Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఒకే ట్రిప్‌లో తమిళనాడు పుణ్యక్షేత్రాలు.. IRCTC ప్రత్యేక యాత్రకు ఇప్పుడు బుక్ చేయండి!

22 March 2026

20 ఏళ్లుగా నో లిక్కర్.. చుక్క మద్యం ముట్టని ఈ గ్రామం స్పెషాలిటీ ఏంటో తెలుసా?

22 March 2026

Telangana Weather Alert: ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఐఎండీ (IMD) హెచ్చరిక!

22 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Water Supply,Vizag: నగరవాసులకు అలర్ట్.. రేపు (మార్చి23) ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం – drinking water supply to be disrupted in parts of visakhapatnam on march 23
ఆంధ్రప్రదేశ్

Water Supply,Vizag: నగరవాసులకు అలర్ట్.. రేపు (మార్చి23) ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం – drinking water supply to be disrupted in parts of visakhapatnam on march 23

.By .22 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Water Supply,Vizag: నగరవాసులకు అలర్ట్.. రేపు (మార్చి23) ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం – drinking water supply to be disrupted in parts of visakhapatnam on march 23
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విశాఖ ప్రజలకు ముఖ్య గమనిక. మెయిన్ పంపింగ్ స్టేషన్‌లోని పాత మోటార్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మార్చి 23వ తేదీ సోమవారం విశాఖలోని పలు ప్రాంతాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. అలాగే అంతర్జాతీయ నీటి దినోత్సవం సందర్భంగా.. నీటిని పొదుపుగా, బాధ్యతాయుతంగా వాడుకోవాలని కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు.

Vizag water supply
విశాఖలో తాగునీటి సరఫరా(ఫోటోలు– Samayam Telugu)
విశాఖపట్నం ప్రజలకు ముఖ్య గమనిక. విశాఖలోని పలు ప్రాంతాలలో రేపు (మార్చి 23) తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. మెయిన్ పంపింగ్ స్టేషన్‌లో పాత మోటార్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మార్చి 23వ తేదీన కొన్ని ప్రాంతాలలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగవచ్చని అధికారులు తెలిపారు. టౌన్ సర్వీస్ రిజర్వాయర్ నుంచి హై లెవల్ రిజర్వాయర్ వరకూ మోటార్లను మార్చనున్నారు. ఈ నేపథ్యంలో ఈస్ట్‌జోన్‌లోని వార్డు నంబర్ 20- ఈస్ట్ పాయింట్ కాలనీ, పెదవాల్తేరు, 21వ వార్డులోని తమిల్ స్ట్రీట్, విద్యానగర్ కాలనీ, రెళ్లి వీధి, ఆంధ్రా యూనివర్సటీ ఔట్ గేట్ వెనుక ప్రాంతం, సీబీఐ ఆఫీస్, మైత్రి నగర్, వినయగర్ అపార్టుమెంట్లు, కిర్లంపూడి లేఅవుట్, స్విమ్మింగ్ పూల్ ఏరియా, పాండురంగాపురం బీచ్ రోడ్డు, ఓసియన్ వ్యూ లేఅవుట్ ఏరియా, చిన్న వాల్తేరు ప్రాంతంలో నీటి సరఫరాలో ఇబ్బందులు కలగనున్నాయి.

అలాగే 22వ వార్డులోని బాలాజీ నగర్, టైమ్స్ ఆఫ్ ఇండియా కార్యాలయ ప్రాంతం, సిద్ధార్థ నగర్.. 28వ వార్డులోని ఫేకోర్ లేఅవుట్, రామ్ నగర్. చుట్టుపక్కల ప్రాంతాలలో నీటి సరఫరాకు ఆటంకం కలగనుంది. జీవీఎంసీ వెస్ట్ జోన్‌లోని 24వ వార్డులో ఉన్న ఓల్డ్ రెసపువనిపాలెం, వినాయక్ నగర్, తులసి ఓట. స్వర్ణభారతి స్టేడియం ప్రాంతం ఉన్నాయి. విశాఖ సౌత్‌జోన్‌కు సంబంధించి అశోక్ నగర్, రామా టాకీస్ రోడ్, శ్రీనగర్, బుధిల్ రోడ్డు, రెడ్డి హాస్పిటల్ రోడ్డు, శ్రీనగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, ద్వారకా నగర్ రోడ్, అమర్ నగర్ చర్చి రోడ్డు, సీబీఎం కాంపౌండ్ ప్రాంతాలతో తాగునీటి సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు.

మరోవైపు అంతర్జాతీయ నీటి దినోత్సవం సందర్భంగా.. ప్రజలందరూ నీటిని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కోరారు. ముఖ్యంగా వేసవి కాలంలో మరింత బాధ్యతగావాడాలని, సుస్థిర జల సంరక్షణకు మద్దతు ఇవ్వాలని కోరారు.శాస్త్రీయ ప్రణాళిక, జల సంరక్షణ, మురుగునీటి పునర్వినియోగం, భూగర్భ జలాల పరిరక్షణ, జలాశయాల పునరుజ్జీవనం, అమృత్ 2.0 కార్యక్రమాల ద్వారా నీటి సంరక్షణకు జీవీఎంసీ కట్టుబడి ఉందన్నారు. ప్రతి నీటి చుక్కకు విలువ ఇద్దామని.. నీటి భద్రత కలిగిన విశాఖపట్నం కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి