డ్రై ఫ్రూట్స్ పాయసానికి కావాల్సిన పదార్దాలు: నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ 10 బాదం పప్పులు , 10 జీడిపప్పు, పిస్తా, అంజీర్, 20 ఖర్జూరాలు, మూడు కప్పులు పాలు, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ చక్కెర లేదా బెల్లం, రుచికి తగినంత కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి.
డ్రై ఫ్రూట్స్ పాయసం తయారీ విధానం: ముందుగా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. నానబెట్టిన జీడిపప్పు, అంజీర్,
బాదం, ఖర్జూరాలను తీసుకుని మిక్సీలో వేసుకుని కొద్దిగా నీళ్ళు /పాలు వాటిలో పోసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ఒక పాత్రలో నెయ్యి వేసి అది వేడయ్యాక పక్కన పెట్టుకున్న బాదం, జీడిపప్పు ముక్కలను రంగు మారే వరకు బాగా వేయించి ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి.
డ్రై ఫ్రూట్స్ ఉడికించడం: ఇక ఇప్పుడు అదే పాత్రలో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసి 5 నిమిషాల పాటు బాగా వేయించాలి.
ఇక ఇప్పుడు పాలను తీసుకుని దానిలో పోసి బాగా కలిపి, మీడియం మంట మీద 20 నిమిషాల పాటు చిక్కబడే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా మరిగించాలి. ఆ తర్వాత రుచికి సరిపడా చక్కెర లేదా బెల్లం, ఒక టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేసి దించేయాలి.






