Visakhapatnam Paramotoring Activities Started: విశాఖపట్నంలో పారా మోటార్ విన్యాసాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి నెలలో పారా మోటార్ ఆగిపోగా.. సోమవారం నుంచి మళ్లీ విన్యాసాలు ప్రారంభించారు. రుషికొండ బీచ్‌లో ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పారా మోటార్ అందుబాటులో ఉంటుంది. మొత్తం నాలుగు పారా మోటర్లు అందుబాటులో ఉంటాయి. పిల్లలు, పెద్దలకు టికెట్ ధరను రూ.3వేలుగా నిర్ణయించారు. ఆ సమీపంలోనే టికెట్లు కూడా జారీ చేస్తారు.
హైలైట్:
- విశాఖ రుషికొండలో పారా మోటార్ విన్యాసాలు
- సోమవారం నుంచి మళ్లీ ప్రారంభించారు
- ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు

ముందు జాగ్రత్తగా ట్రిప్‌కు వెళ్లే ముందు పారా మోటార్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని
నిర్ధారించుకున్న తర్వాతే విన్యాసాలకు అనుమతిస్తారు. ఈ పారా మోటార్‌కు టికెట్ ధరను రూ.3వేలుగా నిర్ణయించారు.. 5 కిలో మీటర్ల వరకు వెళ్లొచ్చు. ఐదేళ్ల వయసుపైన ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. రుషికొండ బీచ్ హెలిప్యాడ్ దగ్గర రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి పారా మోటార్ కోసం టికెట్లు ఇస్తున్నారు.
విశాఖపట్నం వెళ్లేవారికి కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జి కూడా మంచి టూరిజం స్పాట్. రూ.7 కోట్లతో ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు.. జర్మనీ నుంచి 40 ఎంఎం మందం కలిగిన ల్యామినేటెడ్ గాజును తెప్పించి ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఒకేసారి 500 టన్నుల బరువు మోయగలదు.. ఒకేసారి 40మంది పర్యాటకులు బ్రిడ్జిపైకి ఎక్కొచ్చు. బలమైన గాలులు వీచినా తట్టుకునేలా నిర్మించారు. ఇటు కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు కూడా ముగింపు దశకు వచ్చింది.


