Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే

14 March 2026

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? అడవి నుండి జనారణ్యంలోకి.. దేవుజీ ఇంటర్వ్యూలో విస్తుపోయే నిజాలు!

14 March 2026

Mlc Nagababu On Nara Lokesh,నాయకుడు ఉద్భవిస్తున్నాడు.. నారా లోకేష్‌పై నాగబాబు ప్రశంసలు.. – janasena mlc nagababu tweets praising minister nara lokesh

14 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
తాజా వార్తలు

Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు

.By .14 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


1 Mesha Rashi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడు లాభ స్థానంలో బుధ, రాహువులతో కలిసి ఉన్నందు వల్ల ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయి. మీ ఆలోచనలు, ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. బరువు బాధ్యతలు పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. వ్యాపారాల్లో లాభాలు దాదాపు రెట్టింపవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలున్నా పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు మీ సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామికి సమయం అనుకూలంగా ఉంది.

2 Vrushaba Rasi

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ధన స్థానంలో గురువు, లాభ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి శని సంచారం చేస్తున్నందువల్ల ముఖ్యమైన విషయాల్లో సమయం అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అదనపు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు, ఆదరణ లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.

3 Mithuna Rashi

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ రాశిలో గురువు, భాగ్య స్థానంలో రాశ్యధిపతి బుధుడి సంచారం కారణంగా అన్ని విషయాల లోనూ అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక విషయాల్లో వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఇంటా బయటా బరువు బాధ్యతలు కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. సాధారణ సమస్యల్ని, బంధువుల విమర్శల్ని పట్టించుకోవద్దు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలతో కొద్దిగా సమస్యలుండే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాల విషయంలో కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

4 Karkataka Rashi

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో రవి, శనులతో కలిసి ఉండడం వల్ల ఉద్యోగానికి సంబంధించిన ఏ అంశమైనా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్త వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తేలికగా విజయం సాధిస్తారు. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దడంలో తల్లితండ్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలపరంగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. పిల్లలు తేలికగా విజయాలు సాధిస్తారు.

5 Simha Rashi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): సప్తమ స్థానంలో రాశ్యధిపతి రవి కుజ, బుధ గ్రహాలతో అనుకూలంగా ఉండడం, లాభ స్థానంలో గురువు సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఆదాయం బాగానే ఉన్నా, ఇంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో డిమాండ్ పెరుగుతుంది., ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. వాహన యోగం కలుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

6 Kanya Rashi

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): శుభ గ్రహాలైన గురు, శుక్రుల సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పని తీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన పనులన్నీ లాభసాటిగా పూర్తవుతాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. కొందరు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామికి ఆశించిన పురోగతి ఉంటుంది.

7 Tula Rashi

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): భాగ్య స్థానంలో గురువు, షష్ట స్థానంలో రాశ్యధిపతి శుక్రుడి ఉచ్ఛ స్థితి కారణంగా ఆదాయం బాగా పెరిగి, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరగడం వల్ల బాగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. ఒకేసారి అనేక వ్యవహారా లను చక్కబెట్టాలని ప్రయత్నించి ఇబ్బంది పడతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరిగే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు వింటారు.

8 Vrushchika Rashi

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): పంచమంలో శుక్రుడి ఉచ్ఛ స్థితి, చతుర్థంలో రాశ్యధిపతి కుజుడు బుధుడితో యుతి చెందడం శుభ ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా సమయం అనుకూలంగా ఉన్నట్టు భావించవచ్చు. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో పురోగమిస్తారు. కృషికి తగిన ఫలితం అందుతుంది. అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలతో కొద్దిగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్లకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. స్నేహితుల వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

9 Dhanusu Rashi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువు, చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితి శుక్రుడు సంచారం చేయడం వల్ల సుఖ సంతోషాలు, మనశ్శాంతి కలుగుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిఝస్తాయి. చిన్నపాటి ప్రయత్నం కూడా గరిష్ఠంగా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగులకు ఆశించిన సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. అన్ని విషయాలలోనూ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యలపై బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

10 Makara Rashi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ప్రధాన శుభ గ్రహాలైన శుక్ర, బుధులు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారమంతా విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. అన్ని రంగాల్లోనూ అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

11 Kumbha Rashi

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): గురు గ్రహం పంచమ స్థానంలో, శుక్ర గ్రహం ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ప్రధానంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనుకూలతలు ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి, పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. కొందరు మిత్రులు ఆర్థికంగా తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

12 Meena Rasi

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): శుక్ర, గురువులు బాగా అనుకూలంగా ఉన్న కారణంగా దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. ఆదాయ ప్రయత్నాలు ఘన విజయం సాధిస్తాయి. వ్యాపారాలలో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యంలో పాల్గొంటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చి ఇబ్బంది పడతారు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆస్తి వివాదంలో ఆశించిన శుభవార్తలు అందుకుంటారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే

14 March 2026

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? అడవి నుండి జనారణ్యంలోకి.. దేవుజీ ఇంటర్వ్యూలో విస్తుపోయే నిజాలు!

14 March 2026

Curry leaves Chicken Fry: నల్లగా ఉందని తక్కువ అంచనా వేసేరు.. ఈ కరివేపాకు చికెన్ ఫ్రై ఒక్కసారి తింటే వదిలిపెట్టరు..

14 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే

14 March 2026

సాధారణంగా భక్తితో పూజలు చేసే వాళ్లు ఉగాది రోజున నాన్‌వెజ్ ను ముట్టరు. అసలు ఇంట్లోకి కూడా తీసుకురారు. పూజలు…

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? అడవి నుండి జనారణ్యంలోకి.. దేవుజీ ఇంటర్వ్యూలో విస్తుపోయే నిజాలు!

14 March 2026

Mlc Nagababu On Nara Lokesh,నాయకుడు ఉద్భవిస్తున్నాడు.. నారా లోకేష్‌పై నాగబాబు ప్రశంసలు.. – janasena mlc nagababu tweets praising minister nara lokesh

14 March 2026

Curry leaves Chicken Fry: నల్లగా ఉందని తక్కువ అంచనా వేసేరు.. ఈ కరివేపాకు చికెన్ ఫ్రై ఒక్కసారి తింటే వదిలిపెట్టరు..

14 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే

14 March 2026

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? అడవి నుండి జనారణ్యంలోకి.. దేవుజీ ఇంటర్వ్యూలో విస్తుపోయే నిజాలు!

14 March 2026

Mlc Nagababu On Nara Lokesh,నాయకుడు ఉద్భవిస్తున్నాడు.. నారా లోకేష్‌పై నాగబాబు ప్రశంసలు.. – janasena mlc nagababu tweets praising minister nara lokesh

14 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.