Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఈ సూపర్ ఫుడ్స్‌తో 50 ఏళ్ళవాళ్లు కూడా 20 ఏళ్లయవ్వనంగా కనిపిస్తారు!

16 March 2026

Whatsapp: వాట్సాప్‌లో ఈ 5 ప్రైవసీ ఫీచర్లు తప్పక ఆన్ చేయండి! లేదంటే నష్టపోతారు!

16 March 2026

Andhra Weather: వాన కబురు వచ్చిందిరో చిన్నోడా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో…

16 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Vishwanath and Sons: ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..
తాజా వార్తలు

Vishwanath and Sons: ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..

.By .16 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vishwanath and Sons: ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Vishwanath and Sons: ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..

సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ద్వారా సంజయ్ విశ్వనాథ్ అనే పాత్ర యొక్క ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భావోద్వేగాలతో నిండిన, ఆసక్తికరమైన సినీ అనుభూతిని అందించనుందని టీజర్ హామీ ఇస్తోంది. టీజర్‌లో సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను చూపించారు. 40 ఏళ్ల వయసులో కూడా తన కలలను వదలకుండా ముందుకు సాగుతున్న వ్యక్తిగా అతడిని పరిచయం చేశారు. సూర్య ఈ సినిమాలో తండ్రి ప్రేమ, భావోద్వేగ లోతు రెండూ కలిసిన ఒక గాఢమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన తెరపై కనిపించిన తీరు, వెంకీ అట్లూరి రాసిన ప్రభావవంతమైన సంభాషణలు.. సూర్య సినీ ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయిన అద్భుతమైన ప్రదర్శనలను గుర్తు చేస్తున్నాయి.

కథకు కొత్తదనాన్ని జోడించే పాత్రలో మమితా బైజు కనిపిస్తున్నారు. ఆమె పాత్ర సినిమాలో ఉత్సాహం, చురుకుదనం తీసుకొస్తుందని టీజర్ సూచిస్తోంది. వయస్సు అంతరం ఉన్న అసాధారణ ప్రేమకథను కూడా ఈ సినిమా చూపించబోతున్నట్టు టీజర్‌లో చూచాయగా తెలిపారు. సున్నితమైన భావోద్వేగాలతో అందమైన కథ చెప్పడం వెంకీ అట్లూరి శైలి. తనదైన ప్రత్యేక శైలి రచనతో.. ఈ అంశాన్ని కూడా లోతుగా, భావోద్వేగ పరిపక్వతతో మధురానుభూతిని కలిగించేలా చూపిస్తారు అనడంలో సందేహం లేదు. విశ్వనాథ్ & సన్స్’ చిత్ర సాంకేతిక విలువలు ఉన్న స్థాయిలో ఉండబోతున్నాయని టీజర్‌ తో స్పష్టమైంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన శక్తివంతమైన నేపథ్య సంగీతం, విజువల్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. ఛాయాగ్రాహకుడు నిమిష్ రవి గొప్పగా, ఆకట్టుకునే ఫ్రేమ్‌లతో సినిమాను కెమెరాలో బంధిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడు బంగ్లాన్ ప్రేక్షకులను కథలో లీనం చేసేలా ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారు.

బలమైన భావోద్వేగాలతో కూడిన భారీస్థాయి కుటుంబ కథా చిత్రంగా ‘విశ్వనాథ్ & సన్స్’ తెరకెక్కుతోంది. అద్భుతమైన తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక బృందాన్ని ఈ చిత్రం ఒకచోట చేర్చింది. ‘లక్కీ భాస్కర్’, ‘వాతి/సార్’ చిత్రాల విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు వెంకీ అట్లూరి, మరో చిరస్మరణీయ చిత్రాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ సినిమా, విజయవంతంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఈ సూపర్ ఫుడ్స్‌తో 50 ఏళ్ళవాళ్లు కూడా 20 ఏళ్లయవ్వనంగా కనిపిస్తారు!

16 March 2026

Whatsapp: వాట్సాప్‌లో ఈ 5 ప్రైవసీ ఫీచర్లు తప్పక ఆన్ చేయండి! లేదంటే నష్టపోతారు!

16 March 2026

తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు

16 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఈ సూపర్ ఫుడ్స్‌తో 50 ఏళ్ళవాళ్లు కూడా 20 ఏళ్లయవ్వనంగా కనిపిస్తారు!

16 March 2026

ఇటీవల కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా 50 ఏళ్ల వయస్సు వచ్చిన వారే వృద్ధులలా మారిపోతున్నారు. అయితే, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు…

Whatsapp: వాట్సాప్‌లో ఈ 5 ప్రైవసీ ఫీచర్లు తప్పక ఆన్ చేయండి! లేదంటే నష్టపోతారు!

16 March 2026

Andhra Weather: వాన కబురు వచ్చిందిరో చిన్నోడా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో…

16 March 2026

తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు

16 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఈ సూపర్ ఫుడ్స్‌తో 50 ఏళ్ళవాళ్లు కూడా 20 ఏళ్లయవ్వనంగా కనిపిస్తారు!

16 March 2026

Whatsapp: వాట్సాప్‌లో ఈ 5 ప్రైవసీ ఫీచర్లు తప్పక ఆన్ చేయండి! లేదంటే నష్టపోతారు!

16 March 2026

Andhra Weather: వాన కబురు వచ్చిందిరో చిన్నోడా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో…

16 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.