Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Suryakumar Yadav : సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే.. వారసుడు వస్తున్నాడోచ్

15 March 2026

అద్దె ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే?

15 March 2026

AP EAPCET 2026 Registration: ఏపీ ఈఏపీసెట్‌ 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»IPL 2026 : డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆర్సీబీ.. ఈసారి గెలిస్తే రోహిత్, ధోనీల సరసన రజత్ పాటిదార్
తాజా వార్తలు

IPL 2026 : డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆర్సీబీ.. ఈసారి గెలిస్తే రోహిత్, ధోనీల సరసన రజత్ పాటిదార్

.By .15 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
IPL 2026 : డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆర్సీబీ.. ఈసారి గెలిస్తే రోహిత్, ధోనీల సరసన రజత్ పాటిదార్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


IPL 2026 : డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆర్సీబీ.. ఈసారి గెలిస్తే రోహిత్, ధోనీల సరసన రజత్ పాటిదార్

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌కు సమయం ఆసన్నమైంది. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కేవలం ఒక జట్టుగా మాత్రమే కాకుండా, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. 2025లో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ, ఇప్పుడు అదే జోష్‌తో రెండో టైటిల్ కోసం సిద్ధమైంది. గత సీజన్ విజేతగా నిలిచిన కోర్ గ్రూప్‌ను అలాగే ఉంచుకుంటూనే, వేలంలో తెలివైన ఎంపికలతో జట్టును మరింత బలోపేతం చేసింది. ఈసారి ఆర్సీబీ గనుక కప్పు కొడితే, ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన మూడో జట్టుగా రికార్డు సృష్టిస్తుంది.

జట్టు కూర్పు విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ తన 19వ సీజన్‌ను అదే ఉత్సాహంతో ఆడేందుకు రెడీ అయిపోయాడు. రజత్ పాటిదార్ సారథ్యంలో టీమ్ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. ఫిలిప్ సాల్ట్, ట్రిస్టన్ స్టబ్స్, దేవ్ దత్ పడిక్కల్ వంటి స్టార్ బ్యాటర్లతో పాటు ఆల్ రౌండర్ల విభాగంలో కృనాల్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్ ఉండటం టీమ్ కు పెద్ద ప్లస్. ముఖ్యంగా ఆర్సీబీకి ఎప్పుడూ శాపంగా మారే బౌలింగ్ విభాగంపై ఈసారి మేనేజ్మెంట్ గట్టిగా దృష్టి పెట్టింది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి యార్కర్ స్పెషలిస్టులతో డెత్ ఓవర్ల కష్టాలకు చెక్ పెట్టాలని చూస్తోంది.

ఆర్సీబీ బలాల్లో ప్రధానంగా ఓపెనింగ్ జోడీని చెప్పుకోవాలి. కోహ్లీ నిలకడ, ఫిలిప్ సాల్ట్ మెరుపు వేగం పవర్‌ప్లేలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం ఖాయం. అలాగే ఫినిషర్‌గా టిమ్ డేవిడ్ ఉండటం జట్టుకు కొండంత అండ. అయితే, ప్రతికూల అంశాలను చూస్తే.. స్పిన్ విభాగం కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. టర్నింగ్ పిచ్‌లపై ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవడం సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా చేతుల్లోనే ఉంది. ఒకవేళ హేజిల్‌వుడ్ లేదా భువనేశ్వర్ వంటి సీనియర్లు గాయపడితే బ్యాకప్ బౌలర్ల విషయంలో ఆర్సీబీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది.

ఈ సీజన్లో ఆర్సీబీ భవితవ్యం మొత్తం నలుగురు ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే ఐపీఎల్‌లో 8000కు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ తన ఫామ్ కొనసాగిస్తే ఆర్సీబీని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. పవర్‌ప్లేలో ఫిలిప్ సాల్ట్ ఇచ్చే మెరుపు ఆరంభం, డెత్ ఓవర్లలో హేజిల్‌వుడ్ వేసే ఖచ్చితమైన యార్కర్లు జట్టుకు కీలకం. వీరితో పాటు ఫినిషర్‌గా టిమ్ డేవిడ్ తన పవర్ హిట్టింగ్‌తో మ్యాచ్‌లను మలుపు తిప్పగలడు. ఈ నలుగురు క్లిక్ అయితే ఆర్సీబీకి ఎదురుండదు.

ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఆర్సీబీ సులభంగా ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ (2019, 2020), సీఎస్కే (2010, 2011) మాత్రమే ఇప్పటివరకు బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ గెలిచాయి. ఇప్పుడు ఆర్సీబీకి ఆ అరుదైన క్లబ్‌లో చేరే సువర్ణావకాశం ఉంది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో టీమ్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండటం, గత సీజన్ గెలిచిన ఆత్మవిశ్వాసం వారిని ఫేవరెట్లుగా నిలబెడుతోంది. ఈసాలా కప్ నమ్దే అన్న నినాదాన్ని ఈసారి కూడా కప్పు మనదే అనేలా మార్చడానికి ఆర్సీబీ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Suryakumar Yadav : సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే.. వారసుడు వస్తున్నాడోచ్

15 March 2026

అద్దె ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే?

15 March 2026

Assembly Election 2026 schedule: ఎన్నికల షెడ్యూల్ విడుదల! ఏ ఏ రాష్ట్రాల్లో ఎప్పుడంటే..

15 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Suryakumar Yadav : సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే.. వారసుడు వస్తున్నాడోచ్

15 March 2026

Suryakumar Yadav : టీమిండియా టీ20 కెప్టెన్, మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఇంట్లో త్వరలో చిన్నారి అడుగుపెట్టబోతోంది.…

అద్దె ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే?

15 March 2026

AP EAPCET 2026 Registration: ఏపీ ఈఏపీసెట్‌ 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..

15 March 2026

Assembly Election 2026 schedule: ఎన్నికల షెడ్యూల్ విడుదల! ఏ ఏ రాష్ట్రాల్లో ఎప్పుడంటే..

15 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Suryakumar Yadav : సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే.. వారసుడు వస్తున్నాడోచ్

15 March 2026

అద్దె ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే?

15 March 2026

AP EAPCET 2026 Registration: ఏపీ ఈఏపీసెట్‌ 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..

15 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.