
మంచు మనోజ్.. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను ఆయన ఆకట్టుకుంటుంటారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ ఫ్యాన్స్ సహా ప్రేక్షకులను, సినీ వర్గాలను ఆకర్షిస్తున్నాయి. మనోజ్ తన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించిన అప్‌డేట్‌ను ఆయన షేర్ చేసుకున్నారు. రాబోయే సినిమాల కోసం గత మూడు వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నానని ఆయన ఈ పోస్ట్‌లో వెల్లడించారు. అలాగే ఆయన పోస్ట్ చేసిన వర్కవుట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటుడిగా మనోజ్ చూపిస్తోన్న పట్టుదల, కృషిని అందరూ అభినందిస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్
ఆ పోస్ట్‌లో మనోజ్ తన తీసుకున్న నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండటానికి సాకులు వెతకకుండా వాటిని పక్కకు పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు. “మూడు వారాల క్రితం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక సౌకర్యంతో రాజీ పడటం లేదు. ఇక సాకులు చెప్పాలని అనుకోవటం లేదు. కేవలం కష్టం మాత్రమే,” అని ఆయన రాశారు. ఇదే క్రమంలో యాక్షన్ సినిమాలు చేయడం ఎంత కష్టమో కూడా ఆయన వివరించారు. “యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ నటించలేరు. ప్రతి పంచ్, దెబ్బ తగిలినప్పుడు పడిపోవటం, ప్రతి దెబ్బకు మీ శరీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు,” అని ఆయన అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..
ఇకపై కేవలం లుక్ కోసం కాకాకుండా..శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని ఆయన చెప్పారు. తన లక్ష్యం “ ధృడమైన వ్యక్తి”లా తయారవడం అని పేర్కొన్నాడు. ఈ అప్‌డేట్‌ను “వీక్ 3” అని పేర్కొంటూ, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, కానీ కేవలం 21 రోజుల్లోనే తాను పూర్తిగా వేరే వ్యక్తిలా అనిపిస్తున్నానని మనోజ్ తెలియజేశారు. ఇటీవల విడుదలైన చిత్రాలతో మంచు మనోజ్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన మిరాయ్ సినిమాతో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన శక్తివంతమైన విలన్ పాత్ర అయిన మహాబీర్ లామా..‘బ్లాక్ స్వోర్డ్’గా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా మనోజ్ చేసిన పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌కు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు లభించాయి. తన పాత్రల్లో ఆయన చూపించిన శారీరక శక్తి, భావోద్వేగ నిబద్ధత మరోసారి ఈ సినిమాతో స్పష్టంగా కనిపించింది.
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..
ఇప్పుడు మంచు మనోజ్ చేస్తోన్న డేవిడ్ రెడ్డి మూవీ తన కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాను హనుమ రెడ్డి యెక్కంటి తెరకెక్కిస్తున్నారు. నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1897 – 1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథతో డేవిడ్ రెడ్డి సినిమా రూపొందుతోంది. అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఇందులో చూపిస్తున్నారు. అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను భారీ లెవల్లో నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన డేవిడ్ రెడ్డి గ్లింప్స్‌కు అన్నీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. దీంతో మనోజ్ న్యూ అవతార్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది మంచు మనోజ్ కెరీర్‌లో బిజీ, ఎగ్జయిట్‌మెంట్ దశ. డేవిడ్ రెడ్డి సినిమాతో బిజీగా ఉన్న మంచు మనోజ్.. పలు ఇతర ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధమవుతున్నారు.
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..

