
దుబాయ్, మార్చి 10: ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో మంగళవారం (మార్చి 10) ఉదయం దుబాయ్ ఎయిర్ పోర్టు చుట్టూ టెన్షన్ వాతావరణం కనిపించింది. నేటి ఉదయం అక్కడి ఎయిర్ పోర్టు చుట్టూ వైమానిక దాడుల సైరన్లు వినిపించడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అయితే అప్పటికే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల గురించి యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ హెచ్చరికలు జారీ చేసింది. బాంబు దాడుల నేపథ్యంలో ఎయిర్‌పోర్టులోని ప్రయాణీకులు, సిబ్బందిని షెల్టర్లకు తరలించారు. ఎయిర్ పోర్టులోని ఓ ప్రయాణీకుడు చిత్రీకరించిన వీడియోలో ప్యాసెంజర్లను షెల్టర్ల వైపు తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోలో చెక్-ఇన్ కౌంటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఎయిర్‌లైన్ సిబ్బంది సహా దుబాయ్ ఎయిర్ పోర్డు సిబ్బంది, ప్రయాణికులు అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
విమాన ట్రాకింగ్ వెబ్‌సైట్‌ల నుంచి వచ్చిన డేటా ప్రకారం ఫుజైరా, అల్-ఐన్ నగరాల సమీపంలో హోల్డింగ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 30 నిమిషాల తర్వాత ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. మరోవైపు బహ్రెయిన్ విమానాశ్రయంలో కూడా సైరన్లు మోగాయి. సౌదీ అరేబియా, కువైట్ దళాలు 8 డ్రోన్లను సోమవారం ధ్వంసం చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ ధృవీకరించింది. ఇందులో రెండు ఇరానియన్ డ్రోన్లు గత వారం రాస్ తనురా శుద్ధి కర్మాగారాన్ని, మరో రెండు తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలను లక్ష్యంగా దాడి చేశాయి.
#NDTVExclusive | Passengers At Dubai Airport Sent To Shelter Amid Iran Missile Threat#dubaiairport #iranwar pic.twitter.com/jKPKvTVhR8
— NDTV (@ndtv) March 10, 2026
ఇరాన్ వైమానిక దాడుల సమయంలో విమానాశ్రయ టెర్మినల్‌లలో ఒకదాని సమీపంలో డ్రోన్ కూలిపోయింది. దీంతో దుబాయ్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను శనివారం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ దృశ్యాలను అక్కడి ప్రత్యక్ష సాక్షులు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో ఆకాశం నుంచి ఒక వస్తువు పడటంతో విమానాశ్రయ వద్ద పెద్ద స్థాయిలో పొగలు ఎగసిపడటం కనిపించింది. ఆ ఫుటేజ్‌లో ఒక డ్రోన్ ఎయిర్‌పోర్టు సమీపంలో వేగంగా దిగుతుండగా పెద్ద శబ్ధంతో కూలిపోవడం వినిపించింది.
תיעוד: כטב”ם איראני פוגע בנמל התעופה הבין-לאומי בדובאי@itamargalit pic.twitter.com/j5yxV7rNGN
— כאן חדשות (@kann_news) March 7, 2026
ఆ తర్వాత దట్టమైన పొగ గాలిలోకి ఎగసిపడటం చూడొచ్చు. అప్పటికే విమానాశ్రయ కార్యకలాపాలు ఆగిపోవడంతో టెర్మినల్ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ప్రాంతమంతా పొగ వ్యాపించింది. దీంతో వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి భయంతో ‘ఓ మై గాడ్, నేరుగా విమానానికి..’ అని అనడం చూడొచ్చు. కాగా ఇరాన్-ఆమెరికా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 221 బాలిస్టిక్ క్షిపణులు, 1300 డ్రోన్లను గుర్తించినట్లు యూఏఈ తెలిపింది. ఈ దాడుల్లో దుబాయ్, అబుదాబిలోని ఎయిర్‌పోర్టులు, పామ్ జుమైరా, బుర్జ్ అల్ అరబ్ వంటి పలు రద్దీ ప్రాంతాలు కూడా ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

