Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Song Controversy : ఛీ ఛీ.. ఇదేం సాంగ్.. మరీ ఇంత నీచంగా తీస్తారా.. ? నోరా ఫతేహి పాటపై విమర్శలు..

17 March 2026

Business Idea: యూట్యూబ్‌లో చూసి డైరీ ఫారం పెడుతున్నారా? ముందు ఇవి తెలుసుకోండి.. ఫీజులు ఎగిరిపోతాయ్‌!

17 March 2026

భూమి కొనాలా? స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలా? నిపుణుల సూచన ఇదే!

17 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala June 2026 Darshan Quota Schedule Released,తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు, గదులు.. జూన్ షెడ్యూల్ వచ్చేసింది, బుక్ చేస్కోండి – ttd released schedule for quota of various tirumala darshan and accommodation for the month of june 2026
ఆంధ్రప్రదేశ్

Tirumala June 2026 Darshan Quota Schedule Released,తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు, గదులు.. జూన్ షెడ్యూల్ వచ్చేసింది, బుక్ చేస్కోండి – ttd released schedule for quota of various tirumala darshan and accommodation for the month of june 2026

.By .17 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala June 2026 Darshan Quota Schedule Released,తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు, గదులు.. జూన్ షెడ్యూల్ వచ్చేసింది, బుక్ చేస్కోండి – ttd released schedule for quota of various tirumala darshan and accommodation for the month of june 2026
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala June 2026 Darshan Quota Schedule: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. జూన్ నెలకు సంబంధించి టీటీడీ దర్శనాలు, గదులు ఆన్‌లైన్ కోటా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి కోటాను విడుదల చేశారు. భక్తులు జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, గదుల్ని బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. భక్తులు టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

హైలైట్:

  • తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
  • జూన్ నెల కోటా షెడ్యూల్ వచ్చింది
  • ఈ నెల 18 నుంచి బుకింగ్స్ ప్రారంభం
Tirumala Darshan Quota June 2026
తిరుమల జూన్ నెల దర్శన కోటా షెడ్యూల్ విడుదల(ఫోటోలు– Samayam Telugu)
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. ప్రతి నెలా టీటీడీ ఆర్జితసేవలు, దర్శనాలు, గదులకు సంబంధించి ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. టీటీడీ 2026 జూన్ నెలకు సంబంధించిన ఆర్జితసేవలు, వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 18న ఉదయం 10 గంట‌ల‌కు తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ టికెట్లు పొందిన వారు మార్చి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

మరోవైపు ఈ నెల 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్ లో విడుదల చేయ‌నుంది. ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనుంది. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది టీటీడీ.

ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి.. శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.

కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. సోమవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌ జీయర్ స్వామి,ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు ఏపీ ఆనంద‌కుమార్ దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవాళ ఉదయం 8 నుండి 9 గంటల మధ్య మేష ల‌గ్నంలో ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి