Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అమెరికా రగిల్చిన చిచ్చు..! ఆయిల్‌ కోసం సాగుతున్న యుద్ధంతో ప్రపంచం ఆగమాగం..

9 March 2026

రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన స్టోరీతో రవితేజ సినిమా… కట్ చేస్తే.. భారీ డిజాస్టర్.. ఏ మూవీనో తెలుసా?

9 March 2026

Zombie Cells: చావుకు ఇక చెక్ పెట్టినట్లేనా?.. 150 ఏళ్లు జీవించేలా చేసే ‘అద్భుత మాత్ర’ వచ్చేస్తోంది!

9 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»తిరుమల: లడ్డూ తయారీకి నెయ్యి కొరత లేదు.. అదంతా అవాస్తవం: టీటీడీ – ttd said sufficient ghee stock for making laddu prasadam in tirumala
ఆంధ్రప్రదేశ్

తిరుమల: లడ్డూ తయారీకి నెయ్యి కొరత లేదు.. అదంతా అవాస్తవం: టీటీడీ – ttd said sufficient ghee stock for making laddu prasadam in tirumala

.By .9 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
తిరుమల: లడ్డూ తయారీకి నెయ్యి కొరత లేదు.. అదంతా అవాస్తవం: టీటీడీ – ttd said sufficient ghee stock for making laddu prasadam in tirumala
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమలలో నెయ్యి కొరత ఏర్పడిందని.. శ్రీవారి కైంకర్యాలు, లడ్డూ తయారీలో అంతరాయం కలుగుతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. తిరుమలలో లడ్డూ కొరత లేదని.. అలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దంటూ శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కావాల్సినంత నెయ్యి నిల్వలు తమ వద్ద ఉన్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరిగే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది.

Tirumala
తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి కొరత(ఫోటోలు– Samayam Telugu)
తిరుమలలో నెయ్యి నిల్వలు తగ్గిపోయాయనే ప్రచారం అవాస్తవమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది. శ్రీవారి లడ్డూ తయారీ కోసం కావాల్సినంత నెయ్యి నిల్వలు ఉన్నాయని టీటీడీ వెల్లడించింది. తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద నెయ్యి నిల్వలు సరిపడా లేవంటూ, లడ్డూ ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందంటూ సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని టీటీడీ పేర్కొంది.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కావాల్సిన నెయ్యి కొనుగోలు విధానం మూడంచెలుగా జరుగుతుందని టీటీడీ తెలిపింది. నెయ్యి సరఫరా కోసం ఒకే సంస్థ మీద ఆధారపడమని.. మూడు వేర్వేరు సంస్థల నుంచి నెయ్యి సరఫరా జరుగుతుందని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం తిరుమల శ్రీవారి భక్తులకు పంపిణీ చేసేందుకు 7 లక్షల వరకూ లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, తిరుమల శ్రీవారి కైంకర్యాలు, లడ్డూ తయారీకి ఆంటకం కలుగుతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని శ్రీవారి భక్తులను టీటీడీ కోరింది.

మరోవైపు పుణె నుంచి తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం వద్ద బోల్తాపడింది. జమ్మలమడుగు పరిధిలోని కొండాపురం చిత్రావతి వంతెన వద్ద నెయ్యి ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్‌లోని నెయ్యి మొత్తం నేలపాలైంది. నెయ్యి ట్యాంకర్‌లో సుమారుగా 21వేల లీటర్ల నెయ్యి ఉండగా.. ప్రమాదం జరగటంతో కేవలం ఐదు వందల లీటర్ల నెయ్యి మాత్రమే ట్యాంకర్‌లో మిగిలింది. నెయ్యి ట్యాంకర్ బోల్తా పడిన విషయం తెలిసి స్థానికులు బిందెలు, బకెట్లతో ట్యాంకర్ మొత్తం ఖాళీ చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సరికి 21వేల లీటర్లల కేవలం 500 లీటర్ల నెయ్యి మాత్రమే మిగిల్చినట్లు తెలిసింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా పడడం స్వామివారు కన్నెర్ర చేయడమేనంటూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. తిరుమలలో నెయ్యి నిల్వలు తగ్గిపోయాయని.. ఇప్పటివరకు ఉన్న స్టాక్ రెండు రోజులకు మాత్రమే సరిపోతుందని.. అంత నిర్లక్ష్యంగా టీటీడీ ఉంటోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు. ఈ నేపథ్యంలో లడ్డూ తయారీకి అవసరమైన నెయ్యి నిల్వలు తమ వద్ద ఉన్నాయని.. భక్తులు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి