
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనను సామాన్యులే కాకుండా స్టార్ హీరోలు సైతం అమితంగా అభిమానిస్తారు. అతనినే ఆదర్శంగా తీసుకుని సినిమాలు చేస్తున్నారు. అలా ఒక యంగ్ హీరో చిన్నప్పుడు పవన్‌తో దిగిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పై ఫొటో అదే. మరి అందులో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. అలాగే స్పెషల్ రోల్స్ లోనూ సందడి చేస్తున్నాడు. ఇతని స్పెషాలిటీ ఏంటంటే.. సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో అపయాలు ఎదురైనా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రెండేళ్ల క్రితం ఈ హీరో నటించిన ఒక సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ముఖ్యంగా యూత్ ను తెగ ఆకట్టుకున్న ఈ మూవీ రూ.100 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం హీరో రోల్స్ తో పాటు, సహాయక నటుడిగా, నెగెటివ్ పాత్రలతోనూ మెప్పిస్తోన్న ఈ అబ్బాయి మరెవరో కాదు బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్. ఇవాళ (మార్చి 13)ఈ నటుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా విరాజ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2018లో వచ్చిన ‘అనగనగా ఓ ప్రేమకథ’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు విరాజ్ అశ్విన్. ఆ తర్వాత వచ్చిన తెలుగు షార్ట్ ఫిల్మ్ ‘మనస నామః’ లో ప్రధాన పాత్ర పోషించి, అనేక అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడీ యంగ్ హీరో. థ్యాంక్యూ బ్రదర్, వాళ్లిద్దరి మధ్య వంటి సినిమాల్లోనూ నటించిన విరాజ్ బేబీ సినిమాతో మంచి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇందులో అతని నటన కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీని తర్వాత నాని ‘హాయ్ నాన్న’ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించిన అశ్విన్ చివరిగా శ్రీరంగ నీతులు సినిమాలో యాక్ట్ చేశాడు. ప్రస్తుతం మారీచిక అనే ఓ మూవీ చేస్తున్నాడీ యంగ్ హీరో.
విరాజ్ అశ్విన్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
విరాజ్ అశ్విన్ తండ్రి పేరు జరజాపు వెంకటేశ్వరరావు. ఇస్రోలో సైంటిస్టుగా పనిచేసిన ఆయన కొన్నేళ్ల క్రితమే రిటైర్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా విరాజ్ అశ్విన్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
కుటుంబ సభ్యులతో విరాజ్ అశ్విన్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

