
టీ20 ప్రపంచకప్ హంగామా ముగిసిన నేపథ్యంలో, ఇప్పుడు ఐపీఎల్ 2026 ఫీవర్ మొదలైంది. అయితే, ఈసారి ఐపీఎల్ పండుగకు పొలిటికల్ ఫీవర్ కూడా తోడైంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్ధత నెలకొనగా.. తాజాగా ఐపీఎల్ మొదటి దశ షెడ్యూల్ విడుదలైంది. మర్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే 20 మ్యాచ్‌ల తేదీలు, వేదికలను ఐపీఎల్ ప్రకటించింది. తొలి దశలో ప్రతీ జట్టు 4 మ్యాచ్‌లు ఆడనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లోని ముఖ్యమైన జట్ల హోం గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు నిర్వహించడానికి భారీగా పోలీస్ భద్రత అవసరం. ఉదాహరణకు, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్ల హోం గ్రౌండ్స్ ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అంతేకాకుండా, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సెకండ్ హోం గ్రౌండ్ అయిన గౌహతి (అస్సాంలో)లో కూడా మ్యాచ్‌లు జరగాలి. ఎన్నికల సమయంలో, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ బలగాలను ఎన్నికల విధులకు కేటాయిస్తాయి. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్‌లకు అవసరమైన భద్రతను అందించడం కష్టమవుతుంది.
ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు
మూడు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను వెలువరిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. గతంలో కూడా 2009, 2014, 2019, 2024 వంటి ఎన్నికల సమయాల్లో సరిగ్గా ఇదే విధానం అనుసరించారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. మార్చి 28న బెంగళూరు వేదికగా జరిగే ఈ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలబదనున్నాయి. ఈసారి ఐపీఎల్ సీజన్ ఏకంగా 84 మ్యాచ్‌లతో రెండు నెలల పాటు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనుంది. ఇది క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు.
ఇది చదవండి: పోలీసులు థర్డ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తారంటే.? ఎవ్వరికీ తెలియని నిజం..
View this post on Instagram
ఇది చదవండి: మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే డబ్బే డబ్బు..

