Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Jana Sena Formation Day,జనసేన ఆవిర్భావ దినోత్సవంపై ఎండల దెబ్బ.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. – heatwave effect jana sena cancels state level formation day event on march 14

10 March 2026

ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తాగితే ఏమౌతుందో తెలుసా? ఆశ్చర్యపోయే ప్రయోజనాలు!

10 March 2026

ఖర్గ్ ఐలాండ్ ను పేల్చేసి ఇరాన్ ను దెబ్బతీసే ఆలోచనలో ట్రంప్

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pithapuram Woman Stuck In Kuwait,బాంబులు పడుతున్నాయ్.. భయంగా ఉంది.. ఇంటికి చేర్చండి సర్.. కువైట్‌లో చిక్కుకున్న పిఠాపురం మహిళ ఆవేదన – pithapuram woman stuck in kuwait pleads with ap government to take her back to hometown
ఆంధ్రప్రదేశ్

Pithapuram Woman Stuck In Kuwait,బాంబులు పడుతున్నాయ్.. భయంగా ఉంది.. ఇంటికి చేర్చండి సర్.. కువైట్‌లో చిక్కుకున్న పిఠాపురం మహిళ ఆవేదన – pithapuram woman stuck in kuwait pleads with ap government to take her back to hometown

.By .10 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pithapuram Woman Stuck In Kuwait,బాంబులు పడుతున్నాయ్.. భయంగా ఉంది.. ఇంటికి చేర్చండి సర్.. కువైట్‌లో చిక్కుకున్న పిఠాపురం మహిళ ఆవేదన – pithapuram woman stuck in kuwait pleads with ap government to take her back to hometown
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఇరాన్. ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పలువురు తెలుగు ప్రజలు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. తమను సొంతూరికి చేర్చాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన కుమారి అనే మహిళ కువైట్‌లో చిక్కుకుపోయారు. తమ ప్రాంతంలో బాంబులు పడుతున్నాయని.. ఇంటి దగ్గర తన పిల్లలు భయపడుతున్నారని, తనను ఇంటికి చేర్చాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కుమారి. బాంబులు పడుతున్న వీడియోను తీసి, వేడుకుంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయటంతో.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Pithapuram woman
కువైట్‌లో చిక్కుకున్న పిఠాపురం మహిళ(ఫోటోలు– Samayam Telugu)
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుని పలువురు తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఉపాధి కోసం సొంత ఊరిని, అయిన వాళ్లను వదిలి పరాయి దేశం వెళ్లిన తెలుగు ప్రజలు.. అనుకోని పరిస్థితులలో అక్కడ చిక్కుకుపోయి, సొంతూరికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కువైట్‌లో చిక్కుకున్న ఓ పిఠాపురం మహిళ.. తనను భారతదేశానికి రప్పించాలంటూ వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన దాకే కుమారి అనే మహిళ నాలుగు నెలల క్రితం కువైట్ వెళ్లారు. అయితే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా దాకే కుమారి అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం బాంబు దాడులతో అక్కడ పరిస్థితి అంతా భయం భయంగా ఉందని.. తనను భారతదేశానికి రప్పించాలంటూ దాకే కుమారి ఏపీ ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

” చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నమస్కారం. నా పేరు దాకే కుమారి. మాది పిఠాపురం ప్రాంతం. నాలుగు నెలల క్రితం కువైట్ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏ మాత్రం బాగోలేదు. బాంబు దాడులతో భయం భయంగా బతకాల్సి వస్తోంది. చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. మేము ఇక్కడే చిక్కుకుపోయాం. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. మా ఇంటి దగ్గర పిల్లలు చాలా భయపడుతున్నారు సర్. ప్లీజ్ నన్ను మా ఇంటికి చేర్చండి సర్ ప్లీజ్.. చాలా భయంగా ఉంది సర్, ఎలాగైనా ఇంటికి చేర్చండి” అంటూ కుమారి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. దీనికి తోడుగా తమ ప్రాంతంలో బాంబులు పడుతున్న వీడియోను తీసి తన పోస్టుకు జత చేశారు కుమారి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం స్పందించి కుమారి కుటుంబాన్ని కువైట్ నుంచి సొంతూరు చేర్చాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు.

మరోవైపు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ హెల్ప్‌లైన్ నంబర్ 0863-2340678 అందుబాటులో ఉంచింది. అలాగే +91 85000 27678 వాట్సాప్ నంబర్, helpline@apnrts.com ఈమెయిల్ అందుబాటులో ఉంచింది. గల్ఫ్ దేశాలలోని తెలుగు ప్రజలు స్థానికంగా ఉండే ఇండియన్ ఎంబసీ సేవలను, ఏపీ ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నంబర్లను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. తెలుగు ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి