Ap Govt To Refund Tidco Houses Application Fees,ఏపీలో టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. డబ్బులు మొత్తం వెనక్కివ్వాలని చంద్రబాబు ఆదేశాలు – refund the application fees of those who were not allotted tidco houses during the previous governments tenure says cm chandrababu
AP Govt Refund TIDCO Houses Application Fees: ఏపీలో గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించినా ఫ్లాట్ల కేటాయించని వారికి ఊరట దక్కింది. వీరందరికి డబ్బులు వెనక్కివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొత్తం 83,865 మంది దరఖాస్తుదారులకు రూ.174 కోట్లు వెనక్కివ్వాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 1,00,875 టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని.. త్వరలోనే లబ్ధిదారులకు అందించి, గృహప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టిడ్కో ఇళ్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో చాలామంది టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించారు. అయినా సరే ఫ్లాట్లు కేటాయింపులు జరగని వారికి వాళ్ల దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లించాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. ఇలా ఫ్లాట్లు కేటాయించనివారు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 83,865 మంది దరఖాస్తుదారులు ఉన్నారన్నారు. వీరందరికి మొత్తం రూ.174 కోట్లు వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షకుపైగా టిడ్కో ఇళ్లనిర్మాణం పూర్తయ్యిందని.. లబ్ధిదారులకు ఇళ్లు అందజేసి, వారితో త్వరలో గృహప్రవేశాలు చేయించాలని.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్‌తో ఉన్న డిజిటల్ డోర్ నంబర్లు త్వరగా కేటాయించాలని.. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఆస్తి పన్ను నుంచి అన్ని వివరాలు లింక్ చేయాలని సూచించారు. గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో తాగునీరు కలుషితం కాకుండా వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ఉండాలన్నారు. సురక్షితమైన తాగు నీరు కోసంస్మార్ట్ వాటర్ పైప్‌లైన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. 100 రోజుల ప్రణాళికతో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల పనులు చేపట్టాలన్నారు. విశాఖపట్నాన్ని బీచ్ సిటీగా, విజయవాడ- అమరావతిని కెనాల్సిటీలుగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అంతేకాదు రాష్ట్రంలో మున్సిపల్ షాపుల అద్దెల్ని మూడేళ్లకొకసారి 33శాతం వద్దని సూచించారు. అంతేకాదు గోదావరి పుష్కరాలకు సంబంధించి అఖండ గోదావరి ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో త్వరలోనే మరో 70 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని సూచించారు చంద్రబాబు. అమరావతిలో గాలి నాణ్యత పెంచడంపై దృష్టి పెట్టాలని.. అమరావతిలో పూర్తయిన ఎమ్మెల్యేల క్వార్టర్లు నెలాఖరులో పరిశీలిస్తానన్నారు. పురమిత్ర యాప్‌ను ఏకంగా 17లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అధికారులు వివరించారు. పురమిత్ర యాప్ ద్వారా 92వేల ఫిర్యాదులు రాగా.. వాటిని పరిష్కరిస్తామన్నారు. ఎక్కడైనా ఎక్కువ ఫిర్యాదులు వస్తే.. ఆ ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా గుర్తించి స్థానిక అధికారులు పరిష్కరించేలా చూడాలన్నారు చంద్రబాబు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 ను కార్యక్రమంలా కాకుండా ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాలన్నారు సీఎం. ‘రాష్ట్రంలోని పేదలకు చేయూత ఇచ్చేలా చేపట్టిన ఈ విశిష్ట కార్యక్రమానికి మార్చి 30 తేదీ నాటికి ఏడాది పూర్తి కావొస్తుండటంతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలి. తొలి ఏడాదిలో ఇప్పటి వరకూ 2.5 లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాము, బంగారు కుటుంబాలకు చేయూతను ఇవ్వటంలో ఆదర్శంగా నిలిచిన మార్గదర్శులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు ఇవ్వాలి’ అని సూచించారు చంద్రబాబు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి