Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!

19 March 2026

Dhurandhar 2: ధురంధర్ 2లో ప్రధాని మోదీ గురించి సర్‌ప్రైజింగ్ సీన్స్…

19 March 2026

ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన.. కొనసాగుతున్న సహాయక చర్యలు!

19 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోతే ఇలా చేయండి.. పరిగెత్తుకుంటూ వస్తుంది.! చట్టం చెప్పేది ఇదే
తాజా వార్తలు

పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోతే ఇలా చేయండి.. పరిగెత్తుకుంటూ వస్తుంది.! చట్టం చెప్పేది ఇదే

.By .19 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోతే ఇలా చేయండి.. పరిగెత్తుకుంటూ వస్తుంది.! చట్టం చెప్పేది ఇదే
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోతే ఇలా చేయండి.. పరిగెత్తుకుంటూ వస్తుంది.! చట్టం చెప్పేది ఇదే

భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు వచ్చినప్పుడు, సాధారణంగా మహిళలకే చట్టపరమైన సహాయం ఎక్కువగా లభిస్తుందనే భావన సమాజంలో బలంగా పాతుకుపోయింది. అయితే, భర్తలు కూడా కొన్ని సందర్భాలలో తమ భార్యల నుంచి తప్పుడు కేసుల వల్ల లేదా ఇతర వేధింపుల వల్ల బాధితులుగా మారుతున్నారు. హైకోర్టు అడ్వకేట్ పావని ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో చర్చించారు. భర్తలకు అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలు, పరిష్కారాలను ఆమె వివరించారు. పురుషాధిక్య సమాజం కారణంగా మహిళలపై అత్యాచారాలు, దురాచారాలు జరిగే అవకాశాలు ఎక్కువ అనే ఉద్దేశ్యంతో అనేక చట్టాలు వారికి అనుకూలంగా రూపొందించారు. అయితే, ఇటీవల కాలంలో ఈ చట్టాలను మహిళలు దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా(చట్టాన్ని దుర్వినియోగపరుచుకోవడం) కింద, భార్యలు తమ భర్తలపై చిన్న చిన్న విషయాలకే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ముఖ్యంగా సెక్షన్ 498A IPC(భర్త, అతని బంధువులచే వరకట్న వేధింపులు), డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ (వరకట్నం), డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ (గృహహింస) వంటి చట్టాలను తప్పుగా ఉపయోగిస్తున్నారు. అడ్వకేట్ పావని స్వయంగా ఇలాంటి అనేక కేసులను డీల్ చేస్తున్నట్లు తెలిపారు.

భర్తలకు అందుబాటులో ఉన్న చట్టపరమైన పరిష్కారాలు:

1. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్(సెక్షన్ 9, హిందూ మ్యారేజ్ యాక్ట్): భార్య ఎటువంటి సరైన కారణం లేకుండా భర్తను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, భర్త కోర్టులో సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. భార్యను తనతో కాపురం చేయమని కోర్టు ఆదేశాలు జారీ చేయమని అభ్యర్థించవచ్చు. ఈ సెక్షన్ భార్యాభర్తలు ఇద్దరికీ వర్తిస్తుంది.

2. ముందస్తు పోలీస్ కంప్లయింట్: భార్య తనపై తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉందని భర్తకు అనుమానం ఉంటే, ముందుగానే పోలీస్ కంప్లయింట్ నమోదు చేయవచ్చు. ఇది భర్తకు “షీల్డ్” లాగా పనిచేస్తుంది. భార్య తదనంతరం కేసులు పెడితే, తాను ముందే ఫిర్యాదు చేసిన విషయాన్ని కోర్టుకు తెలియజేసి, ఆమె తప్పుడు కేసులు పెడుతుందని నిరూపించుకోవచ్చు. ఇది అరెస్టు నుంచి, తదుపరి కేసులలో బయటపడటానికి సహాయపడుతుంది.

3. భార్య వేధింపులకు వ్యతిరేకంగా కేసులు: భర్తను భార్య శారీరకంగా కొట్టినా, హింసించినా, ఐపీసీ సెక్షన్ 323 (హర్ట్) కింద కేసు పెట్టవచ్చు. అలాగే, భయపెట్టినా, బెదిరించినా ఐపీసీ సెక్షన్ 506 (క్రిమినల్ ఇంటిమిడేషన్) కింద కేసు నమోదు చేయవచ్చు. “నిన్ను చంపేస్తాను” అని బెదిరిస్తే, సెక్షన్ 506 పార్ట్ 2 కింద కేసు పెట్టే అవకాశం ఉంది.

4. పరువు నష్టం దావా (డిఫమేషన్): నలుగురిలో భర్త పరువుకు భంగం కలిగించేలా భార్య అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించినా, అబద్ధాలు చెప్పినా, అది క్రూయల్టీ (పైశాచికత్వం) కిందకు వస్తుంది. భర్త ఐపీసీ సెక్షన్ 499 కింద క్రిమినల్ డిఫమేషన్ కేస్ దాఖలు చేయవచ్చు.

5. మెయింటెనెన్స్ కేసులలో రక్షణ (సెక్షన్ 125 CrPC): భార్య ఎటువంటి సరైన కారణం లేకుండా భర్తను వదిలి వెళ్ళిపోయి, తిరిగి రావడానికి ఒప్పుకోకపోతే, భర్త మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టులో నిరూపించుకోవచ్చు.

6. ఆత్మహత్యకు ప్రేరేపణ (సెక్షన్ 306 IPC): భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నట్లయితే, భర్త తల్లిదండ్రులు లేదా బంధువులు సెక్షన్ 306 IPC కింద సదరు భార్యపై కేసు పెట్టవచ్చు. డౌరీ డెత్ కేసు (304B) మహిళలకు వర్తించినట్లే, భర్తలకు కూడా ఈ సెక్షన్ రక్షణ కల్పిస్తుంది.

సమాజంలో మగవాళ్ళు తమ బాధలను బయటకు చెప్పుకోవడానికి వెనుకాడతారు. “భార్యను అదుపులో పెట్టుకోలేనివాడు మగాడేనా?” వంటి మాటలు వారిని మరింత కుంగదీస్తాయి. కానీ, ఎవరివల్లా భయం లేకుండా, తమ హక్కుల గురించి అవగాహన పెంపొందించుకొని, న్యాయ సహాయం తీసుకోవాలని అడ్వకేట్ పావని సూచించారు. సరైన సాక్ష్యాధారాలతో కేసు నిరూపించుకుంటే, భర్తలకు కూడా న్యాయం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. చట్టాలు అందరికీ సమానమేనని, బాధితులు ఎవరైనా తమ హక్కుల కోసం పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!

19 March 2026

Dhurandhar 2: ధురంధర్ 2లో ప్రధాని మోదీ గురించి సర్‌ప్రైజింగ్ సీన్స్…

19 March 2026

ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన.. కొనసాగుతున్న సహాయక చర్యలు!

19 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!

19 March 2026

వసంత నవరాత్రుల ప్రత్యేకత.. వసంత నవరాత్రులను చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు. శ్రీరామనవమితో ముగియడం వల్ల వీటిని రామ…

Dhurandhar 2: ధురంధర్ 2లో ప్రధాని మోదీ గురించి సర్‌ప్రైజింగ్ సీన్స్…

19 March 2026

ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన.. కొనసాగుతున్న సహాయక చర్యలు!

19 March 2026

AP Lawcet 2026 Exam Date: ఏపీ లాసెట్‌ దరఖాస్తుకు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్.. లింక్‌ ఇదే

19 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!

19 March 2026

Dhurandhar 2: ధురంధర్ 2లో ప్రధాని మోదీ గురించి సర్‌ప్రైజింగ్ సీన్స్…

19 March 2026

ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన.. కొనసాగుతున్న సహాయక చర్యలు!

19 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025154
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.