
సోషల్ మీడియాలో వింత వార్తలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ప్రజల్ని ఆకర్షిస్తుంటాయి. కోతులు, పిల్లులు, కుక్కలు, పాములు, ఏనుగులు ఇలా పెంపుడు జంతువుల నుండి అడవి మృగాల వరకు వాటి జీవనశైలిని చూసేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అప్పుడప్పుడు వీధుల్లో తిరుగుతున్న ఆవులు, ఎద్దులకు సంబంధించిన వీడియోలు కూడా హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఒక వీధి పశువు చేసిన పని ఇంటర్‌నెట్‌లో వైరల్‌అవుతోంది.
రాజస్థాన్‌లోని బీకానీర్ జిల్లాలో గుండెలు అదిరిపోయే దృశ్యం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా వీధి పశువులు రోడ్లపై తిరుగుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం మనం చూస్తుంటాం. కానీ, ఇక్కడ ఒక ఎద్దు ఏకంగా బిల్డింగ్ పైకప్పుపైకి ఎక్కి, అక్కడి నుండి కిందకు దూకి అందరినీ బెంబేలెత్తించింది. శ్రీదుంగార్‌గఢ్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఒక ఎద్దు మెట్ల ద్వారా లేదా పక్కనే ఉన్న గొడల ద్వారా ఒక దుకాణం పైకప్పుపైకి చేరుకుంది. అది పైకప్పు చివరన నిలబడి ఉండటాన్ని చూసి కింద ఉన్న జనం గుమిగూడారు. దానిని కిందకు దించడానికి ప్రయత్నాలు జరుగుతుండగానే, ఆ ఎద్దు అకస్మాత్తుగా రోడ్డుపైకి గెంతింది.
ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు, ప్రజలు రద్దీగా ఉన్నారు. ఎద్దు దూకడాన్ని చూసిన జనం భయంతో పరుగులు తీశారు. ఆ ఎద్దు నేరుగా రోడ్డుపై పడినా, వెంటనే లేచి పరుగెత్తింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రాజస్థాన్‌లోని వీధి పశువుల సమస్యపై మళ్లీ చర్చ మొదలైంది. రాజస్థాన్‌లో వీధి పశువుల వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. బీకానీర్ మున్సిపల్ కార్పొరేషన్, స్థానిక అధికారులు వీటిని అరికట్టడంలో విఫలమవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
बीकानेर में नंदी महाराज ने मकान के छज्जे से सड़क पर छलांग लगा दी…. pic.twitter.com/fHjhbjm4EV
— आजाद भारत का आजाद नागरिक (@AnathNagrik) March 11, 2026
ఆపణో గావ్ సేవా సమితి వంటి స్థానిక స్వచ్ఛంద సంస్థలు ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాయి. నగరంలో ప్రత్యేకంగా నందీశాలలు (పశువుల షెడ్లు) ఏర్పాటు చేసి, వీధుల్లో తిరిగే పశువులను అక్కడికి తరలించాలని వారు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే శాశ్వత పరిష్కారం కావాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

