Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

21 March 2026

Eggshell Uses: గుడ్డు పెంకులను పారేస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే షాకవుతారు!

21 March 2026

హేయ్..! మత్తువదలరా 2 బ్యూటీ.. నువ్వేనా..? బయట భలే ఉంది భయ్యా..!!

21 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»IMD Alert: దేశవ్యాప్తంగా పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్

IMD Alert: దేశవ్యాప్తంగా పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

.By .21 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
IMD Alert: దేశవ్యాప్తంగా పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


IMD Alert: దేశవ్యాప్తంగా పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాబోయే కొన్ని రోజులపాటు తూర్పు, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సబ్‌హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో మార్చి 21 నుంచి 24 వరకు విస్తృత వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గంగేటిక్ పశ్చిమ బెంగాల్‌లో గంటకు 80 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా, ఒడిశాలో 70 కి.మీ. వేగంతో గాలులు వీచి వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం, త్రిపురలో విస్తృతంగా వర్షాలు, పిడుగులు పడే అవకాశముంది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో మార్చి 24న కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు, మధ్య భారతంలోని బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా విడివిడిగా వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర పశ్చిమ భారతదేశంలో కూడా వాతావరణం మారనుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మార్చి 23న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కూడా గాలులు గంటకు 40 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం కొనసాగుతోందన్నారు ఐఎండీ శాస్త్రవేత్త అఖిల్ శ్రీవాస్తవ తెలిపారు. ఢిల్లీలో ఇప్పటికే వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. సోమవారం సాయంత్రం వరకు వర్షాలు కొనసాగవచ్చని, అయితే రేపటి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో గంటకు 60–70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. దక్షిణ రాష్ట్రాలు, మహారాష్ట్రలో కూడా విడివిడిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే తీర ప్రాంతాల్లో వేడి, తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఏపీకి పిడుగుపాటు హెచ్చరిక

అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి , ఏలూరు,ఎన్టీఆర్, గుంటూరు,పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశముందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలి.  పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదు. ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించండి.

Also Read: మీకు బొటన వేలు, మణికట్టు మధ్య నొప్పి ఉందా..? అయితే.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Youth Away From Marriage,పిల్లల సంగతి అటుంచి.. పెళ్లే వద్దంటున్న ఏపీ యువత.! – many andhra pradesh youth shying away from marriage and parenthood

21 March 2026

Monkey Attack Old Woman Died Kakinada,కాకినాడ: మనిషిని చంపేసిన కోతులు.. 20 వానరాలు ఒక్కసారిగా దాడి చేసి.. – old woman died in a monkey attack at peddipalem in prathipadu mandal of kakinada district

21 March 2026

మీ అరచేతిలో ‘X’ గుర్తు ఉందా.. అయితే జరగబోయేది ఇదే…

21 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

21 March 2026

బుల్లితెరపై సీరియల్ తారలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ టీవీల్లో వచ్చే సీరియల్ నటీనటులకు స్టార్…

Eggshell Uses: గుడ్డు పెంకులను పారేస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే షాకవుతారు!

21 March 2026

హేయ్..! మత్తువదలరా 2 బ్యూటీ.. నువ్వేనా..? బయట భలే ఉంది భయ్యా..!!

21 March 2026

Kitchen Hacks: వేసవిలో కూరగాయలు, పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంచే సూపర్ టిప్స్.. ఏం చేయాలంటే?

21 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

21 March 2026

Eggshell Uses: గుడ్డు పెంకులను పారేస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే షాకవుతారు!

21 March 2026

హేయ్..! మత్తువదలరా 2 బ్యూటీ.. నువ్వేనా..? బయట భలే ఉంది భయ్యా..!!

21 March 2026
Most Popular

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025186

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025185
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.