Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Telangana: అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి రోజే..

14 March 2026

Sleep: నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

14 March 2026

Hyderabad: గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. ఓపెన్ చేశారంటే ఖాతా ఖాళీనే!

14 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Mlc Nagababu On Nara Lokesh,నాయకుడు ఉద్భవిస్తున్నాడు.. నారా లోకేష్‌పై నాగబాబు ప్రశంసలు.. – janasena mlc nagababu tweets praising minister nara lokesh
ఆంధ్రప్రదేశ్

Mlc Nagababu On Nara Lokesh,నాయకుడు ఉద్భవిస్తున్నాడు.. నారా లోకేష్‌పై నాగబాబు ప్రశంసలు.. – janasena mlc nagababu tweets praising minister nara lokesh

.By .14 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Mlc Nagababu On Nara Lokesh,నాయకుడు ఉద్భవిస్తున్నాడు.. నారా లోకేష్‌పై నాగబాబు ప్రశంసలు.. – janasena mlc nagababu tweets praising minister nara lokesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీద జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రశంసలు కురిపించారు. టీడీపీ నుంచి బాధ్యతాయుతమైన నాయకుడు పుట్టుకొస్తున్నాడంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం స్కూలులో మధ్యాహ్న భోజనం సరిగా లేదంటూ విద్యార్థులు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. దీనికి స్పందించిన నారా లోకేష్ వారికి జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. ఈ నేపథ్యంలో స్కూలులో పొరబాటు జరిగితే.. లోకేష్ బాధ్యత తీసుకున్నారంటూ నాగబాబు ప్రశంసించారు.

Nagababu tweet on Nara Lokesh
నారా లోకేష్ మీద నాగబాబు ప్రశంసలు(ఫోటోలు– Samayam Telugu)
రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రశంసలు అనేవి సహజం. పక్క పార్టీ నేతలపై విమర్శలు గుప్పించే నేతలు, తమ పార్టీ నేతలపై ప్రశంసలు కురిపిస్తుంటారు. అలాగే భాగస్వామ్య పార్టీ నాయకులను కూడా కొనియాడుతుంటారు. ఈ క్రమంలోనే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీద.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రశంసలు కురిపించారు. తెలుగుదేశం పార్టీ నుంచి నాయకుడు ఉద్భవిస్తున్నాడంటూ నాగబాబు నారా లోకేష్ మీద ప్రశంసల జల్లు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని.. సీఎంగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకుంటారంటూ సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని తోట త్రిమూర్తులు వంటి కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్‌ను పొగుడుతూ నాగబాబు ట్వీట్ చేయడంపై నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు. దీంతో నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది..

నాగబాబు ట్వీట్‌లో ఏముందంటే..

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తారకరామానగర్ మండల పరిషత్ స్కూలులో మధ్యాహ్న భోజనం బాగోలేదని విద్యార్థులు చెప్తున్న వీడియో.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఆహార నాణ్యత తక్కువగా ఉందనే విషయం తనకు తెలిసిందని.. ఈ విషయంపై ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా మధ్యాహ్న భోజనం తయారుచేసే ఏజెన్సీని మార్చామని.. ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

మధ్యాహ్న భోజన పథకంపై పర్యవేక్షణ మరింత పెంచుతామని.. లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాన్ని తెలుసుకుంటామన్నారు. దీంతో సమస్యలను వెంటనే గుర్తించవచ్చని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. మంత్రి నారా లోకేష్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన ఎమ్మెల్సీ నాగబాబు.. మధ్యాహ్న భోజనంలో పొరపాటు జరిగితే, అది పాఠశాల తప్పు అయినప్పటికీ మంత్రి లోకేష్ బాధ్యత తీసుకున్నారని ప్రశంసించారు. టీడీపీ నుంచి బాధ్యతాయుతమైన నాయకుడు ఉద్భవిస్తున్నాడంటూ ట్వీట్ చేశారు.

“మైలవరంలోని తారకరామనగర్ మండల పరిషత్ మోడల్ స్కూల్‌లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో ఒక పొరపాటు జరిగింది. అది పాఠశాల తప్పిదమే అయినప్పటికీ, విద్యా మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. నిజమైన బాధ్యతను చూపిస్తున్నారు. ఇది శ్రద్ధ వహించే నాయకుడి లక్షణం. టీడీపీ నుంచి బాధ్యతాయుతమైన నాయకుడు ఉద్భవిస్తున్నాడు” అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి