Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Viral Video : శత్రుత్వం ఏం లేదు.. ఔను వాళ్లందరూ కలిసిపోయారు.. గంభీర్ భార్యతో ఎంఎస్ ధోనీ చిట్

10 March 2026

Pulivendula Siri Sanjeevani,పులివెందుల: కుమారుడి కష్టం తీర్చేందుకు ఓ తల్లి ప్రయత్నం.. వ్యాపారిగా మార్చి, ఎర్రకోట వద్దకు చేర్చింది.. – pulivendula nallapureddypalli pramila grain food products entrepreneur success story

10 March 2026

Telangana: అడవిపందుల కోసం కరెంట్ ఫెన్సింగ్.. ఉదయం పొలానికి వెళ్లి చూడగా..

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Divvala Madhuri On Police Case,సారీ చెప్పేది లేదు.! తిరుమలలో కేసుపై దివ్వెల మాధురి రియాక్షన్.. – duvvada srinivas and divvala madhuri reaction on case tirumala police station
ఆంధ్రప్రదేశ్

Divvala Madhuri On Police Case,సారీ చెప్పేది లేదు.! తిరుమలలో కేసుపై దివ్వెల మాధురి రియాక్షన్.. – duvvada srinivas and divvala madhuri reaction on case tirumala police station

.By .11 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Divvala Madhuri On Police Case,సారీ చెప్పేది లేదు.! తిరుమలలో కేసుపై దివ్వెల మాధురి రియాక్షన్.. – duvvada srinivas and divvala madhuri reaction on case tirumala police station
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఏపీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన స్నేహితురాలు దివ్వెల మాధురి మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. తిరుమలలో దివ్వెల మాధురిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. రీల్స్ చేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తిరుమలలో కేసుపై దివ్వెల మాధురి స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై కేసులు పెట్టారని దివ్వెల మాధురి ఆరోపించారు. తనపై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తానని దివ్వెల మాధురి స్పష్టం చేశారు. తిరుమలలో తాను ఎలాంటి తప్పూ చేయలేదన్న దివ్వెల మాధురి.. చేయని తప్పునకు ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని తెగేసి చెప్పారు. ఓ కార్యకర్తగా దువ్వాడతో కలసి తిరుమల వెళ్లానన్న దివ్వెల మాధురి.. తమతో పాటుగా మరికొందరు కార్యకర్తలు కూడా వచ్చినట్లు తెలిపారు. మమ్మల్ని ప్రశ్నించేవారు పవన్ కళ్యాణ్‌ను ఎందుకు ప్రశ్నించరు అంటూ మాధురి నిలదీశారు.

మరోవైపు తిరుమలలో తాము ఎలాంటి తప్పూ చేయలేదని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించాలని కోరుతున్నట్లు చెప్పారు. పోలీస్ కేసుపై న్యాయపరంగా ముందుకెళ్తామని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. మరోవైపు అక్టోబర్ ఏడో తేదీన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తిరుమలకు వెళ్లారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం దివ్వెల మాధురి శ్రీవారి ఆలయం వెలుపల, పుష్కరిణి ప్రాంతాల్లో రీల్స్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విమర్శలు రావటంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్పందించారు. తిరుమలలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారంటూ తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రీల్స్ చేయడంతో పాటుగా దివ్వెల మాధురి.. తాము సహజీవనం చేస్తున్నామంటూ వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకున్నారని.. తిరుమలలో ఈ వ్యాఖ్యల ద్వారా హిందువుల మనోభావాలను దివ్వెల మాధురి దెబ్బతీశారంటూ టీటీడీ ఏవీఎస్‌వో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దివ్వెల మాధురిపై తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి దివ్వెల మాధురి తిరుమలకు వెళ్లటంతో.. వారి పెళ్లి జరిగిందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని దివ్వెల మాధురి ఖండించారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. కోర్టు తీర్పు వచ్చాకే తాము పెళ్లి చేసుకుంటామని.. అప్పటి వరకూ కలిసే ఉంటామన్నారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Pulivendula Siri Sanjeevani,పులివెందుల: కుమారుడి కష్టం తీర్చేందుకు ఓ తల్లి ప్రయత్నం.. వ్యాపారిగా మార్చి, ఎర్రకోట వద్దకు చేర్చింది.. – pulivendula nallapureddypalli pramila grain food products entrepreneur success story

10 March 2026

Andhra Pradesh: ఏపీలోని మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు.. ఎంతంటే..?

10 March 2026

Annadata Sukhibhava Funds Release,Annadata Sukhibhava: ఏపీ రైతులకు ఉగాది కానుక.. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ఆరోజే! – ap government annadata sukhibhava 3rd installment likely to release on 13th march 2026 reports said

10 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Viral Video : శత్రుత్వం ఏం లేదు.. ఔను వాళ్లందరూ కలిసిపోయారు.. గంభీర్ భార్యతో ఎంఎస్ ధోనీ చిట్

10 March 2026

Viral Video : భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోనీ, గౌతమ్ గంభీర్ పేర్లు ఎప్పుడూ చర్చనీయాంశమే. వీరిద్దరి మధ్య…

Pulivendula Siri Sanjeevani,పులివెందుల: కుమారుడి కష్టం తీర్చేందుకు ఓ తల్లి ప్రయత్నం.. వ్యాపారిగా మార్చి, ఎర్రకోట వద్దకు చేర్చింది.. – pulivendula nallapureddypalli pramila grain food products entrepreneur success story

10 March 2026

Telangana: అడవిపందుల కోసం కరెంట్ ఫెన్సింగ్.. ఉదయం పొలానికి వెళ్లి చూడగా..

10 March 2026

Doomsday Fish: విపత్తు ముంచుకొస్తుందా? సముద్ర తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు..!

10 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Viral Video : శత్రుత్వం ఏం లేదు.. ఔను వాళ్లందరూ కలిసిపోయారు.. గంభీర్ భార్యతో ఎంఎస్ ధోనీ చిట్

10 March 2026

Pulivendula Siri Sanjeevani,పులివెందుల: కుమారుడి కష్టం తీర్చేందుకు ఓ తల్లి ప్రయత్నం.. వ్యాపారిగా మార్చి, ఎర్రకోట వద్దకు చేర్చింది.. – pulivendula nallapureddypalli pramila grain food products entrepreneur success story

10 March 2026

Telangana: అడవిపందుల కోసం కరెంట్ ఫెన్సింగ్.. ఉదయం పొలానికి వెళ్లి చూడగా..

10 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.