
కొన్ని సినిమాలు థియేటర్స్ కు మాత్రమే పరిమితం అవుతాయి. మరికొన్ని సినిమాలు మనతోపాటు ట్రావెల్ అవుతాయి. ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.. ముఖ్యంగా ప్రేమ కథలు అలాంటి వాటిలో 7/జి బృందావన్ కాలనీ సినిమా ఒకటి. ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, హీరో పాత్ర యువతకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను ఎ.ఎం.రత్నం నిర్మించారు. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా రవికృష్ణ, సోనియా అగర్వాల్ నటించారు. ఇక ఈ సినిమా కథ మన పక్కన ఇంట్లోనో.. లేక మన వీదిలోనో జరిగే స్టోరీలా ఉంటుంది. ఈ సినిమా మొదట్లో ప్రేక్షకులకు అనంతగా ఎక్కలేదు.. ఆ తర్వాత మెల్లగా ప్రేక్షకులను ఆకర్షించింది.
కాగా 7/జి బృందావన్ కాలనీ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలన్నీ అభిమానుల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుంది. 2004లో విడుదలైంది 7/జి బృందావన్ మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రవికృష్ణ, సోనియా అగర్వాల్ లు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వీరిద్దరూ సినిమాలకు దూరం అయ్యారు. ఇక ఇప్పుడు 7/జి బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేశారు దర్శకుడు సెల్వ రాఘవన్. అదే సమయంలో ఈ మూవీపోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఎవరు నటిస్తున్నారని ప్రేక్షకులందరూ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
మొదటి భాగం విడుదలై పదేళ్ల తర్వాత ఇప్పుడు రెండో భాగం ప్రకటించడం అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.తాజాగా విడుదలలైన 7/జి బృందావన్ కాలనీ 2 పోస్టర్‌పై దర్శకుడు, సంగీత దర్శకుడు, కెమెరామెన్ పేర్లను మాత్రమే రాశారు. ఈ పోస్టర్‌లో సినిమాలో నటీనటుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. అయితే ఈ సినిమాలో మొదటి భాగంలో నటించిన రవికృష్ణ మరోసారి హీరోగా నటిస్తున్నాడని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ భామ మలయాళంలో ప్రముఖ నటి అనస్వర రాజన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుందని ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఛాంపియన్ సినిమాతో తెలుగుప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అలాగే రీసెంట్ గా విత్ లవ్ అనే సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు 7/జి బృందావన్ కాలనీ 2 నటిస్తుందని అంటున్నారు. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


(@anaswara.rajan)