కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు ఎండిన ద్రాక్ష , తురిమిన బెల్లం, రెండు స్పూన్లు చింతపండు రసం, 5 పచ్చి మిర్చి, కొబ్బరి, అర టీ స్పూన్ మెంతులు , ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఎండు మిర్చి , ఒక టీ స్పూన్ తాలింపు గింజలు, రెండు టీ స్పూన్స్ నూనె , ఉప్పును తీసుకోవాలి.
ముందుగా ఒక కప్పు కొబ్బరి, కట్ చేసిన పచ్చిమిర్చి, అర టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ ధనియాలు, కట్ చేసిన ఎండు మిర్చిలను తీసుకుని రోటిలో కానీ మిక్సీలో కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత వీటిని ఒక ఫ్లేట్ లేదా గిన్నెలోకి దీనిని తీసుకోవాలి.
ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకుని దానిలో నిండుగా నీరు పోసి ద్రాక్ష, ఒక కప్పు చింతపండు రసం, అర టీ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా అయ్యే వరకు పది నిముషాల పాటు మీడియం మంట మీద దీనిని బాగా ఉడికించాలి.
ఈ ఉడికిన ద్రాక్ష మిశ్రమంలో ముందుగా చేసి పెట్టుకున్న చేసి ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ మసాలా పొడి వేసి, అది పచ్చి వాసన పోయే వరకు పది నిమిషాలు పాటు బాగా స్టవ్ మీదే ఉంచి మరిగించాలి.
చివర్లో మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు వేసి పోపు పెట్టి దీనిలో కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, వేడి వేడి ద్రాక్ష మసాలా రెడీ. దీనిని తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.






