Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

OTT Movies: పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోండి.. ఓటీటీలోకి వచ్చేసిన రవితేజ, విశ్వక్ సేన్ లేటెస్ట్ సినిమాలు

13 March 2026

Monalisa: ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న మోనాలిసా ఇస్లాం మతంలోకి మారనుందా? ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..

13 March 2026

Tirumala Aksharabhyasam Akshara Govindam,తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయొచ్చు, ‘అక్షర గోవిందం’ పథకం – ttd akshara govindam for aksharabhyasam to kids in tirupati vakulamatha temple

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP Inherited Lands Registration New Guidelines,ఏపీలో పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాలను ఈజీగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే – ap govt issued new guidelines to avoid disputes arising in the registration of non agricultural land inherited from ancestors
ఆంధ్రప్రదేశ్

AP Inherited Lands Registration New Guidelines,ఏపీలో పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాలను ఈజీగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే – ap govt issued new guidelines to avoid disputes arising in the registration of non agricultural land inherited from ancestors

.By .13 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP Inherited Lands Registration New Guidelines,ఏపీలో పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాలను ఈజీగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే – ap govt issued new guidelines to avoid disputes arising in the registration of non agricultural land inherited from ancestors
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Govt Inherited Lands Registration New Guidelines: ఏపీలో పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్‌కు చిక్కుముడులు వీడాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ స్థలాలను ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇకపై రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్‌ అవసరం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • ఏపీలో పూర్వీకుల స్థలాల రిజిస్ట్రేషన్‌లో వీడిన చిక్కులు
  • కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
  • ఇకపై రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్‌ తప్పనిసరి కాదు
AP Inherited Lands Registration
పూర్వీకుల స్థలాల రిజిస్ట్రేషన్‌ మార్గదర్శకాలు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారసత్వంగా పూర్వీకుల నుంచి వచ్చే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ భూముల రిజిస్ట్రేషన్‌లకు సంబంధించిన వివాదాలకు పరిష్కరించేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర (నాన్‌ యూఎల్‌బీ) స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్‌ తప్పనిసరి కాదని తెలిపారు. అయితే స్థలం యజమానులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రభుత్వం జారీ చేసిన ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశించారు. చాలామందికి వారసత్వంగా పూర్వీకుల నుంచి వ్యవసాయేత భూములు వచ్చాయి. అయితే భూముల రిజిస్ట్రేషన్ చేసేందుకు హక్కు ఉన్నట్లు వీరి ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే భవిష్యత్తులో చిక్కులు ఎదురవ్వకుండా రెవెన్యూ అధికారుల నుంచి యాజమాన్య హక్కు ఉన్నట్లుగా పొజిషన్‌ సర్టిఫికెట్‌ తీసుకురమ్మని రిజిస్ట్రార్లు అడుగుతున్నారు. అయితే రెవెన్యూ శాఖ నుంచి సర్టిఫికెట్‌ తీసుకోవడం ఇబ్బంది అవుతోంది. అందుకే ఈ ఇబ్బందులకు పరిష్కారంగా, వివాదాలను నివారించేందుకు ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది.

అంతేకాదు ఈ భూముల (గ్రామీణ ప్రాంతాల్లో పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యవసాయేతర స్థలాలు) రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇంకో సూచన చేశార. అంతేకాదు ఈ ఆస్తి వారసత్వంగా వచ్చిందని, ఇతరులకు హక్కు లేదని, నిషేధిత జాబితా (22ఏ)లో లేదని కచ్చితంగా డాక్యుమెంట్‌లో స్పష్టంగా ప్రస్తావించాలి. రిజిస్ట్రేషన్ చేయబోయే స్థలానికి పూర్తి హక్కుదారు తామేనని సెల్ఫ్ డిక్లరేషన్‌ కచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒకవేళ రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాదు రిజిస్ట్రార్లు ఆధార్‌ ఆధారంగా బయోమెట్రిక్‌ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ కుటుంబ వివాదాలు, ప్రభుత్వ భూమి అనే అనుమానాలు వస్తే కనుక ఆ భూమి రిజిస్ట్రేషన్‌ నిలిపివేస్తారు.. ఆ అధికారం అధికారులకు ఇచ్చింది ప్రభుత్వం. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి