
బిగ్‌బాస్-17 ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ డోభాల్ ఆత్మహత్యాయత్నం ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉండగానే అతివేగంగా కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టిన దృశ్యాలు చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు అనురాగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్‌లోకి వచ్చారు. అత్యంత భావోద్వేగానికి గురైన ఆయన, తన తల్లిని ఉద్దేశించి “అమ్మా.. వచ్చే జన్మలోనైనా నాకు ప్రేమను ఇవ్వండి.” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఫాలోవర్స్‌తో మాట్లాడుతూనే, తన ఫార్చ్యూనర్ కారు వేగాన్ని అమాంతం పెంచారు. లైవ్ కొనసాగుతుండగానే కారు వేగం సుమారు 150 కిలోమీటర్లకు చేరుకుంది. ఆ వేగంలో కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను అత్యంత బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లైవ్ ఆగిపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, నుజ్జునుజ్జయిన కారులో నుంచి అనురాగ్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనురాగ్ డోభాల్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. అతివేగంగా ఢీకొట్టడంతో ఆయనకు తీవ్రమైన అంతర్గత గాయాలైనట్లు తెలుస్తోంది. కొంతకాలంగా అనురాగ్ తన కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆయన చేసుకున్న కులాంతర వివాహాన్ని కుటుంబం వ్యతిరేకించడమే కాకుండా, తనను ఆర్థికంగా, సామాజికంగా ఒంటరిని చేశారని గతంలో ఆరోపించాడు. కొన్ని రోజుల క్రితం “నన్ను బతికే స్థితిలో ఉంచలేదు” అంటూ అతను పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ లక్షలాది ఫాలోవర్లను సంపాదించుకున్న యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ఆయన అభిమానులు, నెటిజన్లు షాకవుతున్నారు. మనసులోని బాధను పంచుకునే తోడు కోసం మనిషి ఆరాటపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వైఫల్యాలు, పరీక్షల ఒత్తిళ్లు, కాలేజీల్లో ర్యాగింగ్ .. ఆలోచనలతో జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. అలాంటి వారి సమస్య ఏదైనా తమ గుండె లోతుల్లోని బాధను అర్థం చేసుకొని, ఆప్యాయంగా స్వాంత్వన మాటలు చెప్పడం వారికి ఊరటనిస్తుందని సైకాలజిస్ట్‌లు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే
విరోష్ పెళ్లిపై చిన్నారి పాప అలక.. మమ్మల్ని ఎందుకు పిలవలేదు?
క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్త.. ధనా ధన్ లీగ్ వచ్చేసింది రోయ్.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!

