
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల ఎంపికలో చాలా కచ్చితత్వంతో ఉంటాడు. దర్శకులు చెప్పిన కథలు ఇమేజ్‌కు, మార్కెట్‌కు, కెరీర్ ప్లాన్‌కు సరిపోతుందా లేదా అన్నది కచ్చితంగా చూసుకుంటాడు. అందుకే ఈ మెగా హీరోకు కథ చెప్పాలంటే దర్శకులు, రచయితలు పక్కా స్టోరీతో ముందుకెళ్లాలి. ఈ కారణంగానే రామ్ చరణ్ కొన్ని సినిమాలను వదులుకున్నాడు. అలాగే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక మరిన్ని సినిమాలను రిజెక్ట్ చేశాడు. అలా రామ్ చరణ్ రిజెక్ట్ సినిమాలో కొన్ని హిట్ అయ్యాయి. మరికొన్ని సూపర్ హిట్స్ అయ్యాయి. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఒకే బంగారం, ఏజెంట్, కృష్ణార్జున యుద్దం, ఎటో వెళ్లిపోయింది మనసు తదితర సినిమాలు రామ్ చరణ్ రిజెక్టెడ్ లిస్టులో ఉన్నాయి. అయితే రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన ఓ స్టోరీతో మాస్ మహరాజా రవితేజ ఓ సినిమా తీశాడు.. కట్ చేస్తే.. ఆ సినిమా రవితేజ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?
డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ మూవీ తర్వాత కళ్యాణ్ కృష్ణ రామ్ చరణ్ కోసం ఒక కథను వినిపించాడట. రామ్ చరణ్ కు కూడా స్టోరీ బాగానే నచ్చిందట. అంతేకాదు ఈ సినిమాకు టైటిల్ గా సన్నాఫ్ శంకర్ దాదా అని అనుకున్నారట. అయితే హీరో క్యారెక్టర్ లో కొన్ని మార్పులు చేయాలని రామ్ చరణ్ డైరెక్టర్ కు సూచించారట. అందుకే డైరెక్టర్ కూడా ఒకే అన్నాడట.అయితే ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా అనూహ్యంగా రవితేజ దగ్గరకు వెళ్లిందట. ఆయన వెంటనే ఒకే చెప్పడంతో ఈ మూవీ పట్టాలెక్కిందట. అయితే థియేటర్లలో రిలీజయ్యాక ఈ మూవీకి పూర్తిగా నెగెటివ్ టాక్ వచ్చిందట. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? నేల టికెట్టు. 2018లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా బోల్తా పడింది. ఒక వేళ రామ్ చరణ్ ఈ సినిమా చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో తెలియదు కానీ ఇప్పుడీ వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

