
ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఒక అరుదైన దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. అక్కడ కొలువై ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు..ఓ కొండముచ్చు, నేనున్నా..మీకేం భయంలేదంటూ అభయమిస్తోంది. ఆలయంలో కొండముచ్చు అభయమేంటో ఇప్పుడు చూద్దాం. శింగరకొండ ఆంజనేయ స్వామివారి ఆలయ పరిసరాల్లో గత కొంతకాలంగా కోతుల బెడద ఎక్కువైపోయింది. గుంపులు గుంపులుగా వచ్చే కోతులు భక్తుల చేతిలోని ప్రసాదాలను, వస్తువులను లాక్కోవడమే కాకుండా వారిని ఇబ్బందులకు గురిచేసేవి. మనుషులు ఎంత ప్రయత్నించినా అదుపులోకి రాని ఈ వానర సైన్యాన్ని తరిమికొట్టేందుకు ఆలయ నిర్వాహకులు ఒక వినూత్న ఆలోచన చేశారు. కోతులకు సహజ శత్రువైన కొండముచ్చును రంగంలోకి దించారు. గతంలో అద్దంకి మున్సిపాలిటీ ఉద్యోగి కోటయ్య ఈ కొండముచ్చును నిర్వహిస్తూ ఆలయానికి తీసుకువచ్చేవారు. మధ్యలో ఆయన ఉద్యోగం మానేయడంతో కొండ ముచ్చుకూడా రాలేదు. దీంతో మళ్లీ కోతుల ఆగడాలు పెరిగాయి. భక్తుల ఇబ్బందులను గమనించిన అధికారులు, తిరిగి కోటయ్యను సంప్రదించి కొండముచ్చును ఆలయ ప్రాంగణంలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన కొండముచ్చును చూసి..‘నువ్వు మళ్లీ వచ్చావా’ అన్నట్టుగా.. కోతులు భయపడి దూరంగా పారిపోతున్నాయి. ఈ కొండముచ్చు కేవలం కోతులను తరిమేందుకే పరిమితం కాలేదు. ఆలయానికి వచ్చే భక్తుల పట్ల ఇది ఎంతో స్నేహంగా వ్యవహరిస్తోంది. భక్తుల తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లుగా అది చేసే విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాక్షాత్తూ ఆ ప్రసన్నాంజనేయ స్వామే ఈ వానర రూపంలో తమను ఆశీర్వదిస్తున్నారని భక్తులు నమ్ముతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం ఇవ్వలేదని.. ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
తెలంగాణలో ఒంటిపూట బడులు – పూర్తి షెడ్యూల్ ఇదే
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ !! మీ కోసం సరికొత్త టెక్నాలజీ ప్రారంభం
ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి.. మల్లన్న దర్శనానికి పాదయాత్ర
క్షుద్రపూజల కలకలం.. శివారులో భయానక దృశ్యాలు !!

