Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు.. చంద్రబాబు కీలక ప్రకటన

11 March 2026

ప్రకృతి మాయాజాలం..100 ఏళ్లుగా కురుస్తున్న చేపల వర్షం.. ఆ రహస్యం తెలిస్తే

11 March 2026

గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?

11 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kalvakuntla Kavitha Pawan Kalyan,చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, లోకేష్.. ఎవరేంటో ఒక్క పదంలో తేల్చేసిన కల్వకుంట్ల కవిత.. – kalvakuntla kavitha about chandrababu jagan pawan kalyan and nara lokesh in one word
ఆంధ్రప్రదేశ్

Kalvakuntla Kavitha Pawan Kalyan,చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, లోకేష్.. ఎవరేంటో ఒక్క పదంలో తేల్చేసిన కల్వకుంట్ల కవిత.. – kalvakuntla kavitha about chandrababu jagan pawan kalyan and nara lokesh in one word

.By .11 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kalvakuntla Kavitha Pawan Kalyan,చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, లోకేష్.. ఎవరేంటో ఒక్క పదంలో తేల్చేసిన కల్వకుంట్ల కవిత.. – kalvakuntla kavitha about chandrababu jagan pawan kalyan and nara lokesh in one word
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు కవిత. ఈ సందర్భంగా తెలుగు రాజకీయ ప్రముఖుల గురించి ఒక్కపదంలో చెప్పాలంటూ యాంకర్ ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నేతల గురించి కవిత చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kavitha
చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, లోకేష్.. ఎవరేంటో చెప్పిన కల్వకుంట్ల కవిత..(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భౌగోళికంగా వేరైనప్పటికీ.. రాజకీయాల పరంగా మాత్రం కాదనే చెప్పాలి. ఒక రాష్ట్ర రాజకీయాలపై మరో రాష్ట్రం రాజకీయం అంతో ఇంతో ప్రభావితం చూపుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతలపై, పొరుగు రాష్ట్రాలకు చెందిన నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి.. వారు ఏమనుుకుంటున్నారనే ఆసక్తి ప్రజలలో ఉండటం సహజమే. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులకు సంబంధించి తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత . తండ్రి కేసీఆర్ గురించి, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇలా పలువురు నాయకుల గురించి తన అభిప్రాయాన్ని వన్ వర్డ్ అంటే ఒకే పదంలో చెప్పేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.

యాంకర్ అడిగిన ప్రశ్నకు కల్వకుంట్ల కవిత చెప్పిన సమాధానాల ప్రకారం.. కేసీఆర్ – గొప్ప ఉద్యమ నాయకుడు, రేవంత్ రెడ్డి – ఫ్లాప్ సీఎం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి – గుడ్ లీడర్, వైఎస్ జగన్ – గట్టి లీడర్, వైఎస్ షర్మిల – ఏపీకి సీఎం కావాలని కోరుకుంటున్నా.. బండి సంజయ్ – అన్నను గెలవనివ్వరు, ఏమీ చేయనివ్వరు .. ధర్మపురి అరవింద్- అబద్ధానికి ప్రతిరూపం, ఈటెల రాజేందర్ – గట్టి ఫైటర్, నారా చంద్రబాబు నాయుడు – ఈ వయసులో అద్భుతమైన పట్టుదలతో మళ్లీ సీఎం అయ్యేవరకూ కొట్లాడారు గ్రేట్, నారా లోకేష్ – నేర్చుకుంటున్నాడు నా లెక్కన, పవన్ కళ్యాణ్ – నాన్ సీరియస్ పర్సన్, కల్వకుంట్ల కవిత – ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ.. అంటూ బదులిచ్చారు కవిత. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే బీఆర్ఎస్ పార్టీకి, టీడీపీకి మధ్య సంబంధాలు అంతంతమాత్రమే అనే సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్ నాయకులు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కూడా చంద్రబాబుపై విమర్శలు చేసేవారు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతోంది. అయితే కల్వకుంట్ల కవిత మాత్రం నారా చంద్రబాబు నాయుడు పోరాడిన తీరును మెచ్చుకోవటం విశేషం. అలాగే వైఎస్ జగన్‌ను గట్టి లీడర్ అంటూ అభినందించారు కవిత. చంద్రబాబుతో పోలిస్తే, కేసీఆర్ కుటుంబానికి వైఎస్ జగన్‌తో కాస్త సాన్నిహిత్యం ఎక్కువనే చెప్పాలి. ఈ లెక్కన జగన్‌ను ప్రశంసించడం కంటే చంద్రబాబును మెచ్చుకోవటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి