Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Allu Sirish: నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అల్లు శిరీష్

15 March 2026

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌.. కీలక ఫీచర్‌ నిలిపివేస్తున్న కంపెనీ! ఎందుకంటే?

15 March 2026

అదృష్టం అంటే నీదే సామీ.. రోడ్డుపై దొరికిన కాగితం ముక్కతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»ఏపీలో కొత్త మత్తు మరక.. అట్టాంటి ఇట్టాంటి సరుకు కాదు.. అడ్డగోలుగా నిషేధిత డ్రగ్‌ దందా..!
ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్త మత్తు మరక.. అట్టాంటి ఇట్టాంటి సరుకు కాదు.. అడ్డగోలుగా నిషేధిత డ్రగ్‌ దందా..!

.By .15 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఏపీలో కొత్త మత్తు మరక.. అట్టాంటి ఇట్టాంటి సరుకు కాదు.. అడ్డగోలుగా నిషేధిత డ్రగ్‌ దందా..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో కొత్త మత్తు మరక.. అట్టాంటి ఇట్టాంటి సరుకు కాదు.. అడ్డగోలుగా నిషేధిత డ్రగ్‌ దందా..!

ఏపీలో గంజాయి మాఫియా బెండుతీస్తున్నారు పోలీసులు. కానీ కేటుగాళ్లు మాత్రం మత్తు దందాను మరో రూట్‌లో దౌడ్‌ తీయిస్తున్నారు. మూతపడిన పరిశ్రమలే అడ్డాలుగా భారీగా అల్ఫాజోలంను తయారు చేసి గుట్టుగా బట్వాడా చేస్తున్నారు. ఆల్ఫ్రాజోలం అంటే అట్టాంటి ఇట్టాంటి సరుకు కాదు..

ఏపీలో కొత్త మత్తు మరక.. అడ్డగోలుగా నిషేధిత ఆల్ర్ఫాజోలం డ్రగ్‌ దందా.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపే డెడ్లీ డేంజర్‌ డ్రగ్‌.. ఆల్ఫ్రాజోలం.. ఈ ఆల్ఫ్రాజోలం అనేది కొకైన్‌కు మించిన మత్తు సరుకు. రెండేళ్ల కిందట తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య ఇది విషయాన్ని చెప్పారు. అప్పట్లో తెలంగాణలో ఫార్మా కంపెనీల ముసుగులో ఆల్ఫ్రాజోలం ఉత్పత్తి చేస్తోన్న మాఫియా బెండు తీశారు. కోట్ల విలువ చేసే సరుకును సీజ్‌ చేశారు. కట్‌ చేస్తే ఇప్పుడు ఏపీలో ఇదే హిస్టరీ రిపీటవుతోంది.

కొండపల్లి ఇండస్ట్రియల్‌ ఏరియాలో MS RAYS ఆర్గానిక్స్ పేరిట దందా చేస్తున్న వైనాన్ని డీఆర్‌ఐ సెంట్రల్‌ టీమ్స్‌ బ్రేక్‌ చేశాయి. 47 కోట్ల రూపాయల విలువ చేసే అల్ప్రజోలం తోపాటు, 2860 లీటర్ల కెమికల్స్, 800 కేజీల రా సబ్స్‌టెన్స్ సహా మెషనరీని సీజ్‌ చేశారు. ఫార్మా రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. కొండపల్లి అడ్డాగా ఈ దందా చేస్తున్నట్టు గుర్తించారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గత ఏడాది జనవరి 11వ తేదీన ప్రకాశం జిల్లా దర్శిలో భారీగా అల్ఫ్రాజోలం పట్టుబడింది. ఉమామహేశ్వరం ప్రాంతానికి చెందిన కెమికల్‌ ఇంజినీర్‌ రాజశేఖర్ రెడ్డి పౌల్ట్రీ ఫామ్‌ ముసుగుతో అల్ఫాజోలంను తయారు చేస్తున్న వైనం తనిఖీల్లో బయటపడింది. దర్శి నుంచి కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రకు సరకు సప్లయ్‌ చేస్తున్నట్టు తేలింది.

గతేడాది ఆగస్టు 18వ తేదీన విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్ లో 23 కోట్ల రూపాయల విలువ చేసే 119 కేజీల ఆల్ఫాజోలం DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 8 మంది నిందితులను అరెస్టు చేశారు. అదే ఏడాది డిసెంబర్ 16వ తేదీన నంద్యాల జిల్లా నంది కొట్కూరులోనూ అల్ఫ్రజోలం తయారు చేస్తున్న ముఠాను నేషనల్‌ డొమెస్టిక్‌ ప్రిపేర్డ్‌నేస్‌ కన్సార్టియం (NDPC) అధికారులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు . రెండు కేజీల లిక్విడ్ అల్ఫ్రజోలం స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏడాది కాలంలో దాదాపు వంద కోట్ల ఆల్ఫ్రాజోలం పట్టుపడింది.ఇలా ఓవైపు నిషేధిత డ్రగ్స్‌ తయారీ బరితెగిస్తుంటే, మరోవైపు ధనార్జనే ధ్యేయంగా మెడికల్‌ మాఫియా ఆగడాలు పెరుతున్నాయని కార్మిక సంఘాల నేత దోనెపూడి శంకర్ మండిపడ్డారు.

భారీగా అల్ఫ్రాజోలంను సీజ్‌ చేస్తున్నారు సరే.. కోట్లలో దందా జరుగుతుంటే అసలు కథేంటి? ఫార్మా కంపెనీల పేరిట అనుమతులు తీసుకుని అనధికారికంగా అల్ర్పాజోలం తయారికి బరితెగించారంటే లోపం ఎక్కడ? డ్రగ్‌ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌ ఏం చేస్తున్నట్టు? ఏం చూస్తున్నట్టు? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు నిత్యం ఆయా సంస్థలపై పర్యవేక్షణ చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

తెలంగాణలో పప్పులు ఉడకవని భావించిన డ్రగ్‌ మాఫియా..ఏపీకి షిప్టయింది. ఫార్మూలా సేమ్‌ టు సేమ్‌. ఫార్మా పేరిట అనుమతులు తీసుకోవడం.. ఖాయిలా పడిన పరిశ్రమలు అడ్డాగా ఆల్ఫ్రాజోలంను అక్రమంగా తయారు చేయడం.. ఈ నకరాలకు డీఆర్‌ఐ దాడులతో కళ్లెం పడింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Mana Mitra Whatsapp Number,ఏపీ ప్రజలకు తీపి కబురు.. క్యూలో నిలబడే పనిలేదు, వాట్సాప్‌ నుంచే హాస్పిటల్ ఓపీ రిజిస్ట్రేషన్లు – book government hospital op appointments via mana mitra whatsapp in ap

15 March 2026

Gold Theft Sullurpet,తిరుపతి: పట్టపగలే రెచ్చిపోయిన దొంగ.. కళ్లలో కారం కొట్టి, బంగారం చోరీ.. – jewelry shop owner hit in the eyes with pepper and robbed of gold in sullurpet tirupati district

14 March 2026

Ambati Rambabu: పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి సంచలన కామెంట్స్.. ఏమన్నారంటే..?

14 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Allu Sirish: నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అల్లు శిరీష్

15 March 2026

అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్, నయనిక రెడ్డి వివాహం మార్చి 6న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు…

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌.. కీలక ఫీచర్‌ నిలిపివేస్తున్న కంపెనీ! ఎందుకంటే?

15 March 2026

అదృష్టం అంటే నీదే సామీ.. రోడ్డుపై దొరికిన కాగితం ముక్కతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..

15 March 2026

Gas Cylinder: వీరికి గ్యాస్ సిలిండర్ల డెలివరీ బంద్.. కేంద్రం సంచలన ప్రకటన.. వెనక్కి ఇచ్చేయాలని ఆదేశాలు

15 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Allu Sirish: నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అల్లు శిరీష్

15 March 2026

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌.. కీలక ఫీచర్‌ నిలిపివేస్తున్న కంపెనీ! ఎందుకంటే?

15 March 2026

అదృష్టం అంటే నీదే సామీ.. రోడ్డుపై దొరికిన కాగితం ముక్కతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..

15 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.