Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: 500కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? పాపం.. ఆ జబ్బు కారణంగా చివరి రోజుల్లో..

13 March 2026

Summer Tips: వేసవిలో తలనొప్పి, కండరాల నొప్పులు వస్తున్నాయా?.. అది మామూలు అలసట అనుకుంటే పొరపాటే..

13 March 2026

Tollywood : చేసింది నాలుగు సినిమాలు.. అన్నీ అట్టర్ ప్లాప్.. దెబ్బకు కనిపించకుండా పోయిన్ హీరోయిన్..

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»టెన్త్ ఎగ్జామ్స్ ఉండవ్.. ఇంటర్ పరీక్షలే కనిపించవ్! SSC-ఇంటర్‌ బోర్డుల విలీనంపై కసరత్తు!!
తెలంగాణ

టెన్త్ ఎగ్జామ్స్ ఉండవ్.. ఇంటర్ పరీక్షలే కనిపించవ్! SSC-ఇంటర్‌ బోర్డుల విలీనంపై కసరత్తు!!

.By .13 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
టెన్త్ ఎగ్జామ్స్ ఉండవ్.. ఇంటర్ పరీక్షలే కనిపించవ్! SSC-ఇంటర్‌ బోర్డుల విలీనంపై కసరత్తు!!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


టెన్త్ ఎగ్జామ్స్ ఉండవ్.. ఇంటర్ పరీక్షలే కనిపించవ్! SSC-ఇంటర్‌ బోర్డుల విలీనంపై కసరత్తు!!

ఒక్క స్టూడెంట్ కూడా లేని స్కూళ్లు ఎన్నున్నాయో తెలుసా తెలంగాణలో. 1920. జీరో ఎన్‌రోల్‌మెంట్. కనీసం మూసేయరు, డెవలప్ చేయరు. స్కూల్ పిల్లల ప్రమాణాలను కొలిచే Annual Status of Education Report సర్వేలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల చదువుల స్థాయి అత్యంత దారుణం, ఆందోళనకరం. ప్రైవేట్‌లో మాత్రం గొప్పగా ఏముంది? లక్షన్నర మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటికొస్తున్నారు ఎవ్రీ ఇయర్. అందులో 20 శాతం మందికి జాజ్‌కు తగ్గ స్కిల్సే లేవు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో ఈ విద్యావ్యవస్థను ఏం చేస్తే బాగుంటుందో సిఫారసు చేయడానికి ఆకునూరి మురళి కమిషన్ వేసింది తెలంగాణ సర్కార్. బట్.. ఆ కమిషన్ రిపోర్ట్‌పై పాజిటివ్ టోన్, నెగటివ్ టోన్ వినిపిస్తోంది. ఇంతకీ ఏమని రిపోర్ట్ ఇచ్చిందా కమిషన్? తెలంగాణ విద్యా విధానంలో రాబోయే మార్పులేంటి?

ఎందుకలా అన్నారు సీఎం రేవంత్. కొన్నేళ్లుగా ఇంటర్మీడియెట్ చుట్టూ చర్చ, రచ్చ జరుగుతూనే ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగింది. ఇంటర్మీడియెట్ అనే ఈ చదువును సంస్కరించాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. కాని, ఇవాళ్టి వరకు అడుగులు పడలేదు. పర్టిక్యులర్‌గా ఇంటర్మీడియెట్ గురించే ఎందుకంటే.. విద్యార్ధులకు అతిపెద్ద భారంగా మారుతున్నది ఈ చదువే. టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ అంటేనే వణుకు చాలామంది స్టూడెంట్స్‌కి. ఎగ్జామ్ రాయకముందే సరిగా మార్కులు రావేమోనని భయపడి చనిపోయిన వాళ్లున్నారు. రిజల్ట్స్ వచ్చాక సరేసరి. అంత పెద్ద గండాన్ని తట్టుకుని, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అవుతారు బిక్కుబిక్కుమని. ఫస్ట్ ఇయర్‌లో మళ్లీ పబ్లిక్ ఎగ్జామ్. అప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి పేరెంట్స్‌కి. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తుంటారు. రెసిడెన్షియల్ కాలేజీలో పడేస్తారు. ‘మార్కులు’.. గుర్తుపెట్టుకో అని ఫోన్ చేసిన ప్రతిసారీ గుర్తు చేస్తుంటారు.

పేరెంట్స్‌ నార్మల్‌గానే చెబుతుండొచ్చు. కాని, అదో వార్నింగ్.. స్టూడెంట్స్ దృష్టిలో. హమ్మయ్య స్కోర్ చేశాం అనుకునే లోపు సెకండర్ ఇయర్‌లో మళ్లీ పబ్లిక్ ఎగ్జామ్. అప్పటికైనా రిలాక్స్ అవుతారా అంటే.. ఆ వెంటనే ఎంసెట్, నీట్, జేఈఈ అంటూ కాంపిటిటివ్ ఎగ్జామ్స్. పోనీ.. అంత కష్టపడి చదివి తెచ్చుకున్న మార్కులు పనికొస్తాయా అంటే.. నో వే. పచ్చిగా చెప్పాలంటే.. ఆ మార్కులకు అసలు విలువే లేదు. టెన్త్ మార్కులు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కు పనికిరావు. ఇంటర్ ఫస్టియర్‌లో చేసిన స్కోర్.. సెకండ్ ఇయర్‌కు పనికిరావు. అసలు ఈ ఇంటర్మీడియెట్ మార్కులేవీ ఎంసెట్, నీట్, జేఈఈకి ఉపయోగపడవు. ఆమాత్రానికి వరుసగా మూడేళ్లపాటు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయడమెందుకు? విద్యార్ధుల మెదళ్లలో ఆటమ్‌బాంబ్ పెట్టి పేల్చడమెందుకు?

సో, దీన్ని మార్చేందుకే విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుత SSC, ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేసి.. ఇకపై నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురాబోతున్నారు.

నిజానికి జాతీయ విద్యావిధానం.. NEP-2020లో కూడా 10+2 అనే ప్రస్తుత విధానాన్ని తీసేశారు. ఆ 10+2 విధానాన్ని తెలంగాణలో కూడా వదిలిపెట్టాలని రికమెండ్ చేసింది ఆకునూరి మురళి నేతృత్వంలోని కమిషన్. SSC బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డులను కలిపి ఒకే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ – TGSEBగా ఏర్పాటు చేయాలని చెప్పింది. ప్రతి మండలంలో సగటున 3 పెద్ద మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసి, ఒకే ప్రాంగణంలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించాలని చెప్పింది. వీటిల్లో ఇంగ్లీష్ బోధనతో పాటు, కోడింగ్, AI వంటి స్కిల్స్ కూడా చేర్చాలంది. సరే.. ఇంతకీ టెన్త్ ఎగ్జామ్స్ పరిస్థితేంటి? ఇప్పుడున్న విధానంలో 10వ తరగతి తర్వాత విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కాని, సిఫార్స్ చేసిన కొత్త విధానంలో 9 నుంచి 12 తరగతుల మధ్య సెమిస్టర్ విధానం పెట్టాలని సూచించింది. సో, దీనివల్ల 10వ తరగతి పబ్లిక్ పరీక్షలంటే భయం పోవడమే కాదు, దాని ప్రాముఖ్యత కూడా తగ్గుతుంది. ఒకేసారి 12వ తరగతి చివర్లో ఒకే బోర్డు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి.. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఎక్కడా ఎగ్జామ్ టెన్షన్ అనేదే ఉండదు.

మెయిన్‌గా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కు ‘బోర్డ్ ఎగ్జామ్’ అనే భయం తగ్గుతుంది. 10వ తరగతి అనేది కేవలం ఒక గ్రేడ్ స్థాయిగా మారి, అసలైన ప్రయారిటీ 12వ తరగతికి ఉంటుంది. అంతేకాదు.. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే కరికులం ఉండటం వల్ల.. సబ్జెక్టుల మధ్య సమన్వయం పెరుగుతుంది. ప్రస్తుతం 10వ తరగతికి, ఇంటర్‌కు మధ్య ఉన్న సిలబస్ గ్యాప్ తగ్గుతుంది. బట్.. ఇందులోనూ నెగిటివ్స్ ఉన్నాయంటున్నారు కొందరు. ప్రస్తుత జూనియర్ కాలేజీలు తమ ప్రత్యేకతను కోల్పోతాయి. ప్రత్యేకతను కాదు.. అసలు అస్తిత్వాన్నే కోల్పోతాయి. జూనియర్ కాలేజ్ అన్న పదమే కనిపించదు. 12th వరకూ కూడా స్కూల్ సెక్షన్లుగానే ఉంటాయి. ఇది లెక్చరర్ల హోదాపై ఇంపాక్ట్ చూపిస్తుందంటున్నారు. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లోని హైస్కూళ్లలో 11, 12 తరగతులు నిర్వహించడానికి అవసరమైన ల్యాబ్‌లు, లైబ్రరీల వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం పెద్ద సవాలు.

ఆకునూరి మురళి కమిషన్ నివేదికలో ఇంకొన్ని రికమెండేషన్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఎంసెట్‌ రద్దు. ఈ ఎంసెట్ వల్ల ఇంటర్మీడియెట్ మార్కులకు ప్రాధాన్యత లేకుండా పోతోందనేది కమిషన్ భావన. అంతేకాదు.. చాలా కాలేజీలు.. జస్ట్ రెండు మూడు నెలల్లోనే సబ్జెక్ట్‌ని కంప్లీట్ చేసి ఎంసెట్ కోచింగ్‌ను మొదలుపెడుతున్నాయట. దీనివల్ల అటు ఇంటర్ సెకండియర్ స్కోర్ కోసం, అటు ఎంసెట్ ర్యాంక్ కోసం ఒకేసారి కష్టపడాల్సి వస్తోంది. అందుకే, ఇంటర్‌లో వచ్చే మార్కులే.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ఎంట్రీకి బేస్ అవ్వాలని చెప్పింది కమిషన్. ఇప్పటిదాకా పాస్ పర్సంటేజ్ 35 శాతమే. ఇకపై దీన్ని 45శాతానికి పెంచాలంది. మెయిన్‌గా IIT-JEE/NEET కోచింగ్‌ సెంటర్లను నియంత్రించేలా చట్టం చేయాలని, తప్పుదారి పట్టించే ప్రైవేట్ కాలేజీల ప్రకటనలపై నియంత్రణ అవసరమని చెప్పింది. అంతేకాదు.. ప్రైవేట్ జూనియర్ కాలేజీల నుంచి పోటీ పరీక్షల కోచింగ్‌ను వేరు చేయాలని సూచించింది. ప్రైవేట్ జూనియర్‌ కాలేజీల పేరుతో కోచింగ్‌ సెంటర్స్‌ బ్యాన్‌ చేయాలని గట్టి ప్రతిపాదనలే చేసింది.

అసలు ఈ ఇంటర్మీడియెట్ అనే కోర్స్ ఎక్కడుంది? తెలుసా? ఏపీ, తెలంగాణ, ఉత్తరాఖండ్, యూపీల్లో. అంతే. చాలా రాష్ట్రాల్లో ఉన్నది టెన్ ప్లస్ టు మాత్రమే. అదే స్కూలింగ్ అంటే. CBSE, ICSE, IB.. ఈ స్కూల్స్ సిలబస్‌లన్నీ టెన్ ప్లస్ టూ విధానమే. సో, ప్రత్యేకించి ఇంటర్మీడియెట్ కోర్స్ ఉండటం వల్ల వచ్చే లాభం ఏంటి? కేవలం.. విద్యను వ్యాపారంగా మార్చడానికి మాత్రమే పనికొస్తోందా?

తెలంగాణలో ఇప్పుడున్న విద్యా విధానం కరెక్ట్ కాదంటోంది సర్కార్. నిజమే. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న డిస్కషనే ఇది. అందుకే, దేశవ్యాప్తంగా ఒక విద్యా విధానం ఉండాలని ఓ పాలసీ తెచ్చింది కేంద్రం. దానికి NEP 2020 అని పేరు పెట్టారు. అందులో 5 + 3 + 3 + 4 విధానం ఉంటుంది. అంటే, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్.. ఇది ఐదేళ్ల ఫౌండేషన్ కోర్స్. ఆ తరువాత మూడేళ్లు ప్రిప్రైమరీ లేదా ప్రిపరేటరీ స్టేజ్. ఇందులో 3, 4, 5 తరగతులు ఉంటాయి. ఇక మిడిల్ స్టేజ్‌లో మూడేళ్లు. అంటే 6, 7, 8 తరగతులు. ఆ తరువాత సెకండరీ స్టేజ్ ఉంటుంది.. అది నాలుగేళ్లు. అంటే 9, 10, 11, 12 తరగతులు. ఏ స్టేజ్‌లో ఏం నేర్పాలో కూడా జాతీయ విద్యావిధానం చెప్పింది.

ఆకునూరి మురళి కమిషన్ కూడా దాదాపుగా జాతీయ విద్యావిధానంతో కోరిలేట్ చేసుకునేలా కొన్ని సూచనలు చేసింది. కాకపోతే.. NEP 2020లో టెన్ ప్లస్ టూ అనేది ఒకే గొడుగు కింద ఉండదు. తెలంగాణలో మాత్రం.. నర్సరీ నుంచి 12th వరకు అన్నీ ఒకే బోర్డ్ కింద ఉంటాయి. అదొక్కటే ఇక్కడ మార్పు. అంతా బాగానే ఉంది గానీ.. ఉపాధ్యాయుల‌కు ఆటోమేటిక్ ప్రమోషన్లు ఉండ‌కూడ‌ద‌ని తెలంగాణ విద్యా క‌మిష‌న్ అభిప్రాయ‌ప‌డింది. టీచర్ల పనితీరును ప్రతి ఐదేళ్లకోసారి రివ్యూ చేయాలి. పనితీరు బాగాకపోతే.. అంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్ కాకపోతే ఆ టీచర్‌కు రెండేళ్ల టైమ్ ఇస్తారు. అప్పటికీ పనితీరు మెరుగుపడకపోతే.. సర్వీస్ నుంచి తొలగించాలి. ఒకవేళ బాగుంటే.. ప్రమోషన్ ఇవ్వాలి. బట్.. ఇప్పటికే సర్వీసులో ఉన్న వారికి దీన్ని అమలు చేయొద్దని కూడా చెప్పింది.

ఈ కొత్త విద్యా విధానంతో డ్రాప్ఔట్స్ తగ్గుతాయనేది ప్రభుత్వ వాదన. పైగా గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య పెరగడమే కాదు.. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పెరుగుతుందని చెబుతోంది. పిల్లల్ని ఒక్కసారి నర్సరీలో జాయిన్ చేస్తే 12th వరకు ఇక ఆలోచించక్కర్లేదు కాబట్టి బడి మానేయడం ఉండదనేది ఓ వాదన. కాని, ఈ విధానం వల్ల డ్రాప్ఔట్స్ పెరుగుతాయనే వాళ్లూ ఉన్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. ప్రైవేట్ కాలేజీ దోపిడీ కచ్చితంగా తగ్గుతుందనేది ప్రభుత్వ అభిప్రాయం. ‘ఇంజనీరింగ్ సీటు’ అనే ఒక్క డిమాండ్‌ను పట్టుకుని.. తల్లిదండ్రులను జూనియర్ కాలేజీలు ఆడిస్తున్న ఆట అంతా ఇంతా కాదు. వాళ్లు చేస్తున్న వ్యాపారం మామూలు స్థాయిలో ఉండడం లేదు. ఇంజనీరింగ్, మెడిసిన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు ఇంటర్మీడియేటే బేస్ అంటూ చేస్తున్న మైండ్ వాష్‌కు హద్దే లేదు. ఇకపై ఆ జంఝాటం నుంచి తెలంగాణ పూర్తిగా బయటకొస్తుందని నమ్ముతోంది ప్రభుత్వం.

ర్యాంకుల కోసం రాచిరంపాన పెడుతున్నారు కాబట్టే ఇంటర్ బోర్డ్ తీసేస్తున్నాం అంటున్నారు సరే. మరి.. నేషనల్ ఎంట్రన్స్ టెస్టుల్లో ర్యాంకులు ఎలా సాధిస్తారు తెలంగాణ స్టూడెంట్స్? ఐఐటీ, జేఈఈ, నీట్‌లో స్టూడెంట్స్ వెనకబడిపోరా ఈ ’10+2′ పాలసీతో అని అంటున్నాయి జూనియర్ కాలేజెస్. కొత్తగా తీసుకురాబోతున్న పాలసీలో కొన్ని నెగటివ్స్ ఉన్నాయంటున్నాయ్. ఇక జూనియర్ కాలేజీలే ఉండవ్.. అనేది నాట్ జస్ట్ ఏ స్మాల్ థింగ్. వేల కోట్ల రూపాయల వ్యాపారానికి పుల్‌స్టాప్ పెట్టే నిర్ణయం అది. ఆ సంగతి పక్కనపెడితే.. కొత్త విద్యా విధానంతో కొన్ని చిక్కులు ఉన్నాయంటున్నాయి జూనియర్ కాలేజెస్. సపోజ్.. 10+2కి మారిస్తే అప్పుడు స్కూల్ అసిస్టెంట్లే.. అంటే స్కూల్ టీచర్లే 11, 12 తరగతులకు క్లాసులు చెప్పాలి. అలాంటప్పుడు NEET, JEE, ఐఐటీ వంటి జాతీయ స్థాయి పరీక్షల ప్రమాణాలకు అనుగుణంగా వాళ్లు బోధించగలరా అనే పెద్ద ప్రశ్న సంధిస్తున్నాయి. దీనివల్ల గ్రామీణ విద్యార్థులు పట్టణాల్లోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై మరింత ఆధారపడాల్సి రావచ్చు కదా అని వాదిస్తున్నాయి.

ఇక సర్వీస్ రూల్స్ గందరగోళం ఏర్పడొచ్చంటున్నాయి. జూనియర్ లెక్చరర్లు, స్కూల్ అసిస్టెంట్ల మధ్య సీనియారిటీ, వేతనాలు, ప్రమోషన్ల విషయంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉందంటున్నాయి. ఒకవేళ ప్రభుత్వ స్కూళ్లలో గనక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే.. ధనిక విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలోనే 12వ తరగతి వరకు ఉండిపోతారు. ఇది పేద, ధనిక విద్యార్థుల మధ్య అంతరాన్ని పెంచుతుందంటున్నారు. ఒకే బోర్డ్ టెన్త్, 12th క్లాసులకు ఎగ్జామ్ పెట్టడం వల్ల పనిభారం పెరిగి, ఫలితాల విడుదల లేదా పేపర్ వాల్యుయేషన్‌లో లోపాలు జరిగే ప్రమాదం ఉందంటున్నాయి. అన్నిటికి మించి.. ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 11, 12 తరగతులు నిర్వహించడానికి అవసరమైన లైబ్రరీలు, సైన్స్ ల్యాబ్‌లు లేవు. తక్షణమే వేల పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి భారీ ఆర్థిక భారంతో కూడుకున్న పని. సో, ఇన్ని నెగటివ్స్ చెబుతున్నాయి జూనియర్ కాలేజీలు.

బట్.. తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు అమలులోకి వస్తే, నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో స్టూడెంట్స్ కచ్చితంగా గట్టి పోటీ ఇవ్వగలరంటోంది ప్రభుత్వం. జాతీయ స్థాయి పోటీ పరీక్షలన్నీ NCERT పాఠ్యపుస్తకాల ఆధారంగా జరుగుతాయి. స్టేట్ బోర్డ్ సిలబస్‌ను ఎన్‌సీఈఆర్‌టీకి సమానంగా మార్చడం వల్ల, విద్యార్థులు అదనపు భారం లేకుండా అకాడమిక్స్‌తో పాటే పోటీ పరీక్షలకు సిద్ధం కావొచ్చనేది ప్రభుత్వ వాదన. పరీక్షల ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి మొదటి నుంచే పోటీ పరీక్షలపై ఫోకస్ పెట్టడానికి వీలుంటుందని చెబుతోంది. ప్రభుత్వం ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జేఈఈ, నీట్ కోసం ఉచిత టెక్-ఎనేబుల్డ్ కోచింగ్ ప్రారంభించాలని నిర్ణయించింది. ఇది గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు అవకాశంగా ఇస్తుందంటోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Telangana: తెలంగాణ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. ఆన్‌లైన్ ద్వారానే వెహికల్ రిజిస్ట్రేషన్.. బైక్, కార్లు ఏదైనా..

13 March 2026

Telangana: ఇది కదా విద్యార్థులకు కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..

13 March 2026

మల్లారెడ్డి సక్సెస్ వెనకున్న శక్తి ఎవరో తెలుసా..? TV9 పోడ్‌కాస్ట్‌లో మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood: 500కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? పాపం.. ఆ జబ్బు కారణంగా చివరి రోజుల్లో..

13 March 2026

నర్రా వెంకటేశ్వరరావు.. ఇప్పటి జనరేషన్ కు ఈ నటుడి గురించి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ.. 80-90 జనరేషన్ కు ఈ…

Summer Tips: వేసవిలో తలనొప్పి, కండరాల నొప్పులు వస్తున్నాయా?.. అది మామూలు అలసట అనుకుంటే పొరపాటే..

13 March 2026

Tollywood : చేసింది నాలుగు సినిమాలు.. అన్నీ అట్టర్ ప్లాప్.. దెబ్బకు కనిపించకుండా పోయిన్ హీరోయిన్..

13 March 2026

Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి కేంద్రం భారీ గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే అన్నీ సేవలు.. యాప్ నుంచే..

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood: 500కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? పాపం.. ఆ జబ్బు కారణంగా చివరి రోజుల్లో..

13 March 2026

Summer Tips: వేసవిలో తలనొప్పి, కండరాల నొప్పులు వస్తున్నాయా?.. అది మామూలు అలసట అనుకుంటే పొరపాటే..

13 March 2026

Tollywood : చేసింది నాలుగు సినిమాలు.. అన్నీ అట్టర్ ప్లాప్.. దెబ్బకు కనిపించకుండా పోయిన్ హీరోయిన్..

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.