Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

జీలకర్ర నీళ్లు Vs మెంతి నీళ్లు.. ఈ రెండిటిలో ఆ సమస్యలకు ఏది బెస్ట్..? ఈ సీక్రెట్స్ తెలుసుకోండి..

22 March 2026

Home Tips: గ్యాస్‌ సిలిండర్‌తో పనిలేదు.. జస్ట్ ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు.. వంటకు డోకాలేనట్టే!

22 March 2026

Dreams: కలలో బంగారం, వెండి కనిపిస్తే ఏమవుతుందో తెల్సా.. జరిగేది ఇదే.!

22 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Swastik Chikara : 69 బంతులు.. 21 సిక్సర్లు.. 195 రన్స్..తనను తీసుకోనందుకు కసి తీర్చుకున్న ఆర్సీబీ అన్ సోల్డ్ ప్లేయర్
తాజా వార్తలు

Swastik Chikara : 69 బంతులు.. 21 సిక్సర్లు.. 195 రన్స్..తనను తీసుకోనందుకు కసి తీర్చుకున్న ఆర్సీబీ అన్ సోల్డ్ ప్లేయర్

.By .22 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Swastik Chikara : 69 బంతులు.. 21 సిక్సర్లు.. 195 రన్స్..తనను తీసుకోనందుకు కసి తీర్చుకున్న ఆర్సీబీ అన్ సోల్డ్ ప్లేయర్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Swastik Chikara : 69 బంతులు.. 21 సిక్సర్లు.. 195 రన్స్..తనను తీసుకోనందుకు కసి తీర్చుకున్న ఆర్సీబీ అన్ సోల్డ్ ప్లేయర్

Swastik Chikara : క్రికెట్‌లో టైం అందరికీ వస్తుంది. తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ప్రతి ఒక్కరికీ ఒక అవకాశం దొరుకుతుంది. సరిగ్గా ఇదే విషయాన్ని మరోసారి నిరూపించాడు యంగ్ సెన్సేషన్ స్వాస్తిక్ చికారా. ఐపీఎల్ వేలంలో అవమానం ఎదురైనా, తనేంటో ప్రపంచానికి చాటి చెప్పేందుకు అయోధ్య ప్రీమియర్ లీగ్‎ను వేదికగా చేసుకున్నాడు. మార్చి 22న జరిగిన మ్యాచ్‌లో స్వాస్తిక్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తుంటే, టీ20 క్రికెట్ చరిత్రలో ఇలాంటి విధ్వంసం గతంలో ఎప్పుడూ చూడలేదనిపిస్తోంది. ప్రత్యర్థి జట్టు మొత్తం చేసిన స్కోరు కంటే స్వాస్తిక్ ఒక్కడే చేసిన పరుగులే ఎక్కువగా ఉండటం విశేషం.

అయోధ్యలో చికారా విశ్వరూపం

అయోధ్య ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గోమతీ థండర్, హిండన్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గోమతీ థండర్ ఓపెనర్లు స్వాస్తిక్ చికారా, ప్రియాన్షు పాండే క్రీజులోకి దిగి ఇన్నింగ్స్ ముగిసే వరకు అజేయంగా నిలిచారు. స్వాస్తిక్ చికారా కేవలం 69 బంతుల్లో 195 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 21 సిక్సర్లు, 11 ఫోర్లు ఉండటం గమనార్హం. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక బ్యాటర్ 195 పరుగులు చేయడం ఇదే తొలిసారి. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 282.6గా నమోదైంది.

రికార్డు స్థాయిలో 307 పరుగుల భాగస్వామ్యం

గోమతీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 307 పరుగులు చేసింది. స్వాస్తిక్ వీరబాదుడు బాదుతుంటే, మరోవైపు ఓపెనర్ ప్రియాన్షు పాండే కూడా తక్కువ తినలేదు. అతను 54 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరి మధ్య జరిగిన 307 పరుగుల అజేయ భాగస్వామ్యం టీ20 క్రికెట్ ప్రపంచంలోనే ఒక సంచలనం. ప్రత్యర్థి బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు.

వేలంలో ఎవరూ కొనలేదు

స్వాస్తిక్ చికారా గత ఐపీఎల్ సీజన్ వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఆ ఫ్రాంచైజీ అతడిని విడుదల చేసింది. వేలంలో 10 జట్లలో ఏ ఒక్క జట్టు కూడా స్వాస్తిక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. తనను విస్మరించిన జట్లకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని కసితో ఉన్న స్వాస్తిక్, ఈ లీగ్‌లో తన అసలు సిసలు విశ్వరూపాన్ని చూపించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఐపీఎల్ జట్లు ఖచ్చితంగా పశ్చాత్తాపపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

హిండన్ టైటాన్స్ ఘోర పరాజయం

308 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హిండన్ టైటాన్స్ జట్టు ఒత్తిడికి చిత్తయింది. గోమతీ థండర్ బౌలర్ల ధాటికి వారు కేవలం 180 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఫలితంగా గోమతీ థండర్ 89 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. నిజం చెప్పాలంటే, స్వాస్తిక్ చికారా ఒక్కడు చేసిన 195 పరుగుల స్కోరును కూడా హిండన్ టైటాన్స్ జట్టు మొత్తం కలిసి దాటలేకపోయింది. ఈ ప్రదర్శనతో స్వాస్తిక్ రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

జీలకర్ర నీళ్లు Vs మెంతి నీళ్లు.. ఈ రెండిటిలో ఆ సమస్యలకు ఏది బెస్ట్..? ఈ సీక్రెట్స్ తెలుసుకోండి..

22 March 2026

Home Tips: గ్యాస్‌ సిలిండర్‌తో పనిలేదు.. జస్ట్ ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు.. వంటకు డోకాలేనట్టే!

22 March 2026

Dreams: కలలో బంగారం, వెండి కనిపిస్తే ఏమవుతుందో తెల్సా.. జరిగేది ఇదే.!

22 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

జీలకర్ర నీళ్లు Vs మెంతి నీళ్లు.. ఈ రెండిటిలో ఆ సమస్యలకు ఏది బెస్ట్..? ఈ సీక్రెట్స్ తెలుసుకోండి..

22 March 2026

మన దైనందిన జీవితంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఇంటి చికిత్సలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన…

Home Tips: గ్యాస్‌ సిలిండర్‌తో పనిలేదు.. జస్ట్ ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు.. వంటకు డోకాలేనట్టే!

22 March 2026

Dreams: కలలో బంగారం, వెండి కనిపిస్తే ఏమవుతుందో తెల్సా.. జరిగేది ఇదే.!

22 March 2026

నమ్మకానికి ముప్పు ఈ రాశులా? మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి!

22 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

జీలకర్ర నీళ్లు Vs మెంతి నీళ్లు.. ఈ రెండిటిలో ఆ సమస్యలకు ఏది బెస్ట్..? ఈ సీక్రెట్స్ తెలుసుకోండి..

22 March 2026

Home Tips: గ్యాస్‌ సిలిండర్‌తో పనిలేదు.. జస్ట్ ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు.. వంటకు డోకాలేనట్టే!

22 March 2026

Dreams: కలలో బంగారం, వెండి కనిపిస్తే ఏమవుతుందో తెల్సా.. జరిగేది ఇదే.!

22 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025198

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025196

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.