
నమ్మకాలు సమాజంలో భాగంగా ఉంటూ, కొందరి అనుభవాల నుంచి పుట్టి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. తలలో సుడులు ఉండడం, రెండు కనుబొమ్మలు కలిసి ఉండడం వంటి కొన్ని శారీరక లక్షణాలపై అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. రెండు కనుబొమ్మలు కలిసి ఉన్నవారికి రెండు పెళ్లిళ్లు జరుగుతాయని కొందరు పెద్దలు చెబుతుండగా, మరికొందరు వారికి అసలు పెళ్లి కాదని అంటారు. ఈ వాదనల్లో ఎంత నిజముందో ఎవరికి తెలియదు.
ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది
జ్యోతిష్య పండితుల ప్రకారం, రెండు కనుబొమ్మలు ఉన్నవారు కష్టపడి పనిచేసే స్వభావం కలవారని చెబుతారు. అయితే, ఈ లక్షణం స్త్రీలు, పురుషులపై వేర్వేరు ప్రభావాలను చూపిస్తుందట. మత విశ్వాసాల ప్రకారం, స్త్రీలకు కనుబొమ్మలు కలిసి ఉండడం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి స్త్రీలు అత్తవారింట్లో సిరి సంపదలు తీసుకొస్తారని నమ్ముతారు.
ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు
పురుషులకు మాత్రం ఇది అంత మంచిది కాదని కొందరు అభిప్రాయపడతారు. కనుబొమ్మలు కలిసి ఉన్న పురుషులు జీవితంలో ఎంత కష్టపడినా అనేక సమస్యలను ఎదుర్కొంటారని, చిన్న విషయాలకే కష్టాలు వస్తాయని, శ్రమకు తగిన ఫలితం లభించదని చెబుతారు. కనుబొమ్మలు వ్యక్తి ఆత్మిక శక్తికి ప్రతీక అని కొందరు అంటారు. కొన్ని దేశాల్లో, కనుబొమ్మలు కలిసి ఉన్న మగవారికి మాంత్రిక శక్తులు ఉంటాయని విశ్వసిస్తారు. పల్చటి కనుబొమ్మలు ఉన్నవారు తరచు రోగాల బారిన పడతారని, శారీరక శక్తి తక్కువగా ఉంటుందని కూడా కొన్ని నమ్మకాలున్నాయి.
ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది

