
బాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ రణ్‌దీప్ హుడా తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. సినిమాల్లో హీరోగానే విలన్ గానూ, సహాయక నటుడిగానూ మెప్పిస్తుంటాడీ హ్యాండ్సమ్ హీరో. ఆ మధ్యన టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ జాట్ లో విలన్ గా మెప్పించాడు రణ్ దీప్. రణతుంగగా క్రూరత్వం పండించి తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. ఇక స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమాలో లీడ్ రోల్ పోషించడంతో దర్శకుడిగా, నిర్మాతగానూ వ్యవహరించాడు రణ్‌దీప్. సినిమాల సంగతి పక్కన పెడితే.. తన వ్యక్తిగత జీవితంతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడీ ఫేమస్ యాక్టర్. గతంలో పలువురు నటీమణులతో రణ్ దీప్ డేటింగ్ చేశాడని ప్రచారంలో ఉంది. అయితే ఏ ఒక్కటి కూడా పెళ్లి పీటల వరకు చేరలేదు. అయితే కరోనా సమయంలో ప్రముఖ నటి లిన్ లైస్రామ్ తో ప్రేమలో పడ్డాడు రణ్ దీప్. చాలా రోజుల పాటు ప్రేమలో మునిగి తేలి పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు.
2023లో రణ్ దీప్- లిన్ లైస్రామ్‌ల వివాహం ఘనంగా జరిగింది. ఇప్పుడు వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు. గతేడాది తమ పెళ్లి రోజు (నవంబర్ 29) ఈ శుభవార్తను పంచుకున్నారీ లవ్లీక పుల్. గత నెలలోనే లిన్‌కి సీమంతం జరిగింది. ఆ ఫొటోలని లిన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా బేబీ బంప్ తో ఉన్న తన భార్య ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రణ్ దీప్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువరు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రణ్‌దీప్- లిన్ లైస్రామ్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
బేబీ బంప్ తో రణ్ దీప్ హుడా భార్య..
View this post on Instagram
కాగా లిన్ లిస్రామ్ తో పెళ్లి నాటికి రణ్ దీప్ వయసు సుమారు 47 సంవత్సరాలు. ఇప్పుడు అతని వయసు దాదాపు 50 ఏళ్లు. రణ్ దీప్ భార్య లిన్ లైశ్రామ్ విషయానికి వస్తే.. ఓం శాంతి ఓం, మేరీ కోమ్, ఉమ్రిక, రంగూన్ వంటి పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

