Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Monalisa: ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న మోనాలిసా ఇస్లాం మతంలోకి మారనుందా? ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..

13 March 2026

Tirumala Aksharabhyasam Akshara Govindam,తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయొచ్చు, ‘అక్షర గోవిందం’ పథకం – ttd akshara govindam for aksharabhyasam to kids in tirupati vakulamatha temple

13 March 2026

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»JEE Main 2026 Registration: జేఈఈ మెయిన్‌ దరఖాస్తులకు మరో ఛాన్స్.. మళ్లీ తెరచుకున్న అప్లికేషన్ లింక్! మరికొన్ని గంటలే అవకాశం..
తెలంగాణ

JEE Main 2026 Registration: జేఈఈ మెయిన్‌ దరఖాస్తులకు మరో ఛాన్స్.. మళ్లీ తెరచుకున్న అప్లికేషన్ లింక్! మరికొన్ని గంటలే అవకాశం..

.By .13 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
JEE Main 2026 Registration: జేఈఈ మెయిన్‌ దరఖాస్తులకు మరో ఛాన్స్.. మళ్లీ తెరచుకున్న అప్లికేషన్ లింక్! మరికొన్ని గంటలే అవకాశం..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

JEE Main 2026 Registration: జేఈఈ మెయిన్‌ దరఖాస్తులకు మరో ఛాన్స్.. మళ్లీ తెరచుకున్న అప్లికేషన్ లింక్! మరికొన్ని గంటలే అవకాశం..

హైదరాబాద్‌, మార్చి 13: విద్యార్ధులకు ఎన్టీయే శుభవార్త చెప్పింది. జేఈఈ మెయిన్‌ సెషన్ 2కు దరఖాస్తు చేసుకునేందుకు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) మరో అవకాశం ఇచ్చింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఫిబ్రవరి 26 (గురువారం) రాత్రి 11.50 గంటలకు దరఖాస్తు గడువు ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విండోను మరోమారు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మార్చి 12 (గురువారం) మధ్యాహ్నం నుంచి జేఈఈ మెయిన్ సెషన్‌ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరోమారు ప్రారంభమైంది. శుక్రవారం (మార్చి 13) రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుల్లో మార్పు చేసుకొనే అవకాశం లేదని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకోని విద్యార్ధులు ఈ రోజు రాత్రి గడువు సమయం ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీయే సూచించింది. రిజిస్ట్రేషన్ల గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్ధులకు అవకాశం ఉండబోదని పేర్కొంది.

కాగా జేఈఈ మెయిన్స్‌ సెషన్‌ 2 ఆన్‌లైన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరుగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌ 1కు దేశ వ్యాప్తంగా మొత్తం 13.5 లక్షల మంది హాజరయ్యారు. ఇక సెషన్‌ 2కు కూడా ఇదే స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను ఎన్టీయే విడుదల చేస్తుంది.

జేఈఈ మెయిన్‌ రెండు సెషన్లలో తొలి 2.50 లక్షల మంది ర్యాంకర్లకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 23 నుంచి మే 2వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పరీక్ష మే 17వ తేదీన నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. పేపర్‌ 1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, పేపర్‌ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారికి ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 2026 (ఏఏటీ 2026) పరీక్ష ఉంటుంది. ఏఏటీ-2026 జూన్‌ 4వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఏఏటీ ఫలితాలు జూన్‌ 7, 2026వ తేదీన వెల్లడిస్తారు. జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ 2 నుంచి ప్రారంభమవుతుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

TGRJC CET 2026 Notification: ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ఇంగ్లిష్‌ మీడియం అడ్మిషన్లకు.. టీజీఆర్‌జేసీ సెట్‌ 2026 నోటిఫికేషన్ విడుదల

13 March 2026

Lion: సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా.. ఒక్క దెబ్బకు ఎముకలన్నీ మట్టిలా మారుతాయ్

12 March 2026

CM Revanth Reddy : హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో.. ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

12 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Monalisa: ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న మోనాలిసా ఇస్లాం మతంలోకి మారనుందా? ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..

13 March 2026

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా భోంస్లే , తన ప్రియుడు ఫర్మాన్…

Tirumala Aksharabhyasam Akshara Govindam,తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయొచ్చు, ‘అక్షర గోవిందం’ పథకం – ttd akshara govindam for aksharabhyasam to kids in tirupati vakulamatha temple

13 March 2026

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

13 March 2026

సముద్రంలో చేపల కోసం వల విసిరిన జాలర్లు.. అందులో చిక్కినవి చూసి అంతా షాక్..!

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Monalisa: ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న మోనాలిసా ఇస్లాం మతంలోకి మారనుందా? ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..

13 March 2026

Tirumala Aksharabhyasam Akshara Govindam,తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయొచ్చు, ‘అక్షర గోవిందం’ పథకం – ttd akshara govindam for aksharabhyasam to kids in tirupati vakulamatha temple

13 March 2026

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.