
ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో ఉన్న ఇండియన్‌టౌన్ రోడ్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న 19 ఏళ్ల నికో బ్రే అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి సెస్నా 150G విమానంలో సరదాగా ఆకాశంలో విహరించేందుకు వెళ్లాడు. అయితే వీళ్లు గాల్లో ఉండగానే సడెన్‌గా విమానం ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే ఫ్లైట్ ల్యాండ్ చేసేందుకు రన్‌వే దగ్గరకగా లేకపోవడంతో.. బ్రే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్లైట్‌ను రోడ్డుపైనే ల్యాండ్ చేయాలని అనుకున్నాడు.
అనుకున్నదే తడువుగా ప్రాణాలకు తెగించి ఫ్లైట్‌ను రోడ్డుపై సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. అది గమనించిన వాహనదారులు రోడ్డుపై విమానం ల్యాండ్ అవవ్వడం చూసి అవాక్కయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్లైట్‌లో ఉన్న బ్రే తో పాటు అతనికి స్నేహితుడికి గాని, రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులకు గాని ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఈ సాహసం చేసిన బ్రే 2025లోనే విమానాన్ని నాడిపేందుకు పైలట్ లైసెన్స్ పొందాడట, ప్రతస్తుతం అతను ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడట. అయితే మొదట్లో ఏ1ఏ రోడ్డులో ప్లైట్‌ను ల్యాండ్ చేయాలని అనుకున్నానని.. కానీ ఆ దారి చాలా ఇరుకుగా ఉందని.. అందుకే ఇండియన్‌టౌన్ రోడ్డులో విమానాన్ని ల్యాండ్ చేసినట్టు తెలిపాడు. అయితే విమానం రోడ్డుపై ల్యాండ్ అవుతున్న దృశ్యాలు స్థానిక వాహన దారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
వీడియో చూడండి..
JUST IN: A Small plane flown by a 19 year old pilot with one passenger successfully makes an emergency landing on Indiantown Road in Jupiter, Florida.
There were cars on the roadway, but the pilot somehow managed to land without hitting a vehicle pic.twitter.com/kawQHg2wae
— DK
(@Nicdarbackupacc) March 7, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


JUST IN: A Small plane flown by a 19 year old pilot with one passenger successfully makes an emergency landing on Indiantown Road in Jupiter, Florida.
