Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

టెన్త్ ఎగ్జామ్స్ ఉండవ్.. ఇంటర్ పరీక్షలే కనిపించవ్! SSC-ఇంటర్‌ బోర్డుల విలీనంపై కసరత్తు!!

13 March 2026

ఏళ్ల తరబడి వెయిట్ చేయిస్తున్న స్టార్ హీరోలు

13 March 2026

Monalisa: మోనాలిసా ప్రేమ వివాహంపై స్పందించిన తండ్రి.. ఫర్మాన్ ఖాన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడుగా

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pithapuram Varma Angry On Chandrababu Flexi,చంద్రబాబుకే గౌరవం లేకుంటే.. మేమెందుకు ఇక్కడ? పిఠాపురం వర్మకు కోపం.. – svsn varma serious on officials over chandrababu photo on flexi in pithapuram
ఆంధ్రప్రదేశ్

Pithapuram Varma Angry On Chandrababu Flexi,చంద్రబాబుకే గౌరవం లేకుంటే.. మేమెందుకు ఇక్కడ? పిఠాపురం వర్మకు కోపం.. – svsn varma serious on officials over chandrababu photo on flexi in pithapuram

.By .13 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pithapuram Varma Angry On Chandrababu Flexi,చంద్రబాబుకే గౌరవం లేకుంటే.. మేమెందుకు ఇక్కడ? పిఠాపురం వర్మకు కోపం.. – svsn varma serious on officials over chandrababu photo on flexi in pithapuram
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పిఠాపురం రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కోపంతో పిఠాపురం పాలిటిక్స్‌లో హీట్ పెరిగింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేశారంటూ ఎస్వీఎస్ఎన్ వర్మ అధికారులపై కోప్పడ్డారు. సమావేశంలో మాట్లాడకుండా కూర్చుకున్నారు. అనంతరం టీడీపీ నేతలతో అక్కడి నుంచి వాకౌట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబుకే గౌరవం లేకపోతే తామెందుకు అంటూ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు వర్మ.

Pithapuram SVSN Varma Serious
పిఠాపురం వర్మకు కోపం..(ఫోటోలు– Samayam Telugu)
కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్‌ఎన్ వర్మ అలకబూనారు. పిఠాపురం మున్సిపల్ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం రోజున ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్రలో భాగంగా పిఠాపురంలో పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి జనసేన నేతలతో పాటుగా టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ సైతం హాజరయ్యారు. అయితే వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో చిన్నదిగా ఉండటంపై ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు.

చంద్రబాబు ఫోటో స్టాంప్ సైజులో ఉండటంతో కార్యక్రమానికి హాజరైన టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉంటే ఎలా మాట్లాడతారంటూ ఎస్వీఎస్ఎన్ వర్మకు సూచించారు. దీంతో వేదికపై నుంచి కిందకు దిగిన వర్మ.. వేదిక ముందు కూర్చున్నారు. ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉండటంపై స్థానిక మున్సిపల్ అధికారులపై వర్మ కోపగించుకున్నారు. అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అనుచరులతో కలిసి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఇదే సమయంలో స్థానిక టీడీపీ కౌన్సిలర్లపైనా ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేస్తే మీరేం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబుకే గౌరవం లేనప్పుడు తామెందుకు ఇక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఇంత జరుగుతున్నా వేదికపై ఉన్న జనసేన నేతలు స్పందించకపోవటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికితోడు అధికారులతో మాట్లాడే సమయంలో ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసంటూ ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొనడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు కారణంగా పిఠాపురం సీటు పవన్ కళ్యాణ్‌కు కేటాయించారు. దీంతో ఎస్వీఎస్ఎన్ వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఏపీలో అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చంద్రబాబు పిఠాపురం వర్మకు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఆ దిశగా అడుగులు పడలేదు.

మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారు ఎస్వీఎస్ఎన్ వర్మ. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన పిఠాపురంలో జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. అనేకసార్లు ఈ విషయం బహిరంగంగానే వ్యక్తమైంది. దీంతో పవన్ కళ్యాణ్ లేకుండా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎస్వీఎస్ఎన్ వర్మ.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి