Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Eluru News,ఏలూరు: భర్తను బెదిరిద్దామని కూల్‌డ్రింక్ బాటిల్‌లో పురుగులమందు దాచిన భార్య.. అనుకోకుండా తాగి చిన్నారి మృతి – five year old child died after drinking pesticide mistaking it for a cool drink in eluru district

11 March 2026

వేసవి తాపం నుంచి కాపాడే 10 అద్భుతమైన ఇండియన్ డ్రింక్స్..! వీటితో హెల్త్‌, బాడీ కూలింగ్‌

11 March 2026

Financial Planning: EMIలో ఐఫోన్ కొంటున్నారా?.. మీరు చెల్లిస్తున్న మొత్తం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..

11 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Eluru News,ఏలూరు: భర్తను బెదిరిద్దామని కూల్‌డ్రింక్ బాటిల్‌లో పురుగులమందు దాచిన భార్య.. అనుకోకుండా తాగి చిన్నారి మృతి – five year old child died after drinking pesticide mistaking it for a cool drink in eluru district
ఆంధ్రప్రదేశ్

Eluru News,ఏలూరు: భర్తను బెదిరిద్దామని కూల్‌డ్రింక్ బాటిల్‌లో పురుగులమందు దాచిన భార్య.. అనుకోకుండా తాగి చిన్నారి మృతి – five year old child died after drinking pesticide mistaking it for a cool drink in eluru district

.By .11 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Eluru News,ఏలూరు: భర్తను బెదిరిద్దామని కూల్‌డ్రింక్ బాటిల్‌లో పురుగులమందు దాచిన భార్య.. అనుకోకుండా తాగి చిన్నారి మృతి – five year old child died after drinking pesticide mistaking it for a cool drink in eluru district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బుట్టాయిగూడెం మండలంలో అంతర్వేదిగూడెంలో కూల్ డ్రింక్ అనుకుని పురుగులమందు తాగి ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అంతర్వేదిగూడెనికి చెందిన ఐదేళ్ల రితిక శ్రీ అనే బాలిక తల్లిదండ్రులు నిత్యం గొడవలు పడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే బాలిక తల్లి తన భర్తను బెదిరించేందుకు కూల్ డ్రింక్ సీసాలో పురుగులమందు దాచిపెట్టుకుంది. అయితే ఈ విషయం గురించి తెలియని చిన్నారి రితిక శ్రీ.. కూల్ డ్రింక్ అనుకుని దానిని తాగేసింది. దీంతో అపస్మారక స్థితిలోకి చేరుకోగా.. తల్లిదండ్రులు బుట్టాయిగూడెం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది.

Eluru
కూల్ డ్రింక్ అనుకుని పురుగులమందు తాగిన చిన్నారి(ఫోటోలు– Samayam Telugu)
ఇద్దరు దంపతుల మధ్యన విభేదాలు.. ఓ అమాయకపు చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. భర్తను బెదిరిద్దామని ఓ ఇల్లాలు చేసిన ప్రయత్నం.. తన కడుపుకోతకు కారణమైంది.ఈ ఘటన ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు బుట్టాయగూడెం మండలంలోని మర్రిగూడేనికి చెందిన నాగేంద్రబాబు అనే వ్యక్తికి.. అంతర్వేదిగూడేనికి చెందిన కుమారి అనే యువతికి ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. ఈ దంపతులు ఇద్దరూ పిల్లలతో కలిసి అంతర్వేదిగూడెంలో నివశిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా నాగేంద్రబాబు, కుమారి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే భర్తను భయపెడదామనే ఉద్దేశంతో కుమారి పొగాకు తోటకు చల్లే పురుగులమందును.. కూల్ డ్రింక్ సీసాలో తెచ్చుకుని ఇంటి వద్ద కంచెకు తగిలించింది. అయితే ఐదేళ్ల రితిక.. బాటిల్‍లో ఉన్నది కూల్ డ్రింక్ అనుకుని పొరబాటుపడి.. మంగళవారం రోజున బాటిల్‍లో ఉన్న పురుగులమందు తాగేసింది. ఆ తర్వాత చిన్నారి నొప్పితో విలవిల్లాడుతూ ఉండటం గమనించిన రితిక కుటుంబసభ్యులు వెంటనే బుట్టాయిగూడెం ఆస్పత్రికి తరలించారు. బుట్టాయిగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి రితిక శ్రీ.. బుధవారం రోజున ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో చిన్నారి తండ్రి నాగేంద్రబాబు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇంటి నుంచి అదృశ్యమై.. శవమై తేలిన యువకుడు..

ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు నాలుగు రోజుల అనంతరం కాలువలో శవమై తేలిన ఘటన.. ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం యాగర్లపల్లికి చెందిన లక్ష్మణ్ అనే 23 ఏళ్ల యువకుడు.. మార్చి 6న ఇంటి నుంచి వెలుపలికి వచ్చాడు. అయితే ఆ తర్వాత ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు అతని ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని నాచుగుంట వద్ద ఏలూరు కాలువలో అతని శవం మంగళవారం రోజున కనిపించింది. పోలీసులు లక్ష్మణ్ మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి