
ఒకటి రెండు సినిమాలకు డబ్బింగ్ చెప్పినట్లు తెలిపారు. ప్రకాష్ రాజ్ ఒక సినిమా, కన్నడలో తీసి ఇక్కడ డబ్ చేసిన ఇంటింటి మా ఇంటి రామాయణం వంటి చిత్రాలలో పోలీసు పాత్రలకు డబ్బింగ్ చెప్పానని గుర్తుచేసుకున్నారు. సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లను నిర్మించే ఆలోచనపై స్పందిస్తూ, తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. అందుకు రెండు ప్రధాన కారణాలు చెప్పారాయన. మొదటిది, తన వయసును పరిగణనలోకి తీసుకోవాలి అని, రెండవది, తన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారని, తనకు మనవరాలు, మనవళ్ళు ఉన్నారని చెప్పారు. అంతకు మించి, తనకున్న వ్యాపారం లాస్ట్ ఇయర్ రూ.45 కోట్ల టర్నోవర్ సాధించిందని, ఈ సంవత్సరం రూ.56-57 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తూ, రూ.60 కోట్లకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తన అంతిమ లక్ష్యం రూ.100 కోట్ల టర్నోవర్‌ను సాధించడమేనని వెల్లడించారు.
ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‌కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..
సినిమా నిర్మాణ రంగంలో నియంత్రణ చాలా తక్కువగా ఉంటుందని, నిర్మాత చేతిలో ఏమీ ఉండదని, అందువల్ల ఈ వయసులో ప్రయోగాలు చేయడం సరికాదని మానవ కోటేశ్వర రావు అభిప్రాయపడ్డారు. 35-40 ఏళ్ల వయస్సులో అయితే అనుభవం వస్తుందని ఒక ఆశ ఉండేదని, కానీ ఇప్పుడు అలాంటిది లేదని చెప్పారు. సరదాగా డబ్బులు పెట్టి సినిమా తీసి తెరపై తనను తాను చూసుకోవాలనే ఆసక్తి తనకు లేదన్నారు. గతంలో 2008 లేదా 2009లో ఒక సీరియల్ నిర్మించడానికి ప్రయత్నించినప్పటికీ, ఆర్థికంగా లాభదాయకం కాకపోవడం, నటీనటుల విషయంలో టర్మ్స్ కుదరకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‌కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..
తన కోరికలైన 60 ఏళ్ల వయసు పాత్రలను పోషించడం, వ్యాపారంలో రూ.100 కోట్ల టర్నోవర్ సాధించడం నెరవేరాలని అన్నారు. రూ.100 కోట్లు వచ్చినా సినిమా తీయబోనని, కానీ మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని స్పష్టం చేశారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..
ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

