Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Suryakumar Yadav : వరల్డ్ కప్ గెలిచాం.. ఇక ఒలింపిక్స్ గోల్డే మా టార్గెట్.. కెప్టెన్ సూర్య సంచలన ప్రకటన

9 March 2026

Tollywood: మహేష్ వద్దన్న కథను ఇష్టపడి చేసిన ప్రభాస్.. కట్ చేస్తే.. భారీ డిజాస్టర్.. ఏ మూవీనో తెల్సా

9 March 2026

Summer: సందడి లేని సమ్మర్‌.. అసలు సమయానికి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరోలు!

9 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ex Mp Kavuri Sambasiva Rao Passed Away,Kavuri Sambasiva Rao: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత.. – former union minister kavuri sambasiva rao health condition update
ఆంధ్రప్రదేశ్

Ex Mp Kavuri Sambasiva Rao Passed Away,Kavuri Sambasiva Rao: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత.. – former union minister kavuri sambasiva rao health condition update

.By .9 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ex Mp Kavuri Sambasiva Rao Passed Away,Kavuri Sambasiva Rao: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత.. – former union minister kavuri sambasiva rao health condition update
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కావూరి సాంబశివరావు .. హైదరాబాద్‍లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రోజు తుదిశ్వాస విడిచారు. కావూరి సాంబశివరావు ఆరోగ్య పరిస్థితి విషమించటంతో.. ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. కావూరు సాంబశివరావు 1943 అక్టోబర్ రెండో తేదీన జన్మించారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా వ్యాపారవేత్తగానూ పేరు తెచ్చుకున్నారు. ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, ఒకసారి కేంద్ర జౌళిశాఖ మంత్రిగా కావూరి పనిచేశారు. 1984,1989, 1998 ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు కావూరి. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో జౌళిశాఖ మంత్రిగా పనిచేశారు.

అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కావూరి రాజకీయ ప్రస్థానం మారిపోయింది. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన.. 2014 తర్వాత బీజేపీ పార్టీలో చేరారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. కావూరి సాంబశివరావుకు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్.. కావూరి సాంబశివరావు కుమార్తె తనయుడే. ఆ రకంగా కావూరి సాంబశివరావు కుటుంబానికి, నందమూరి, నారా కుటుంబాలకు మధ్య బంధుత్వం ఉంది. మంత్రి నారా లోకేష్ ఆదివారం కావూరి సాంబశివరావును ఆస్పత్రిలో పరామర్శించారు.

కావూరి మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి..

మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మరణంపై తెలుగు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని.. కావూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

“కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు కావూరి సాంబశివరావు గారి మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఐదు సార్లు ఎంపీగా మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల ప్రజలకు విశేష సేవలు అందించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.” అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు.

“మాజీ కేంద్ర మంత్రివర్యులు, సీనియర్ రాజకీయ నాయకులు కావూరి సాంబశివరావు గారి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మంచి విద్యావంతుడిగా, వ్యాపారవేత్తగా పేరుపొందిన ఆయన, అనేక పర్యాయాలు పార్లమెంటు సభ్యులుగా ప్రజలకు సేవలందించటం ద్వారా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.” అని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ట్వీట్ చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Nara Lokesh Naidupeta Premier Energies,తిరుపతి జిల్లాకు తీపికబురు.. ఇండస్ట్రియల్ హబ్‌గా ఆ ప్రాంతం.. నారా లోకేష్ ట్వీట్ – naidupeta emerging as a major industrial hub in tirupati district said by it minister nara lokesh

9 March 2026

India Top 3 Richest Women Legislator,దేశంలోని మహిళా ప్రజాప్రతినిధులలో 14 మంది బిలియనీర్లు.. మొదటి మూడు ప్లేసులూ ఏపీ ఎమ్మెల్యేలవే, ఫస్ట్ ఎవరంటే? – top 3 women mps and mlas with highest assets according to adr report

9 March 2026

Actor Sivaji Comments Ys Jagan,’జగన్ గారు నా జోలికి రావొద్దు.. రాజకీయాలు వద్దుకుని సైలెంటయ్యా.. నా సినిమాపై కుట్ర చేశారు’: నటుడు శివాజీ – actor sivaji comments on former cm ys jagan mohan reddy

9 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Suryakumar Yadav : వరల్డ్ కప్ గెలిచాం.. ఇక ఒలింపిక్స్ గోల్డే మా టార్గెట్.. కెప్టెన్ సూర్య సంచలన ప్రకటన

9 March 2026

Suryakumar Yadav : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం (మార్చి 8) టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌ను…

Tollywood: మహేష్ వద్దన్న కథను ఇష్టపడి చేసిన ప్రభాస్.. కట్ చేస్తే.. భారీ డిజాస్టర్.. ఏ మూవీనో తెల్సా

9 March 2026

Summer: సందడి లేని సమ్మర్‌.. అసలు సమయానికి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరోలు!

9 March 2026

శుభ గ్రహాల అనుకూలత.. వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..!

9 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Suryakumar Yadav : వరల్డ్ కప్ గెలిచాం.. ఇక ఒలింపిక్స్ గోల్డే మా టార్గెట్.. కెప్టెన్ సూర్య సంచలన ప్రకటన

9 March 2026

Tollywood: మహేష్ వద్దన్న కథను ఇష్టపడి చేసిన ప్రభాస్.. కట్ చేస్తే.. భారీ డిజాస్టర్.. ఏ మూవీనో తెల్సా

9 March 2026

Summer: సందడి లేని సమ్మర్‌.. అసలు సమయానికి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరోలు!

9 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.