కావల్సిన పదార్దాలు: చేప ముక్కలు, నూనె, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ , మసాలా పొడి, ఆవకాయ నూనెను తీసుకోవాలి
ముందుగా చేప ముక్కలను తీసుకుని వాటిని ఉప్పుతో బాగా శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత వాటికి నిమ్మరసం, పెరుగుతో కూడా ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పాన్ లో ఊరగాయ నూనె వేసి వాటిలో అర టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు , ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి.
ఇప్పుడు టమాటా ముక్కలు, ఒక టేబుల్ స్పూన్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఉప్పు వేసి వాటిని బాగా వేయించాలి. కొద్దీ సేపటి తర్వాత చింతపండు రసం, ఒక గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ మీదే ఉంచి బాగా ఉడికించుకోవాలి.
ఉడుకుతున్న పులుసులో ముందుగా పక్కన పెట్టుకున్న చేప ముక్కలను, కట్ చేసిన ఆవకాయ ముక్కలను కూరలో వేసి, దాని మీద మూత పెట్టి మీడియం మంటపైవాటిని బాగా ఉడికించాలి. దించేముందు కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో తినండి






