Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! | AP CM Chandrababu reviewed the Markapuram bus accident.. cm revanth reddy expressed shock

26 March 2026

IPL Records : ఒకే ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు.. చెన్నై గడ్డపై తను సృష్టించిన సునామీ 14 ఏళ్లయినా చెక్కు చెదరలేదు

26 March 2026

పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం | Mother Killed Infant Because She Cried for Milk — Atrocity in Tirupati District in andhrapradesh

26 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Katuri Subbarao 1 Crore Donation To School,గుంటూరు: సొంతూరిలో స్కూలు కోసం రూ. కోటి విరాళం.. – katuri medical college chairman subbarao donates 1 crore to kondapaturu high school in kakumanu of guntur
ఆంధ్రప్రదేశ్

Katuri Subbarao 1 Crore Donation To School,గుంటూరు: సొంతూరిలో స్కూలు కోసం రూ. కోటి విరాళం.. – katuri medical college chairman subbarao donates 1 crore to kondapaturu high school in kakumanu of guntur

.By .20 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Katuri Subbarao 1 Crore Donation To School,గుంటూరు: సొంతూరిలో స్కూలు కోసం రూ. కోటి విరాళం.. – katuri medical college chairman subbarao donates 1 crore to kondapaturu high school in kakumanu of guntur
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సొంతూరిలో పాఠశాల నిర్మాణం కోసం కాటూరి మెడికల్ కళాశాల అధినేత కాటూరి సుబ్బారావు కోటి రూపాయలు విరాళంగా అందించారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని కొండపాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాల నిర్మాణం కోసం కోటి రూపాయలు అందించారు. ఈ మేరకు బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా కాటూరి సుబ్బారావును ఊరిజనం అభినందించారు. ఈ నగదుతో స్కూలు భవనాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మించనున్నారు.

katuri subbarao donation to Kondapaturu school
పాఠశాల నిర్మాణం కోసం కాటూరి మెడికల్ కళాశాల అధినేత కాటూరి సుబ్బారావు కోటి విరాళం(ఫోటోలు– Samayam Telugu)
కాటూరి మెడికల్ కాలేజీ అధినేత కాటూరి సుబ్బారావు తన పెద్ద మనసు చాటుకున్నారు. గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో ఉన్న కొండపాటూరు జెడ్పీ హైస్కూలు కోసం కోటి రూపాయలు విరాళం అందించారు. కొండపాటూరు జెడ్పీ హైస్కూలు నూతన భవనం నిర్మాణం కోసం సుబ్బారావు రూ. కోటి విరాళం అందించారు. సొంతూరిలో పేద విద్యార్థుల కోసం కొత్త స్కూలు భవనాలు నిర్మించేందుకు కాటూరి సుబ్బారావు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే కొండపాటూరు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో.. కాటూరి సుబ్బారావు కోటి రూపాయల నగదును బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేశారు. ఈ నగదును పాఠశాలల నూతన భవనాలు, సాంకేతిక విద్య కోసం ఓ గదిని ఏర్పాటు చేయనున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా కాటూరి సుబ్బారావు కృషిని గ్రామ ప్రజలు అభినందించారు.

కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్.. గుంటూరులోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. గుంటూరుకు 15 కిలోమీటర్ల దూరంలో గుంటూరుకు నైరుతి దిశలో చిలకలూరిపేట వైపు ఉంది. ఈ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు బోధిస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ కాలేజ్ ఉంది. మరోవైపు కాలేజీ అధినేత కాటూరి సుబ్బారావు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ క్రమంలోనే సొంతూరిలోని విద్యార్థుల కోసం, వారి చదువుల కోసం నూతన పాఠశాల భవనాల నిర్మాణం కోసం ఈ మొత్తం విరాళంగా అందించారు. దీనిపై గ్రామస్థుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ఓ పథకాన్ని అమలు చేస్తోంది. పీ4 పేరుతో ఈ కార్యక్రమం అమలు చేస్తోంది. సంపన్న వర్గాలు.. నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించటమే పీ4 కార్యక్రమం ఉద్దేశం. పీ4 కార్యక్రమంలో దత్తత తీసుకునే వారిని మార్గదర్శులని.. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా అభివర్ణిస్తారు. పేద ప్రజలకు విద్య, ఉపాధితో పాటుగా జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ పథకం ఉద్దేశం. మార్గదర్శులు, బంగారు కుటుంబాల మధ్యన వారధిగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే పలు కుటుంబాలను దత్తత తీసుకున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి