసం ఎవరిపైనైనా పోరాడతానన్నారు. తానను ఎవరికి భయపడేది లేదని.. నిజాయితీగా బతుకుతున్నానని, తనను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తాను జనం కోసం బతుకుతానని.. ఎవరో ఇచ్చే డబ్బుల కోసం బతికేవాడిని కాదన్నారు. కనీసం 100మంది సబ్‌స్క్రైబర్లు లేని కొందరు తన సినిమాపై ఇష్టం వచ్చినట్లు రివ్యూలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని నెగిటివ్ రివ్యూలు రాసినా.. తన సినిమా వారం తర్వాతైనా కచ్చితంగా ప్రజలకు దగ్గరవుతుందన్నారు.

శివాజీ నటించిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాపై పనిగట్టుకుని కొందరు నెగిటివ్ రివ్యూలు రాయిస్తున్నారని శివాజీ అంటున్నారు. దీని వెనుక వైఎస్సార్‌సీపీ కుట్ర ఉందని శివాజీ ఆరోపిస్తున్నారు. అందుకే మాజీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్‌గా శివాజీ ఓ వీడియోను విడుదల చేశారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి